Jogulamba-Gadwal: New Twist In Dharur Suicide Case - Sakshi
Sakshi News home page

గద్వాలలో దారుణం: కడుపు నొప్పి కాదు ప్రియుడి మోసం.. సునంద ప్రాణానికి రూ. 9 లక్షల వెల?

Published Sat, Jul 22 2023 9:12 AM | Last Updated on Sat, Jul 22 2023 9:44 AM

Jogulamba Gadwal Crime: New Twist In Dharur Suicide Case - Sakshi

క్రైమ్‌: జోగులాంబ గద్వాల్‌ జిల్లా ధరూర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య ఉదంతంలో  ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆమె కడుపు నొప్పితో బలవన్మరణానికి పాల్పడలేదని.. ప్రియుడి మోసం భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని తేలింది.  

ధరూర్‌ మండల కేంద్రానికి చెందిన సునంద(23) డిగ్రీ పూర్తి చేసి.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీలో చదువుతోంది. తాజాగా సొంతూరికి వెళ్లిన ఆమె.. ఇంట్లోనే ఉరేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి.. ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రకటించారు. అయితే.. 

సునంద తొలుత కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం నడిచింది. కానీ,  ప్రియుడి ఆ మోసం భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తర్వాత తేలింది. అంతేకాదు.. ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి.. రూ.9 లక్షలను యువతి తరపు బంధువులకు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. 

యువతి బంధువులను గ్రామ పెద్దలు బలవంతంగా ఒప్పించారని..  ఈ వ్యవహారంలో పోలీసులకు వాటా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సునందకు న్యాయం చేయాలని పలువురు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. 

ఇదీ చదవండి: అదే పనిగా భర్త నైట్‌షిఫ్ట్‌ వెళ్తున్నాడని.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement