కల్లు తాగుతూ కెమెరాకు చిక్కిన హీరోయిన్ | heroine sanjana captured by the camera drunk toddy | Sakshi
Sakshi News home page

కల్లు తాగుతూ కెమెరాకు చిక్కిన హీరోయిన్

Published Fri, Jan 30 2015 8:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

కల్లు తాగుతూ కెమెరాకు చిక్కిన హీరోయిన్

కల్లు తాగుతూ కెమెరాకు చిక్కిన హీరోయిన్

హీరోయిన్ సంజన గుర్తుందా? ‘బుజ్జిగాడు' చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత తెలుగులో అడపా దడపా చిత్రాల్లో నటించినా పెద్దగా స్టార్ స్టేటస్ తెచ్చుకోలేక పోయింది. అయితే సినిమా ఫంక్షన్లు, ఫోటో షూట్లు, వివాదాలతో మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా సంజన ఓ విషయంలో హాట్ టాపిక్ అయింది. సంజన కల్లు తాగుతున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె కల్లు ఎంతో ఇష్టంగా తాగుతున్నట్లు ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది. సహజ సిద్ధంగా చెట్టు నుండి సేకరించే కల్లు కాబట్టి హెల్త్‌కి మంచిదే అని తన సన్నిహితులతో చెబుతోందట.  ప్రస్తుతం ఆమె తెలుగులో శివ కేశవ్, వన్స్ అపానె టైం, సరదా, అవును 2 చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలో రెబల్, బెంగులూరు 23, మళయాలంలో ఓ సినిమా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement