స్వచ్ఛమైన కల్లు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు.
స్వచ్ఛమైన కల్లు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. గురువారం ఆయన తాండూరులోని ఎక్సైజ్ సీఐ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం కింద తమ శాఖ పరిధిలో 2 లక్షల ఈత, ఖర్జూర మొక్కలను పెంచనున్నట్లు తెలిపారు. పట్టాభూముల్లో వీటిని పెంచుతామని, దరఖాస్తు చేసుకున్న వారికి మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. పెంపకం దారులకు మొక్కకు కొంతమొత్తం చొప్పున సొమ్మును కూడా అందజేస్తామని వెల్లడించారు.