toddy
-
జీలుగు నీరా.. లాభాలు ఔరా
రంపచోడవరం: నీరా చూసేందుకు కొబ్బరినీళ్లలా ఉంటుంది. సూర్యోదయానికి ముందు చెట్టు నుంచి తీసినదాన్ని నీరా అంటారు. పోషకాలు, ఔషధ గుణాలు మెండుగా ఉండే ఈ పానీయాన్ని ఇష్టపడనివారు ఉండరు. ఇప్పటికే అల్లూరి జిల్లాలో తాటి చెట్ల నుంచి నీరా (Neera) సేకరిస్తున్నారు. జీలుగు నీరాను కూడా శాస్త్రీయ పద్ధతుల్లో సేకరించేందుకు పందిరిమామిడి కేవీకే (pandirimamidi Krishi Vigyan Kendra) శాస్త్రవేత్తలు ఇటీవల పలు పరిశోధనలు జరిపారు. ఇప్పటి వరకు తాటిపై పరిశోధనలు పందిరిమామిడి కేవీకే శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు తాటిపై మాత్రమే పరిశోధనలు చేశారు. తాటి నుంచి నీరా సేకరణ, దానితో వివిధ ఆహార ఉత్పత్తులు తయారు చేయడంలో మంచి ఫలితాలను సాధించారు. జిల్లాలో తాటితో పాటు జీలుగు చెట్లు (Jeelugu Tree) అధిక సంఖ్యలో ఉండడంతో జీలుగు చెట్టు నుంచి నీరా సేకరణ, ఇతర ఉత్పత్తుల తయారీపై కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్రప్రసాద్ దృష్టి సారించారు. కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశాలతో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.నీరా... చెట్టు నుంచి సహజంగా లభించే అద్భుత పానీయం... పోషక విలువలెన్నో ఉన్న ఆరోగ్య ప్రదాయిని. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న జీలుగు చెట్ల నీరాపై పందిరి మామిడి కేవీకే శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. నీరా నుంచి సిరప్, బెల్లం, ఇతర పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేసి, తద్వారా గిరిజనులకు అధిక ఆదాయాన్ని సమకూర్చాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల పందిరి మామిడి కేవీకేను సందర్శించిన అల్లూరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సేకరణఇలా.. సూర్యోదయానికి ముందే తాటి, జీలుగు చెట్ల గెలలను ట్యాపింగ్ చేసి, కూలింగ్ ఉండే విధంగా కవర్లను, కూలింగ్ క్యాన్లను ఏర్పాటు చేసి నీరాను సేకరిస్తారు. చెట్ల నుంచి వచ్చిన ద్రవం చల్లదనంలో కాకుండా ఎక్కువ సేపు బయట ఉంటే కల్లుగా మారుతుంది. శాస్త్రవేత్తలు కల్లుగా కాకుండా నీరాగా తీసే విధంగా ఆధునిక టెక్నాలజీతో చేసిన పరిశోధనలు మంచి ఫలితాలిచ్చాయి. నీరాతో తయారు చేసిన పదార్థాలలో మంచి పోషక విలువలు ఉంటాయి. జీలుగు చెట్లు సముద్ర మట్టానికి 450 నుంచి 500 మీటర్ల ఎత్తు గల కొండ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. మారేడుమిల్లి, వై.రామవరం అప్పర్ పార్ట్ సముద్రమట్టం కంటే ఎత్తులో ఉండడంతో ఈ ప్రాంతంలో జీలుగు చెట్లు అధికంగా ఉన్నాయి.సిరప్, బెల్లం తయారీకేవీకే శాస్త్రవేత్తలు జీలుగు నీరాతో సిరప్, బెల్లం తయారు చేశారు. నీరాను మంట మీద సుమారు మూడు గంటల వరకు మరగపెడతారు. దాని నుంచి మంచి ఆరోమా వస్తూ చిక్కపడిన తరువాత పానకం దశలో ఉండగా మంటమీద నుంచి తీసివేస్తే సిరప్గా తయారవుతుంది. పంచదార,చెరకు బెల్లానికి ప్రత్యామ్నాయంగా దీనిని వినియోగించవచ్చు.ఎన్ని రోజులైన నిల్వ ఉంటుంది. జీలుగు నీరాను మూడున్నర గంటల మరగపెడుతూ పానకం దశ దాటిన తరువాత, ఎక్కువ సేపు కలుపుతూ ఉంటే పాకం గట్టిపడి బెల్లంగా మారుతుంది. వీటిని స్వీట్ల తయారీలో ఉపయోగించవచ్చు.తాటికంటే అధికంగా కల్లు ఉత్పత్తి జిల్లాలో మారేడుమిల్లి, వై.రామవరం అప్పర్ పార్ట్ మినహా అన్ని చోట్ల తాటి చెట్లు విరివిగా కనిపిస్తాయి. ఒక తాటి చెట్టు నుంచి రోజుకు నాలుగైదు లీటర్ల వరకు మాత్రమే కల్లు సేకరించగలరు. అదే జీలుగు చెట్టు నుంచి రోజుకు 40 నుంచి 60 లీటర్ల వరకు కల్లు ఉత్పత్తి అవుతుంది. తాటి కల్లును సొంతంగా వాడుకోవడంతో పాటు ఎక్కువగా ఉంటే దాని నుంచి చిగురు (కల్లును మరగబెట్టి ఆవిరి నుంచి తయారు చేసే సారా) తయారు చేసుకుంటారు. జీలుగు కల్లును మాత్రం గిరిజనుల నుంచి సేకరించి జిల్లాలో నలుమూలలతో పాటు మైదాన ప్రాంతాలకు వ్యాపారులు రవాణా చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో జీలుగు కల్లు లభించడమే ఇందుకు ప్రధాన కారణం.చదవండి: ఆధునిక రుషుల తపోవనంనీరా సేకరణ, ఉత్పత్తులపై శిక్షణ జీలుగు నీరా, ఉత్పత్తుల తయారీపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.గోవిందరాజులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల కేవీకేను సందర్శించిన కలెక్టర్ దినేశ్‌కుమార్‌కు జీలుగు నీరా గురించి వివరించడంతో ఆయన వెంటనే స్పందించి, జిల్లాలో ఎన్ని జీలుగు చెట్లు ఉన్నాయో సమగ్ర సర్వే నిర్వహించాలని దిశ నిర్దేశం చేశారు. నీరా ఉత్పత్తిని జిల్లా అంతా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రణాళికలు తయారీ చేయాలని ఆదేశించారు. తాటి, జీలుగులను కలిపి ఒక బోర్డు ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో మంచి ఫలితాలు ఉంటాయి. –డాక్టర్ రాజేంద్రప్రసాద్, కేవీకే కోఆర్డినేటర్,సీనియర్ శాస్త్రవేత్త, పందిరిమామిడిజీలుగు చెట్లపై సర్వే జిల్లాలో మారేడుమిల్లి, వై.రామవరం, చింతూరు, రాజవొమ్మంగి, పాడేరు, కొయ్యూరు, అరకు, చింతపల్లి ,జీకే వీధి, డుంబ్రిగుడ తదితర మండలాల్లో ఈ చెట్లు అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెట్లు ఉన్నాయో సర్వే చేయనున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా జీలుగు నీరా సేకరణకు కార్యాచరణ రూపొందిస్తారు. కొంతమంది రైతులను కలిపి ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి, శాస్త్రీయంగా నీరా సేకరణ జరిపేందుకు చర్యలు తీసుకోనున్నారు. -
‘చెప్పు’కోలేని బాధలు..
సైదాపూర్ (హుజూరాబాద్): యూరియా తదితర ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు ఉదయమే చేరుకున్నారు. ప్రస్తుతం యాసంగి నేపథ్యంలో ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో ఎరువులు తీసుకెళ్తుంటారు. కానీ ఆ సమయంలో గేటు తీయకపోవడంతో.. గోడపై నుంచి లోపలికి దూకి చెప్పులను క్యూలో పెట్టారు. గోడపై ఉదయం 10 గంటల వరకు కూర్చుని నిరీక్షించారు. అధికారులు ఎరువుల కొరత తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.పంటలు తడారి.. పొలాలు ఎడారిరాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి. వరినాట్లు వేసిన రైతులు పంట పొలాలకు నీరు సరిపోకపోవడంతో ఎండుతున్న పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పంట పొలాల్లో గొర్రెలను మేపుతున్నారు. మండల కేంద్రానికి చెందిన కాకల్ల ఎల్లయ్య, గొల్లపల్లి శ్రీనులు తమకున్న భూమిలో ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు వరి సాగు చేశారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం.. వారం రోజులుగా ఎండలు తీవ్రం కావడంతో భూగర్భ జలాలు అడుగంటి పొలాలకు నీరు అందడం లేదు. దీంతో ఎండిపోయిన వరి పొలంలో మూగజీవాలను తోలి మేపుతున్నారు. వర్ణాల పొద్దుఉదయాస్తమయాలు ఎప్పుడూ మనోహరమే. ప్రకృతి ప్రేమికులకు పరవశమే. పగలంతా వెలుగులు నింపే భానుడు.. సాయం సంధ్య వేళ కాషాయరంగులో నిష్క్రమించడం అద్భుతమే. పెద్దపల్లి శివారులో సూర్యాస్తమయమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి స్కానర్ కొట్టు.. కల్లు పట్టు మారుతున్న కాలానికి అనుగుణంగా మారితేనే మనుగడ సాధ్యం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన గీత కార్మికుడు గంగపురపు వెంకన్న ఇందుకు నిదర్శనం. వెంకన్న వద్దకు కల్లు తాగడానికి వచ్చే వారిలో ఎక్కువ మందికి స్మార్ట్ ఫోన్ ఉంది. వెంకన్న వద్ద స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో చెల్లింపులకు ఇబ్బంది ఏర్పడి.. గిరాకీ దెబ్బ తింది. దీంతో చేసేదిలేక వెంకన్న ఇటీవల తన బ్యాంక్ ఖాతాపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కల్లు ప్రియులంతా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. డబ్బు చెల్లించి కల్లు తాగుతున్నారు. – కేసముద్రంయక్షగాన కళాకారుల భిక్షాటన టీవీలు, స్మార్ట్ ఫోన్ల రాకతో వీధి నాటకాలు అంతరించి పోయాయి. నేటి తరానికి యక్షగానం అంటే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆదరణ లేక యక్షగాన కళాకారులు.. బతుకు కోసం భువనగిరిలో భిక్షాటన చేస్తూ కనిపించారు. – భువనగిరి టౌన్చదవండి: ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరుగుమ్మి.. జ్ఞాపకాలు విరజిమ్మి గ్యాస్ పొయ్యిలు వచ్చాక కట్టెల పొయ్యిల్ని మరిచిపోయారు. కానీ ఒకప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి వంట చేయాలంటే.. కంకిబెండ్లు, పిడకలు, కట్టెలు.. సేకరించి.. ఇలా గుమ్మిలో దాచుకోవలసిందే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనుకుల గ్రామ శివారులోని ఓ ఇంట్లోని గుమ్మిలో దాచిన కంకిబెండ్లు పాత జ్ఞాపకాలను ఇలా గుర్తు చేశాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
కల్లు లొట్టి కతం పెట్టిన మంత్రి ఎర్రబెల్లి
-
మనోభావాలు ముఖ్యం.. ఆచితూచి వ్యవహరించాలి
గీత వృత్తికి చెందిన గౌడ కులస్థుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో... వారి సంక్షేమార్థం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భువనగిరి జిల్లా ‘నందనం’ అనే గ్రామంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో నీరా శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం పట్ల సర్వతా హర్షం వ్యక్తమైంది. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై నెక్లెస్ రోడ్డులో ఒక నీరా హబ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో దానికి ‘వేదామృతం’ అని పేరు పెట్టారు. అదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. హైదరాబాద్‌లోని కొంతమంది బ్రాహ్మణ వర్గం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహా దారైన డాక్టర్ రమణాచారిని కలిసి నీరాపానీయానికి ‘వేదామృతం’ అనే నామకరణం ఎంత వరకు సమంజసమైనది అని ప్రశ్నిస్తూ వినతి పత్రం సమర్పించారు. దీంతో వాద ప్రతివాదాలు ఊపందుకున్నాయి. హిందువుల పవిత్ర గ్రంథాలలో ‘వేదాలు’ అనేవి చాలా ప్రాధాన్యం సంతరించుకొన్నవనీ, అవి ప్రపంచానికి మార్గదర్శకాలనీ, నీరాకు వేదామృతం అనే పేరు పెట్టడం హైందవ జాతిని అవమానించేదిగా ఉందనే విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చారు ఈ పేరును వ్యతిరేకించేవారు. అయితే కల్లుగీత వృత్తిపై ఆధారపడిన గౌడ కుల సంఘాలు, నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేదామృతం పేరును సమర్థించడంతో సమస్య జటిలమైందని చెప్పాలి. ఆయుర్వేద వైద్యపరంగా నీరా అనేది సర్వరోగ నివారిణి అనీ, ముఖ్యంగా క్యాన్సర్‌ను కూడా నివారించే ఔషధ గుణాలున్నాయనేది వారి వాదం. వేదాల్లో సురాపానం గురించి ఉందనీ, ‘సుర’ అంటే అమృతం అనీ, దేవతలూ, రాక్షసులూ దానిని సేవించారని ప్రకటనలు ఇవ్వడం సరికాదు. వేదాలకు భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యం, పవిత్రతను దృష్టిలో పెట్టుకుని గౌడ సోదరులు వేదామృతం అనే పేరును సమర్థించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమాజంలోని అన్ని వర్గాల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: నిజంగా కులగణన అవసరమేనా?) – డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్ రిటైర్డ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, చేవెళ్ల -
కల్లులందు కర్జూర కల్లు వేరయా! ఫుల్ డిమాండ్.. ఆరోగ్యానికి మేలు కూడా?
సహజసిద్దంగా చెట్ల నుంచి లభించే కల్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. గ్రామీణప్రాంత ప్రజలైతే మరింత ఆసక్తి చూపుతారు. తీపి, ఒగరు, పులుపుగా ఉండే కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిస్తే ఇక జనం ఆగరు. ఇప్పటి వరకు మనకు తాటి, ఈత, వేప కల్లు మాత్రమే తెలుసు. కానీ కర్జూర చెట్లు సైతం కల్లునిస్తు జనాన్ని ఫిదా చేస్తున్నాయి. జనగామ జిల్లాలో కర్జూర కల్లు జనాలకు మజానిస్తోంది. ప్రజల మనసు దోచుకుంటున్న ఈ ప్రత్యేక పానీయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. గ్రామీణ ప్రాంతాల్లో కల్లు సేవించడం సంప్రదాయంగా ఉంది. అయితే తాటికల్లు, ఈత కల్లు మాత్రమే జనాలు ఎక్కువగా సేవించేవారు. కానీ, తాజాగా కర్జూర కల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. సహజసిద్ధమైన ఈకల్లు ఆరోగ్యంతో పాటు, ఆనందాన్ని ఇస్తోంది. కిడ్నీల్లో రాళ్లను పోగొడుతుందని కల్లు ప్రియులు అంటున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ లో కొందరు రైతులు కర్జూర చెట్లను సాగుచేశారు. ఆచెట్ల నుంచి స్థానిక గౌడకులస్థులు కల్లు తీస్తు జనాలను ఆకర్షిస్తున్నారు. (చదవండి: తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు) సాధారణంగా తాటికల్లు, ఈతకల్లు చేదుగా, పుల్లగా, కొన్నిసార్లు తియ్యగా ఉంటుంది. కొన్నిసార్లు వగరుగానూ ఉంటుంది. ఈత, తాటికల్లు సేవించేందుకు కొందరు ఇష్టపడరు. కానీ, కర్జూర కల్లు మాత్రం తియ్యగా, టేస్టీగా ఉండడంతో అందరూ తాగుతున్నారు. తెల్లారిందంటే చాలు చెట్ల క్రిందికి చేరిపోతున్నారు. కర్జూర కల్లు టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవాపూర్ కర్జూర కల్లుకు ఒకబ్రాండ్ గా మారింది. ఒకసారి ఈకల్లు తాగినోళ్లు పదేపదే వస్తున్నారు. దీని టేస్ట్ గురించి తెలుసుకుని వరంగల్, జనగామ ప్రజలతో పాటు హైదరాబాద్ వాసులు కూడా తరలివస్తున్నారు. ఉదయమే కర్జూర కల్లు తాగితే చాలా అద్భుతంగా ఉంటుందని కల్లుప్రియులు చెబుతున్నారు. మరో ప్రత్యేకత తాటిచెట్లు, ఈతచెట్లు కొన్ని నెలలు మాత్రమే కల్లునిస్తాయి. కానీ కర్జూర చెట్లు మాత్రం సంవత్సరం పొడవునా కల్లును ఇవ్వడం ఈచెట్ల ప్రత్యేకత. రాఘవాపూర్ లో ఐదు కర్జూర చెట్లు ఉండగా ఒక్కో చెట్టు రోజుకు 20 లీటర్ల కల్లు పారుతుంది. లీటర్ కు వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. అమృతంలా ఆరోగ్యానికి మేలుచేస్తుండడంతో కర్జూర కల్లు కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని గౌడ కులస్తులు తెలిపారు. డిమాండ్ బాగానే ఉన్నా చెట్లు తక్కువగా ఉండి అందరికీ కల్లు అందించలేక పోతున్నామని అంటున్నారు. ఇక డిమాండ్ కు తగ్గట్లు సప్లై లేక చాలా మంది కల్లు దొరక్క నిరాశతో వెనుతిరిగి పోతున్నారు. ప్రభుత్వం హరితహరం క్రింద రోడ్లకు ఇరువైపులా ప్రభుత్వ భూముల్లో కర్జూర చెట్లు పెంచి తమ ఉపాధి మెరుగుపర్చాలని కల్లుగీత కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్యవంతమైన కర్జూర కల్లును అందిస్తామంటున్నారు. (చదవండి: పోలీసులందు ఈ పోలీస్ వేరయా.. దొంగలతో చేతులు కలిపి ‘ముఠా’ నేతగా ఎదిగి) -
వీడిన జీలుగుకల్లు విషాదం మిస్టరీ.. టీడీపీ నేత వంతల రాంబాబు అరెస్టు
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా లోదొడ్డిలో కొద్ది రోజుల క్రితం జీలుగుకల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు టీడీపీ నేత వంతల రాంబాబు అని పోలీసులు తేల్చారు. రంపచోడవరం టీడీపీ ఇన్చార్జ్ వంతల రాజేశ్వరికి వరుసకు సోదరుడైన వంతల రాంబాబు జీలుగు కల్లుకుండలో గడ్డి మందును కలపడం వల్లే ఐదుగురూ మృతి చెందారని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. నిందితుడు రాంబాబును కాపాడేందుకు వంతల రాజేశ్వరి శతవిధాలా ప్రయత్నించారు. పోలీసులు రాంబాబు సహా పలువురిని విచారిస్తోన్న క్రమంలో వంతల రాజేశ్వరి అమాయకులైన గిరిజనులను ఇరికిస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. నిజనిర్ధారణ కమిటీ పేరిట లోదొడ్డిలో హడావుడి చేసిన టీడీపీ నేతలు స్థానికుల ద్వారా అసలు విషయం తెలుసుకుని బిక్కముఖం వేశారు. ఈ మేరకు మంగళవారం కాకినాడలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కేసు వివరాలను వెల్లడించారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డికి చెందిన పొత్తూరు గంగరాజు భార్యతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత వంతల రాంబాబుకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై కనుమ పండుగ నాడు గంగరాజు సోదరుడు లోవరాజు, రాంబాబు మధ్య ఘర్షణ జరిగింది. తన వదినతో సంబంధం సరికాదంటూ రాంబాబును లోవరాజు హెచ్చరించడంతో ఇరువురి మధ్య వివాదం మొదలైంది. కల్లు కుండలో గడ్డి మందు కలిపి.. గంగరాజు భార్య తనతో దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని రాంబాబు అతడిపై కక్ష పెంచుకున్నాడు. గంగరాజుకు చెందిన జీలుగు చెట్టు కల్లు కుండలో ఈ నెల 1 రాత్రి గడ్డి మందు కలిపాడు. ఈ విషయం తెలియని గంగరాజు మరుసటి రోజు ఉదయం చెదల సుగ్రీవు, వేము లోవరాజు, బూసరి సన్యాసిరావు, కుడే ఏసుబాబుతో కలిసి కల్లు సేవించాడు. కొద్దిసేపటికే ఐదుగురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా సుగ్రీవు, లోవరాజు, గంగరాజు, సన్యాసిరావు, చికిత్స పొందుతూ ఏసుబాబు మృతి చెందారు. ఈ ఘటనపై జడ్డంగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం ఉదయం నిందితుడు వంతల రాంబాబును అరెస్టు చేసి గడ్డి మందు ఉన్న డబ్బాను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. కేసు మిస్టరీని ఛేదించిన రంపచోడవరం అదనపు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, కాకినాడ క్రైమ్ డీఎస్పీ ఎస్.రాంబాబులను అభినందించారు. -
జీలుగ కల్లు తాగిన ఐదుగురు మృతి
రాజవొమ్మంగి: జీలుగ కల్లు తాగిన ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన చదల సుగ్రీవ(70), బూసరి సన్యాశిరావు(65), పొత్తూరి గంగరాజు(35), వేమా లోవరాజు(28), కుడే ఏసుబాబు(23), గంగరాజు తండ్రి వెంకటేశ్వర్లు రోజూ మాదిరిగానే బుధవారం ఉదయాన్నే తమకు సమీపంలోని జీలుగ చెట్టు నుంచి కల్లు సేకరించారు. సుగ్రీవ, సన్యాశిరావు, గంగరాజు, లోవరాజు, ఏసుబాబు దానిని తాగగా.. వెంకటేశ్వర్లు కల్లు నుంచి దుర్వాసన వస్తోందని ఉమ్మేశాడు. కల్లు తాగిన ఐదుగురూ కొద్దిసేపటికే వాంతి చేసుకొని.. అపస్మారక స్థితికి చేరుకున్నారు. బాధితులను అంబులెన్స్‌లో కాకినాడకు తరలిస్తుండగా మార్గంమధ్యలో ఇద్దరు, కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. కల్లులో కావాలని ఎవరో విషం కలిపి ఉంటారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. కల్లును పరిశీలించిన రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ అందులో క్రిమి సంహారక మందు కలిసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. శాంపిల్స్ సేకరించి కాకినాడ ల్యాబ్‌కు పంపించినట్లు ఎస్ఈబీ సీఐ ఎ.ఆనంద్ తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండ.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి.. ఆదుకుంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చెప్పారు. మృతుల కుటుంబాల పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వారిని తప్పకుండా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. -
ఫొటో వైరల్: కల్లు గ్లాసుతో సింగర్ సునీత!
సింగర్ సునీతకు రెండో పెళ్లి ఫిక్సయినప్పటి నుంచి ఏదో ఒక రకంగా తరచూ వార్తల్లోనే నిలుస్తోంది. కొన్నేళ్లుగా ఒంటరి జీవితాన్ని గడిపిన ఆమె ఇటీవలే వ్యాపారవేత్త రామ్ వీరపనేని పెళ్లాడి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తన వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తోన్న ఆమె ఈ మధ్యే మాల్దీవులకు కూడా వెళ్లి వచ్చింది. ఇదిలా వుంటే తాజాగా సునీత కల్లు గ్లాసు పట్టుకున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతోంది. ఓ రిసార్టులో కల్లుగీత కార్మికుడు కల్లు కుండను పట్టుకుని ఉండగా పక్కన ఉన్న మహిళలతో పాటు సునీత చేతిలో కూడా కల్లు గ్లాసు ఉంది. దీంతో ఆమె జస్ట్ గ్లాసుతో ఫొటోకు పోజిస్తుందని కొందరు, కాదు, రుచి చూసి ఉంటుందేమోనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది నీరా కూడా అయి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ఫొటో నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా రామ్ వీరపనేని తన లవ్‌స్టోరీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సునీతను అర్ధాంగిగా పొందేందుకు ఏడేళ్లు నిరీక్షించానని పేర్కొన్నాడు. ఆమెను ఏడేళ్లుగా ఇష్టపడుతున్నప్పటికీ నేరుగా ఈ విషయాన్ని సునీతతో చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. కానీ లాక్డౌన్లో ఆమెకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజ్ చేశాడు. దీంతో కొంత షాకైన సునీత తర్వాత ఆలోచించి అతడిని కలిసి మాట్లాడి పెళ్లికి ఓకే చెప్పింది. అలా శంషాబాద్‌లోని ఓ ఆలయంలో జనవరి 9న వీరి వివాహం జరిగింది. చదవండి: రామ్ ‘ఇంకేంటీ’ అంటే అర్థం చేసుకోలేకపోయా: సునీత గురువు మృతి: సింగర్ సునీత భావోద్వేగం -
కల్తీ కల్లు కలకలం.. 183 మందికి అస్వస్థత
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో కల్లు సేవించి ఓ వ్యక్తి మృతి చెందడం. ఒకేసారి 183 మంది అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. బాధితులు ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోవడం.. వాంతులు, మూర్చతో గిలగిలా కొట్టుకోవడం చూసి జనం బెంబేలెత్తిపోయారు. వెంటనే వారిని వికారాబాద్, హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. అలాగే.. 11 కల్లు దుకాణాలు, ఒక డిపోను అధికారులు సీజ్ చేశారు. వివరాలు.. నవాబ్‌పేట మండలం చిట్టిగిద్ద కల్లుడిపో నుంచి నవాబ్‌పేట, వికారాబాద్ మండలాల్లోని 11 గ్రామాలకు ప్రతిరోజు కల్లు సరఫరా అవుతోంది. శుక్రవారం సాయంత్రం కల్లు సేవించినవారు చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. ఇలా ఈ డిపో పరిధిలో మొత్తం 183 మంది అస్వస్థతకు గురయ్యారు. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కిష్టారెడ్డి మృతి చెందాడు. నవాబ్‌పేట మండలంలో 119 మంది, వికారాబాద్ మండలంలో 64 మంది అస్వస్థతకు గురైన వారిలో ఉన్నారు. కాగా, ఆయా ఆస్పత్రుల్లో 57 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు వైద్యశాఖాధికారులు తెలిపారు. పెండ్లిమడుగుకు చెందిన కిష్టారెడ్డి కల్తీ కల్లు కారణంగానే మృతి చెందాడా? లేదా అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పేర్కొన్నారు. మత్తు మందే కారణమా..? కల్లు సేవించిన 183 మంది అస్వస్థతకు మత్తు మందు కారణమని తెలుస్తోంది. మత్తు మోతాదు తక్కువ అయితే కల్లుతాగిన వారిలో విత్‌డ్రావల్ లక్షణాలు కనిపిస్తాయని, ప్రస్తుతం వీరంతా ఈ లక్షణాల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు. కాగా, కల్తీ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డిపో, 11 కల్లు దుకాణాలు సీజ్ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేషీ తెలిపారు. చిట్టిగిద్ద కల్లుడిపో, 11 గ్రామాల్లోని కల్లు దుకాణాలను సీజ్ చేశామన్నారు. కల్లు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కల్తీకల్లుగా నిర్ధారణ అయితే డిపో నిర్వాహకులపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, రైతు కిష్టారెడ్డి కల్లు తాగి మృతి చెందడంపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సంజీవరావు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం: సబిత వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని శనివారం మంత్రి సబితారెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు. శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. -
కల్తీ కల్లు కలకలం, 100 మందికిపైగా అస్వస్థత
సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌లో కల్తీ కల్లు కలకలం రేపింది. కృత్రిమ కల్లు తాగి రెండు గ్రామాల్లో దాదాపు 100కి మంది పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకెళ్తే.. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం చిట్టిగిద్ద గ్రామంలో తయారు చేస్తున్న కృత్రిమ కల్లును మండల పరిధిలోని నవాబ్ పేట్, అర్కతల, వట్టిమీనపల్లి, ఎక్ మామిడి, కేశపల్లి, తిమ్మారెడ్డి పల్లి, మమ్దాన్పల్లి, వికారాబాద్ మండలం కొత్తగడి, నారాయణపూర్, ఎర్రవళ్లి, పాతూర్, కామరెడ్డిగూడ, పులుసుమామిడి గ్రామాలకు డీసీఎంలో గత కొంత కాలంగా సరఫరా చేస్తున్నారు. అయితే ఎప్పటి మాదిరిగానే శుక్రవారం కూడా కల్లు సరఫరా చేశారు. కల్లు సేవించిన వారిలో వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాకు చెందిన దాదాపు 100 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చిట్టిగిద్దకు చెందిన ప్యాట రాములు(65) పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిని వారివారి బంధువులు నవాబ్‌పేట్, వికారాబాద్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు గ్రామానికి చేరుకొని అస్వస్థతకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. బాధిత కుటుంబాలను వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, చేవేళ్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్యలు పరామర్శించారు. -
మహబూబ్‌నగర్‌లో కల్తీ కల్లు కలకలం
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. ఆలూరు కల్తీ కల్లు తాగిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేష్, ఖాసీం మృతి చెందారు. మరో వ్యక్తి శ్రీనివాస్ చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మందు బాబులను ఆగమాగం చేస్తోంది...
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కడుపులో సమయానికి ముద్ద లేకున్నా ఫర్వాలేదు కానీ చుక్క పడకపోతే కాళ్లు చేతులు ఆడవు. నాలుక పిడచ కట్టుకుపోతుంది. నరాలన్నీ ఒక్కసారిగా లాగుతూ మందు బాబును నిలబడనీయడంలేదు. ఏ బ్రాండ్ అయినా ఫర్వాలేదు పెగ్గు ఉన్నా చాలు అన్నట్లుంది వారి పరిస్థితి. ఏదో ఒకటి నాలుగు చుక్కలు నోట్లో పడితే చాలన్నట్లు మందు కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చివరకు గుడుంబా, నాటుసారాల వైపు చూస్తున్నారు. అదీ లేకుంటే కల్లు కోసం కల్లు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాటి వనాల వద్ద ఈ మందు బాబుల హాల్చల్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నిద్రలేవగానే గొంతులో మందు చుక్క పడనిదే అడుగు ముందుకు వేయని మందుబాబులు...లాక్డౌన్ కారణంగా కొన్ని రోజులుగా మద్యం లభించకపోవడంతో పిచ్చివాళ్లుగా మారుతున్నారు. లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలను సైతం బంద్ చేశారు. నగరంలోని పలుచోట్ల కొందరు మద్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. మద్యం షాపు వద్దకు వచ్చి మద్యం ఇవ్వాలంటూ మారాం చేస్తున్నారు. మరికొంతమంది వైన్ షాపుల వద్ద మద్యం కోసం పడిగాపులు పడుతున్నారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్‌లో ఉంటున్న మధు అనే పెయింటర్ మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోయాడు. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్‌డౌన్‌తో కిక్కు కరువై కరోనా వైరస్ (కోవిడ్–19) మందు బాబులను ఆగమాగం చేస్తోంది. లాక్‌డౌన్‌తో బార్లు, మద్యం దుకాణాలు కూడా మూత పడడంతో మద్యం కోసం నానాయాతనలు పడుతున్నారు. అక్కడక్కడా బెల్టు షాపులు ఆదుకున్నా.. అక్కడ కూడా నిల్వలు అడుగంటిపోవడం.. ధరలు నింగినంటడంతో లబోదిబోమంటున్నారు. మొన్నటి వరకు ఖరీదైన బ్రాండ్లు తప్ప మద్యం ముట్టని బడాబాబులు కూడా చోటామోటా బ్రాండ్లతో సరిపుచ్చుకుంటున్నారు. కేవలం 24 గంటలపాటే జనతా కర్ఫ్యూ ఉంటుందని భావించిన మందుబాబులు.. మద్యం కొనుగోళ్లపై ముందుచూపు ప్రదర్శించలేదు. రాత్రికి రాత్రే ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ ప్రకటించడంతో బిత్తరపోయారు. (కరోనా: ధోని విరాళం రూ. లక్ష.. సిగ్గు పడండి!) చేసేదేమీలేక వైన్స్‌షాపులు, బెల్టు షాపుల్లో ఉన్నవాటిని గుట్టుగా కొని గుటకేసినా.. అక్కడ కూడా మందు సీసాలు ఖాళీ కావడంతో దేశీ మద్యం వైపు చూస్తున్నారు. దేశీ మద్యం అంటే అదేంటో అనుకుంటున్నారా? అదేనండీ గుడుంబా, నాటుసారా. ఆఖరికి కల్లు. ఈ మూడే ప్రస్తుతం మందుబాబులకు ఆదుకుంటున్నాయి. అయితే, ఇవీ కూడా ఎక్కడపడితే అక్కడ దొరకడంలేదు. కేవలం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి లభ్యమవుతున్నాయి. గుడుంబా అమ్మకాలను నిషేధించడంతో ఐదేళ్ల క్రితమే వీటి తయారీని నిలిపివేసిన తయారీదారులు.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. దీంతో గుట్టుగా నాటుసారా బట్టీలను మొదలుపెట్టారు. (అగ్రరాజ్యం అతలాకుతలం) తాటివనాల్లో మందు..విందు! ఉద్యోగ, ఉపాధిరీత్యా ఇన్నాళ్లూ హైదరాబాద్ సహా పట్టణాల్లో ఉన్నవారంతా లాక్డౌన్ పుణ్యామా అని పల్లెబాట పట్టారు. మద్యం లభ్యం కాకపోవడం... దొరికినా భారీ రేట్లు పలుకుతుండడంతో కల్లు సేవించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని తాటి వనాల్లో ఎక్కడ చూసినా మందుబాబుల సందడే కనిపిస్తోంది. దీనికితోడు చికెన్ ధరలు కూడా పడిపోవడంతో కల్లు చుక్క..చికెన్ ముక్కతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో మొన్నటివరకు రూ.20 నుంచి 30 వరకు దొరికే కల్లు సీసా ఇప్పుడు రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. పట్టణాలు, మండలాల్లో కల్లు దుకాణాలు బంద్ కావడంతో కల్లు ప్రియులు గందరగోళంలో పడ్డారు. కల్లు డిపోలు తెరవాలని ముస్తేదార్లపై ఒత్తిడి తెస్తున్నారు. కలుకు బానిసలైన కొంతమంది మాత్రం మానసికంగా బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. (కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!) ఆస్పత్రులకు క్యూ కడుతున్న కల్లు బాధితులు నిజామాబాద్ జిల్లాలో కల్లు ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. లాక్డౌన్ కారణంగా కల్లు దుకాణాలు మూతపడటంతో కల్తీ కల్లు బాధితులు మతి స్థిమితం తప్పి ప్రవర్తిస్తున్నారు. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ... వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా నగరంలోని ముదిరాజ్‌గల్లిలో భూషణ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. అయితే లాక్డౌన్ కారణంగా కల్లు దొరకకపోవడంతో పిట్స్ వచ్చి మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. వైన్ షాపులో చోరీ ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మందుబాబులు ఏకంగా వైన్ షాపుకే కన్నం వేశారు. చేతికి అందినన్ని మందు బాటిల్స్‌ను పట్టుకెళ్లారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెంలోని శ్రీ సాయి వైన్స్‌లో ఆగంతకులు షాపు షట్టర్స్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న సివిల్, ఎక్సైజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, విచారణ చేపట్టారు. -
సహజసిద్ధ జీవనధార... ‘నీరా’
బహుళ జాతి సంస్థల శీతలపానీయాల ప్రచా రం ముందు తట్టుకోలేక తలవంచిన అరుదైన దేశీయ ఆరోగ్య పానీ యాల్లో నీరా ఒకటి. తాటి, ఈత, ఖర్జూరా, జీరిక, కొబ్బరి వంటి నిట్టనిలువుగా పెరిగే చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్క హాల్ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషకవిలువలు కలిగిన దేశీయ పానీయం. తెలంగాణ, కేరళ, తమిళనాడు, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వాడుకలో ఉన్న నీరా, దాని అనుబంధ ఉత్పత్తులు 1990ల తర్వాత బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకోలేక పరిశ్రమే మూతపడిపోవడం విచారకరం. ఆహార అలవాట్లు మారటంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని రోగాల బారిన పడటం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పాత ఆహార అలవాట్లు మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కాబట్టి ప్రకృతి సహజ పానీయమైన నీరాను దాని అనుబంధ ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తే ప్రజారోగ్యానికి చక్కటి పునాది ఏర్పడే అవకాశం ఎంతైనా ఉంది. నీరాను అన్ని వయసుల వారు స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు కూడా తాగవచ్చు. తెలంగాణలో కోటికి పైగా ఉన్న తాటిచెట్లు, ఈత చెట్లనుంచి తీస్తున్న నీరాను తియ్యటి కల్లుగా పిల్చుకుంటూ నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సేవిస్తున్నారు. అయితే నీరాకు, కల్లుకు వ్యత్యాసముంది. సహజసిద్ధమైన పోషక విలువలు గల తీయటి ఆహార పానీయం ‘నీరా’. దీంట్లో విశేషం ఏమిటంటే, అప్పుడే చెట్ల నుంచి తీసిన నీరాలో ఆల్కహాల్ అస్సలు ఉండదు. తాజాగా చెట్లనుంచి సేకరించిన నీరాలో సుక్రోసు, ప్రోటీన్సు, ఆస్కార్బిక్ యాసిడ్, థయామిన్, రిబోప్లెవిన్, విటమిన్ సి, పాలలో కంటే ఎక్కువ కెలోరీల శక్తి, పోలిక్ యాసిడ్, ఇతర విటమిన్లు కూడా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. నీరాను ప్రధానంగా తాటి, ఈత చెట్ల నుంచి తీస్తారు. ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత కుండను తాటి, ఈత చెట్లకు కట్టి సూర్యోదయం కన్నా ముందే కుండను దింపి వెంటనే అతి తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచుతారు. సూర్యోదయం తర్వాత తీసినా, ఎండ, గాలి ఎక్కువగా తగిలినా తొందరగా పులిసిపోతుంది. ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాలైన భారత్ వంటి అనేక దేశాల ప్రజలకు నీరా ఆరోగ్య ప్రదాయిని అని చెప్పాలి. ఉష్ణమండల దేశాల్లో మనుషులు త్వరగా అలసిపోయి శరీరం పోషకాలను వేగంగా కోల్పోతారు కనుక ఈ నీరాను సేవించడం వల్ల తక్షణ శక్తి శరీరానికి అందుతుంది. శరీరానికి త్వరగా శక్తిని అందించే ఈ రీహైడ్రేషన్ ప్రక్రియ శరీరానికి చలవ చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులు, కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ఈ నీరా సేవించడం వల్ల త్వరగా నయం అయినట్లు ఆధారాలున్నాయి. కామెర్లవ్యాధికి ఇది ఔషధంగా పని చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి, మలబద్దకాన్ని పోగొట్టే నీరాను సేవిస్తే గ్యాస్ట్రిక్ సమస్య తొందరగా తగ్గుతుంది. ఇటీవల ఉస్మానియా యూని వర్సిటీ సూక్ష్మ జీవ శాస్త్ర విభాగం చేసిన పరిశోధనల్లో నీరా కేన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని తేల్చడంతో దీని వివరాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి కూడా. మధుమేహ రోగులకు నీరా వరం లాంటిది. తెలంగాణ ప్రభుత్వం నీరాను ఆల్కహాల్ లేని పానీయంగా ప్రకటిస్తూ ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేయాలి. చెట్లను నీరాకోసం ప్రత్యేకంగా కేటాయిస్తూ, నీరా సేకరణకు, రవాణాకు, అమ్మకానికి అనుమతులి వ్వాలి. తద్వారా గీతవృత్తిలో ఉన్న పలువురు గౌడ యువకులకు ఉపాధి లభించడంతోపాటు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ప్రకృతి పానీయం అందుబాటులోకి వస్తుంది. నీరాకు సహజపానీయంగా ప్రచారం కల్పించి మధ్యతరగతి, ఉన్నత స్థాయి వారికి కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వం వివిధ పట్టణాల్లో కస్టమర్ లైన్‌ని అందుబాటులోకి తేవాలి. గీత కార్మికుల ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా దోహదకారి. (తెలంగాణ ప్రభుత్వం నీరా అమ్మకాలను అనుమతిస్తూ ఇటీవలే జీవోఎంఎస్ 116ని జారీ చేసిన సందర్భంగా) వ్యాసకర్త: డా. ఆనంద్ గోపగోని, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ మొబైల్: 98482 56042 -
నిషేధిత కల్లుకు కళ్లెం
గద్వాల క్రైం : నిషేధిత కల్లు తయారీ.. విక్రయాలపై పోలీసు, ఎక్సైజ్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. అయితే నిషేధిత కల్లును కొందరు గుట్టుగా అధికారుల కళ్లు గప్పి రైలుమార్గాల ద్వారా గద్వాలకు చేరుస్తున్నారు. ఇక రైల్వే పోలీసుల తనిఖీల్లో నిత్యం నిషేధిత కల్లును పలువురు తీసుకెళ్తున్న తరుణంలో నిఘా ఉంచి నిందితుల నుంచి వందలాది లీటర్ల నిషేధిత కల్లును స్వాధీనం చేసుకుంటున్నారు. గద్వాల మండల కేంద్రంలోని నిషేధిత కల్లు తయారీ, విక్రయాలపై పోలీసు, ఎక్సైజ్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంది. దొడ్డిదారిన వనపర్తి నుంచి.. ఇటీవల గద్వాలకు చెందిన కొందరు రైలు మార్గాల ద్వారా నిషేధిత కల్లును దొడ్డిదారిన వనపర్తి జిల్లా నుంచి గద్వాలకు తీసుకొస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన ని షేధిత కల్లును రహస్యంగా కల్లు ప్రియులకు విక్రయిస్తున్నారనే సమాచారం అధికారులకు తెలిసింది. దీంతో ఎక్సైజ్ అధికారులు రైల్వే పోలీసులను అప్రమత్తం చేయడంతో నిత్యం రైల్వే అ ధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల్లో 20 రోజుల్లోనే 1,000 లీటర్ల నిషేధిత కల్లును స్వాధీనం చేసుకొని 15 మందిపై కేసులు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. రైలు మార్గంలో ఎందుకంటే.. గద్వాలో నిషేధిత కల్లు తయారీ, విక్రయాలు చేస్తే అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో నిషేధిత కల్లుకు అలవాటు పడిన కల్లు ప్రియులు కల్లు దొరక్కపోవడంతో వనపర్తి జిల్లాకు వెళ్తున్నారు. ఇది అదునుగా భావించిన కొందరు అక్కడి నుంచి ఇక్కడకు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తే లాభం వస్తుందనే దురాలోచనతో రైలు మార్గం ద్వారా గుట్టుగా తీసుకొస్తున్నారు. అందులోనూ రైలు మార్గం ద్వారా తీసుకురవాడం సులువుగా ఉండటం. అధికారులు పెద్దగా దృష్టి సారించరనే నేపంతో రైలు మార్గం ఎంచుకున్నారనే విమర్శలు నెలకొన్నాయి. నిషేధిత కల్లు విక్రయాలపై నిఘా.. నిషేధిత కల్లు తాగడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభవం చూపుతుంది. పలు ఆరోగ్య సమస్యలు, మత్తు కలిగించే క్లోరల హైడ్రేట్, ఆల్ఫాజోం తదితర పదార్థాలతో తయారు చేసిన కల్లు తాగడంతో మత్తుకు బానిసగా మరి మానసికంగా కుంగిపోతారు. నిషేధిత కల్లు దొరకని సమయంలో పిచ్చిగా కేకలు వేయడం ఇతరత్ర భయాందోళనకు దారి తీస్తారు. ప్రభుత్వం కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. నిషేధిత కల్లు ఎవరైనా రహస్యంగా తీసుకొస్తున్నట్లు తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. నిషేధిత కల్లును విక్రయించినా, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – గోపాల్ గద్వాల ఎక్సైజ్ సీఐ -
‘రెండు లక్షల ఈత, ఖర్జూర చెట్లు పెంచుతాం’
స్వచ్ఛమైన కల్లు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. గురువారం ఆయన తాండూరులోని ఎక్సైజ్ సీఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం కింద తమ శాఖ పరిధిలో 2 లక్షల ఈత, ఖర్జూర మొక్కలను పెంచనున్నట్లు తెలిపారు. పట్టాభూముల్లో వీటిని పెంచుతామని, దరఖాస్తు చేసుకున్న వారికి మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. పెంపకం దారులకు మొక్కకు కొంతమొత్తం చొప్పున సొమ్మును కూడా అందజేస్తామని వెల్లడించారు. -
బిహార్‌లో కల్లుపైనా నిషేధం!
పట్నా: వచ్చే ఏడాది నుంచి బిహార్‌లో కల్లుపై కూడా నిషేధం విధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చెప్పారు. మద్య నిషేధం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య బాగా తగ్గిందన్నారు. కల్లును ఆహార పదార్థాల్లో వినియోగించేలా ప్రోత్సహిస్తామని, అందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేశామని శనివారం ముజఫర్‌పూర్‌లో చెప్పారు. తమిళనాడులో గత 25 ఏళ్లుగా ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. -
ఎన్నికల ప్రచారంలో కల్లు తాగిన డిగ్గీ..
వరంగల్: 'బీ ఎ రోమన్ ఇన్ రోమ్' సామెతను బాగా వంటపట్టించుకున్న రాజకీయ నాయకులు ఏ కుల సంఘం సమావేశానికి వెళితే వారి సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోవడం తెలిసిందే. ఈ తరహా 'కుల' కలుపుగోలు తనాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్. వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం వరంగల్ డీసీసీ కార్యాలయంలో గౌడ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి డిగ్గీ రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పటికే గౌడ సోదరులు తీసుకొచ్చిన కల్లు లొట్టికేసి ఆసక్తిగా చూస్తున్న ఆయన.. పలువురి అభ్యర్థనమేరకు కల్లు తాగారు. తాడు, మోకును మెడలో వేసుకుని మరీ గౌడ్లందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇటీవల తెలంగాణలో విచ్చలవిడి కల్తీ కల్లు ప్రవాహం నేపథ్యంలో డిగ్గీ మాత్రం అత్యంత స్వచ్ఛమైన కల్లునే అందించినట్లు తెలిసింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. -
కల్తీ కల్లు తాగి ముగ్గురి పరిస్థితి విషమం
చింతపల్లి(నల్లగొండ): కల్తీ కల్లు తాగి ముగ్గురు యువకులు అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమించడంతో.. మెరుగైన చికిత్స మేరకు హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కెళ్లపల్లి పంచాయతి పరిధిలోని రోటిగడ్డతాండలో ఆదివారం జరిగింది. వివరాలు.. తాండకు చెందిన రాములు(30), షావుకారి(28), హరిప్రసాద్(27)అనే ముగ్గురు స్నేహితులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమించడంతో.. 108 సాయంతో హైదరాబాద్‌కు తరలించారు. -
కల్తీ కల్లు దొరకక మహిళ ఆత్మహత్య
-
దయ్యాలు తిరుగుతున్నాయి..
పెద్దెముల్(రంగారెడ్డి): 'అదిగో.. అటు చూడండి.. దయ్యాలు తిరుగుతున్నాయ్.. మనుషుల్ని పీక్కుతింటాయ్..' అంటూ గత రెండు రోజులుగా హల్ చల్ చేస్తున్న కొందరి వ్యవహారం కుటుంబ సభ్యులకు భయం కలిగించడంతోపాటు చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా మారింది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో ఇలా వింతగా ప్రవర్తిస్తున్న కొందరి వ్యవహారం శనివారం వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమంటే.. కల్తీ కల్లుకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు అది అందుబాటులో లేకపోవడంతో ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి పూట దయ్యాలు వస్తున్నాయని.. అందరినీ పీక్కొతింటాయని వింత వింతగా మాట్లాడుతున్నారు. దీంతో గ్రామస్థులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. -
రూ.15కే మద్యం!
గుడుంబాకు విరుగుడుగా సర్కారు నిర్ణయం * 90 ఎం.ఎల్. సీసాల్లో అందుబాటులోకి.. * మండలం యూనిట్‌గా కొత్త మద్యం పాలసీ * గ్రామ గ్రామానికి చౌకమద్యం చేరేలా ప్రతిపాదనలు * గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి మద్యం * కల్తీ కల్లు నివారణకు ఈత, తాటి చెట్లు పెంచడమే మార్గం * ఎక్సైజ్ శాఖ సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం * మూడు రోజుల్లో సమగ్ర విధానం రూపొందించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబాను అరికట్టేందుకు చౌకమద్యం అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... కేవలం రూ.15కే 90 మిల్లీలీటర్ల మద్యం అందేలా చర్యలు చేపడుతోంది. అంతేగాకుండా పల్లెపల్లెనా ఈ చౌకమద్యం అందుబాటులో ఉండేలా కొత్త మద్యం పాలసీని రూపొందిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘కాయకష్టం చేసుకునే పేదలు సేద తీరేందుకు మద్యానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు దాన్ని మార్చలేం. ప్రాణాలకు హాని కలగని విధంగా చవకగా మద్యాన్ని అందుబాటులోకి తేవాలి. పది రూపాయలకు గుడుంబా ప్యాకెట్ దొరుకుతున్నప్పుడు రూ.40 పెట్టి చీప్ లిక్కర్ ఎందుకు కొంటారు. వారి కోసం రూ.15కే 90 ఎం.ఎల్. మద్యం సీసాలు అందుబాటులో ఉండేలా చూడాలి..’’ అని సూచించినట్లు తెలిసింది. నూతన మద్యం విధానంపై సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్, రెవెన్యూ(ఎక్సైజ్, సీటీ) ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఇతర అధికారులతో సమీక్షించారు. నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. గుడుంబాను అరికట్టేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలేవీ సత్ఫలితాలివ్వడం లేదని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోనే సమస్యకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ‘‘గుడుంబా తయారీలో అవలంబించే పాడు పద్ధతుల వల్ల అది విషంతో సమానమవుతుంది. గుడుంబా వల్ల ఇంటి యజమానులు చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో మహిళలు వితంతువులుగా మారుతున్నారు. గుడుంబా అనేదే లేకుండా చేయడానికి అవలంబించాల్సిన విధానాన్ని ఖరారు చేయాలి..’’ అని ఎక్సైజ్ అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. రూ.15కే హానికలగని రీతిలో 90 ఎం.ఎల్ మద్యం సీసాలను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించినట్లు తెలిసింది. మండలం యూనిట్‌గా.. ఇప్పటివరకు జిల్లాను యూనిట్‌గా తీసుకొని మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో లెసైన్సులు జారీ చేస్తున్నారు. కానీ కొత్త మద్యం విధానంలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఆ మండలంలోని జనాభా, గతంలో జరిగిన మద్యం అమ్మకాల రికార్డుల ఆధారంగా ఎ-4 మద్యం దుకాణాలను ఖరారు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అయితే మండలంలో ఒకటి లేదా రెండు మద్యం దుకాణాలకే అవకాశం ఉండడంతో.. పల్లెలకు కూడా సర్కారీ చీప్‌లిక్కర్ ఎలా చేరాలో అధ్యయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనిపై మూడు రోజుల్లో ప్రతిపాదనలు రూపొందించి, అందించాలని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్‌కు సూచించినట్లు తెలిసింది. మండలంలో లెసైన్సు పొందిన మద్యం దుకాణదారుడే అనుబంధంగా బి-లెసైన్స్ పొంది ఆయా గ్రామాల్లో చౌక మద్యం విక్రయించేలా పాలసీని రూపొందించే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రేటర్‌కు ప్రత్యేక పాలసీ దేశంలోని మెట్రో నగరాల సరసన చేరిన గ్రేటర్ హైదరాబాద్‌కు విడిగా మద్యం పాలసీని తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘పారిశ్రామిక, పర్యాటక రంగాలతో పాటు ఐటీలో దూసుకుపోతున్న హైదరాబాద్‌కు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. వారికి అవసరమైన విదేశీ మద్యం స్టార్ హోటళ్లలో అందుబాటులో ఉండాలి. వైన్లోని మేలిమి రకం ఇక్కడ లభించడం లేదని పలువురు విదేశీ ప్రతినిధులు నాతో అన్నారు. అంతర్జాతీయ స్థాయి నగరంలో అదే ప్రమాణాలతో కూడిన మద్యం కూడా అందుబాటులోకి తేవాలి..’’ పేర్కొన్నారు. చెరువుల గట్లపై ఈతచెట్లు.. గత పాలకులు అవలంబించిన విధానాల వల్ల స్వచ్ఛమైన కల్లు స్థానంలో కల్తీకల్లు, మందు కల్లు మొదలైందని... మంచి కల్లు అందించాలంటే తాటి, ఈత వనాలు పెంచడమే మార్గమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కల్తీకల్లు వల్ల ప్రజల మానసిక స్థితి దెబ్బతినే పరిస్థితి నెలకొంది. కల్తీకల్లు లేకుండా చేయాలి.. చెరువుల చుట్టూ, చెరువు కట్టల కింద విరివిగా ఈత చెట్లు పెంచాలి. వచ్చే ఏడాది చెరువుల వద్ద ఐదు కోట్ల ఈత మొక్కలు నాటి పెంచాలి. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా ఇద్దరు డీఎఫ్‌వోలను కేటాయిస్తాం’’ అని తెలిపారు. రాష్ట్రంలో వినియోగమయ్యే మద్యం ఇక్కడే తయారయ్యేలా డిస్టిలరీస్ ఉండాలని, దాంతో ఇక్కడివారికి ఉద్యోగావ కాశాలు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని కేసీఆర్ చెప్పారు. -
స్వచ్ఛమైన కల్లు అందిస్తాం: సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కల్లు కాంపౌండ్ల ద్వారా కల్తీలేని స్వచ్ఛమైన కల్లు అందిస్తామని సీఎం కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టవలసిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నూతన మద్యం విధానంపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్షాసమావేశం నిర్వహించారు. వచ్చే అక్టోబర్ నుంచి నూతన ఎక్సైజ్ పాలసీని అమలుచేయనున్నట్లు సీఎం ప్రకటించారు. గుడుంబాను అరికట్టడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కొనసాగుతున్న మద్యం అక్రమ రవాణాపై దృష్టిసారించి, అరికట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువుల గట్లమీద ఐదు కోట్ల ఈత చెట్లను నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్ భిన్న సంస్కృతులకు నిలయమని, నగరంపై ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామని వివరించారు. -
రేణుకా ఎల్లమ్మ... సల్లంగ సూడమ్మా
కడెం: ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట గ్రామంలో వారం క్రితం నూతనంగా ప్రతిష్టించిన రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర చివరి రోజైన మంగళవారం వైభవంగా సాగింది. గౌడ కులస్తులతోపాటు ధర్మాజీపేట, మద్దిపడగ, కుర్రగూడెం గ్రామస్తులు వందల సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని వందలాది మంది మహిళు అమ్మవారికి బోనాలతో ఊరేగింపుగా గుడిదాకా వచ్చారు. అనంతరం ఒకే చెట్టును 11 మంది ఎక్కి ఆ చెట్టుకున్న కల్లును తీసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. -
కల్లు తాగుతూ కెమెరాకు చిక్కిన హీరోయిన్
హీరోయిన్ సంజన గుర్తుందా? ‘బుజ్జిగాడు' చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత తెలుగులో అడపా దడపా చిత్రాల్లో నటించినా పెద్దగా స్టార్ స్టేటస్ తెచ్చుకోలేక పోయింది. అయితే సినిమా ఫంక్షన్లు, ఫోటో షూట్లు, వివాదాలతో మాత్రం గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సంజన ఓ విషయంలో హాట్ టాపిక్ అయింది. సంజన కల్లు తాగుతున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె కల్లు ఎంతో ఇష్టంగా తాగుతున్నట్లు ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది. సహజ సిద్ధంగా చెట్టు నుండి సేకరించే కల్లు కాబట్టి హెల్త్‌కి మంచిదే అని తన సన్నిహితులతో చెబుతోందట. ప్రస్తుతం ఆమె తెలుగులో శివ కేశవ్, వన్స్ అపానె టైం, సరదా, అవును 2 చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలో రెబల్, బెంగులూరు 23, మళయాలంలో ఓ సినిమా చేస్తోంది.