మైసూరులో 144 సెక్షన్ పొడిగింపు | City is peaceful: Mysuru Police Commissioner | Sakshi
Sakshi News home page

మైసూరులో 144 సెక్షన్ పొడిగింపు

Mar 15 2016 6:30 PM | Updated on Sep 3 2017 7:49 PM

మైసూరులో 144 సెక్షన్ పొడిగింపు

మైసూరులో 144 సెక్షన్ పొడిగింపు

శ్రీరామ సేన కార్యకర్త హత్యతో ఉద్రిక్తతలు నెలకొన్న మైసూరులో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

మైసూరు: శ్రీరామ సేన కార్యకర్త హత్యతో ఉద్రిక్తతలు నెలకొన్న మైసూరులో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. టెన్షన్ సద్దుమణిగిందని, పరిస్థితులు చక్కబడ్డాయని మైసూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద తెలిపారు. పోలీస్ పెట్రోలింగ్ పెంచామని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) బలగాలు మొహరించామని వెల్లడించారు. 144 సెక్షన్ ను గురువారం రాత్రి వరకు పొడిగించినట్టు చెప్పారు. నగరం ప్రశాంతంగా ఉందని, ఎక్కడా సమస్య లేదని అన్నారు.

ఆర్ఎస్ఎస్ రాజుగా సుపరిచితుడైన రాజును ఆదివారం నలుగురు దుండగులు హత్య చేశారు. దీంతో బీజేపీ, హిందూ సంస్థలు సోమవారం మైసూరు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో అదనపు బలగాలు మొహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement