మైసూరు: మైసూరుకు రాజ వంశానికి చెందిన శ్రీకంఠదత్త నరసింహరాజు ఒడెయార్ మైసూరు పార్లమెంటుకు బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. అయితే ఆయన దత్త కుమారుడు యదువీర్ శ్రీకంఠదత్త చామరాజ ఒడెయార్ బీజేపీ నుంచి పోటీ చేసి మొదటిసారే విజయం సాధించారు. శ్రీకంఠదత్త నరసింహరాజు ఒడెయార్ 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో కాంగ్రెస్ పారీ్టలో చేరి మైసూరు ఎంపీగా పార్లమెంట్‌కు పోటీ చేసి మొదటిసారి విజయం సాధించారు.
అనంతరం 1991లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అనంతరం ఆ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రప్రభ అరసుపై ఓటమి చవి చూశారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరి 1996, 1999లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.
2004 ఎన్నికలో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సీహెచ్ విజయశంకర్‌పై ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలను దూరంగా ఉన్నారు. శ్రీకంఠ దత్త నరసింహరాజు ఒడెయార్ మరణాంతరం రాజవంశానికి చెందిన వారు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు.
అయితే రాజమాత ప్రమోదాదేవి రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. ఆమె అయిష్టత చూపారు. 2015 ఫిబ్రవరి 23న యదువీర్ కృష్ణరాజ చామరాజ ఒడెయార్‌ను ప్రమోదాదేవి దత్తత తీసుకున్నారు. యదువంశానికి చెందిన 27వ యువరాజు శ్రీకంఠదత్త ఒడెయార్‌కు సంతానం లేదు. ప్రస్తుతం ఆయన దత్త కుమారుడు యదువీర్ మైసూరు–కొడగు పార్లమెంట్ నియోజకర్గానికి పోటీ చేసి విజయం సాధించారు.
యదువీర్‌కు 1.30 లక్షల మెజారిటీ
కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణ్‌కు 6,56,241 ఓట్లు, యదువీర్‌కు 7,95,503 ఓట్లు వచ్చాయి. యదువీర్‌కు 1,39,262 ఓట్ల మెజారిటీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment