![రేణుకా ఎల్లమ్మ... సల్లంగ సూడమ్మా](/styles/webp/s3/article_images/2017/09/3/61432104864_625x300.jpg.webp?itok=y96-6D_o)
రేణుకా ఎల్లమ్మ... సల్లంగ సూడమ్మా
కడెం: ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట గ్రామంలో వారం క్రితం నూతనంగా ప్రతిష్టించిన రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర చివరి రోజైన మంగళవారం వైభవంగా సాగింది. గౌడ కులస్తులతోపాటు ధర్మాజీపేట, మద్దిపడగ, కుర్రగూడెం గ్రామస్తులు వందల సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని వందలాది మంది మహిళు అమ్మవారికి బోనాలతో ఊరేగింపుగా గుడిదాకా వచ్చారు. అనంతరం ఒకే చెట్టును 11 మంది ఎక్కి ఆ చెట్టుకున్న కల్లును తీసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.