Nursing student suicide
-
Bhadrachalam Nursing Student: ‘కారుణ్య’ మిస్టరీ..?
భద్రాచలంఅర్బన్: నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతికి గల కారణాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం విద్యార్థిని కుటుంబీకులు, బంధువులు కళాశాల వద్ద ఆందోళన చేపట్టగా, పరిస్థితి ఉద్రిక్తగా మారింది. పోలీసులకు, దళిత సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వివరాలు ఇలా.. భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులోని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న పడిగిపల్లి కారుణ్య (18) గురువారం అనుమానాస్పదస్థితిలో కళాశాల భవనంపై నుంచి కింది పడింది. తీవ్ర గాయాలుకాగా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబీకులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు శుక్రవారం ఉదయం కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన తెలిపారు. ఆందోళనకు పలు దళిత సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.కళాశాల బాధ్యులపై దాడిఆందోళన సమయంలోనే కళాశాల కార్యదర్శి ఎస్ఎల్ కాంతారావు అక్కడికి రాగా, మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన్ను కారులో నుంచి బయటకు లాగి దాడి చేశారు. దీంతో పోలీసులు కాంతారావును కళాశాలలోని ప్రిన్సిపాల్ గదికి తరలించారు. ఈ క్రమంలో ఆందోళన మరింత తీవ్రతరం చేశారు. యాజమాన్యం అకారణంగా విద్యార్థిని పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. ఉన్నతాధికారులు కళాశాల వద్దకు రావాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన కూతురు మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాల యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలని మృతురాలి తల్లి సునీత డిమాండ్ చేశారు. తన కూతురి చావుని కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఆమె స్నేహితురాలిని తీసుకొస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేకు, దళిత సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదంఆందోళన జరుగుతుండగానే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని చెబుతుండగా, దళిత సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో మృతురాలి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కళాశాల యాజమాన్యంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా మధ్యవర్తుల సమక్షంలో కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షలు ఇచ్చేలా యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా కారుణ్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతురాలి తండ్రి గురుమూర్తి ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.మృతిపై పలు అనుమానాలువిద్యార్థిని కారుణ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని ఫిట్స్‌తో చనిపోయిందని, హాస్టల్ మొదటి అంతస్తు పైనుంచి పడి తీవ్ర గాయాలతో మృతిచెందిందని, గుర్తుతెలియని దుండగుడు దాడి చేశాడనే వాదనలు వినిపించాయి. ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిందని శుక్రవారం మరో వాదన వెలుగుచూసింది. నర్సింగ్ కళాశాల నిర్వాహకుడి కుమారుడు కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, తనమాట వినకపోవడంతో దాడికి పాల్పడ్డాడని, దీంతో విద్యార్థిని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, కారుణ్య మృతికి అసలు కారణం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. -
గద్వాల యువతి బలవన్మరణంలో ట్విస్ట్
క్రైమ్: జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఉదంతంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కడుపు నొప్పితో బలవన్మరణానికి పాల్పడలేదని.. ప్రియుడి మోసం భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని తేలింది. ధరూర్ మండల కేంద్రానికి చెందిన సునంద(23) డిగ్రీ పూర్తి చేసి.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది. తాజాగా సొంతూరికి వెళ్లిన ఆమె.. ఇంట్లోనే ఉరేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి.. ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రకటించారు. అయితే.. సునంద తొలుత కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం నడిచింది. కానీ, ప్రియుడి ఆ మోసం భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తర్వాత తేలింది. అంతేకాదు.. ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి.. రూ.9 లక్షలను యువతి తరపు బంధువులకు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. యువతి బంధువులను గ్రామ పెద్దలు బలవంతంగా ఒప్పించారని.. ఈ వ్యవహారంలో పోలీసులకు వాటా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సునందకు న్యాయం చేయాలని పలువురు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: అదే పనిగా భర్త నైట్‌షిఫ్ట్ వెళ్తున్నాడని.. -
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
నాగోలు: అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. త్రిపుర రాష్ట్రంలోని రామనగర్ జిల్లాకు చెందిన పహేలిదాస్ హస్తినాపురంలోని కస్తూరి స్కూల్‌ఆఫ్ నర్సింగ్ కళాశాలలో రెండో సంవత్సరం నర్సింగ్ కోర్సు చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు వార్డెన్‌కు సమాచారం అందించారు. ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలుతెలియరాలేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గాంధీఆస్పత్రి భవనంపై నుంచి దూకి
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి భవనంపై నుంచి కిందికి దూకి నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. చిలకలగూడ డీఐ నర్సింహరాజు, ఎస్ఐ రాజునాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గుజరాత్‌కు చెందిన గమిత్ రోహన్బాయ్ (22) నాగారంలోని ఓ ప్రైవేటు మాస్టల్లో ఉంటూ గుడుంకుంటలోని విజయ హెల్త్‌కేర్ అకడమిక్ సొసైటీ ఆధ్వర్యంలో విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో జీఎన్ఎం కోర్సు చదువుతున్నాడు. క్లినికల్స్ కోసం ఆదివారం గాంధీ ఆస్పత్రికి వచ్చి నైట్ డ్యూటీ చేశాడు. సోమవారం మధ్యాహ్నం అతను ఆస్పత్రి ప్రధాన భవనం నాల్గవ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో రోహన్బాయ్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. మృతుని తల్లితండ్రులతోపాటు నర్సింగ్ స్కూలు యాజమాన్యానికి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాణం తీసిన ప్రేమ!
తణుకు: తల్లిదండ్రులు లేని ఒంటరి జీవితం.. అయినా ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం.. విద్యార్థి దశలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నా అనాథగా మిగలకూడదని ఒక పాస్టర్ ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఆమె కలలను నిజం చేయాలని భావించి ఆమెను నర్సింగ్ కోర్సు చదివిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఒక వ్యక్తి ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ప్రేమ పేరుతో వంచించాడు. నువ్వే సర్వస్వం అంటూ నమ్మబలికాడు. చివరికి పెళ్లి విషయం తీసుకువస్తే తనకు అప్పటికే పెళ్లయ్యిందనే విషయాన్ని చెప్పాడు. దీనిని జీర్ణించుకోలేని ఆమె మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి హెప్సిబారాణి (21) తణుకులోని ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చదువుతూ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హెప్సిబారాణి ఆత్మహత్యకు కారణమైన ఆమె ప్రియుడు పిండి ఆంజనేయులు అలియాస్ అంజిని పోలీసులు అదుపులో కి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, తణుకు సీఐ సీహెచ్ రాంబాబు నర్సింగ్ కళాశాల వసతి గృహంలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించి తోటి విద్యార్థులను విచారించారు. మత్తు ఇంజెక్షన్ చేసుకుని.. అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి రామారావు, కుమారి దంపతుల కుమార్తె హెప్సిబారాణి. తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో ఆమె అనాథగా మిగిలింది. కుటుంబ సభ్యుల నిరాదరణ కారణంగా పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన పాస్టర్ ఒకరు ఆమెను చేరదీసి తణుకులో నర్సింగ్ కోర్సు చదిస్తున్నారు. జీఎన్ఎం ఆఖరి సంవత్సరం చదువుతూ ఇటీవల పరీక్షలు సైతం రాసింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతుండగా ఈ ఘాతుకానికి పాల్పడింది. నర్సింగ్ కోర్సు చదువుతున్న హెప్సిబారాణి తణుకులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో ఆమె ప్రియుడు అంజితో కొంతకాలంగా ఘర్షణ పడుతోంది. తనకు ఇంతకుముందే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టిన అంజి వ్యవహారంపై స్నేహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలు స్తోంది. హాస్టల్లో సహచర విద్యార్థినులను విచారిస్తున్న సీఐ రాంబాబు అంజి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటుండగా నాలుగు రోజుల క్రితమే స్వదేశానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తనకు కడుపు నొప్పిగా ఉందని ఇంజెక్షన్ చేయాలని స్నేహితులను కోరింది. అయితే ఆమె తీసుకువచ్చిన ఇంజెక్షన్ అనుమానాస్పదంగా ఉండటంతో వారు నిరాకరించారు. దీంతో స్వయంగా హెప్సిబా రాణి తానే ఇంజెక్షన్ చేసుకుంది. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెంది నట్టు వైద్యులు ధ్రువీకరించారు. రోగులకు ఆపరేషన్లు చేసే సమయంలో ఇచ్చే మత్తు ఇంజెక్షన్ నరానికి చేసుకోవడం వల్ల ఆమె మృతి చెందినట్టు పోలీసులు, వైద్యులు ప్రాథమిక విచారణలో తేల్చా రు. మృతదేహానికి పోలీసులు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పరువు కోసం ప్రాణం తీసుకుని.. ‘నన్ను పెంచి పోషిస్తున్న పాస్టర్ గారి పరువు కోసమే చనిపోతున్నాను.. నేను ఎన్నో కలలు కన్నాను.. మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని.. అయితే నా కలలన్నీ కల్లలు చేశావు..’ అంటూ తన ప్రియుడు అంజిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్ గుండెల్ని కదిలిం చింది. మృతురాలు హెప్సిబారాణి తాను చనిపోవడానికి ముందు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు ముందుగా పిండి ఆంజనేయులు అలియాస్ అంజిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘కేవలం నీవల్లే నా జీవితం ఇలా అయిందనీ.. నేను నిన్ను ప్రేమించి జీవితంలో పెద్ద తప్పు చేశానని.. ఇకపై ఎవరినీ ఇలా మోసం చేయవద్దని’ సూసైడ్‌నోట్‌లో ఆమె పేర్కొంది. ‘నాలాంటి అనాథలను ఉన్నత స్థానం కల్పించి ప్రేమగా ఆదరిస్తున్న పాస్టర్కు ఐ లవ్యూ’ అంటూ ప్రేమను వ్యక్తపరిచింది. తనలా ఎవరూ మోసపోవద్దని తన స్నేహితులకు ఆమె సలహా ఇచ్చి తనువు చాలించింది. -
ప్రియుడు కాల్ రిసీవ్ చేసుకోలేదని..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ప్రియుడు మొబైల్ కాల్ రిసీవ్ చేసుకోలేదని కలత చెందిన నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నెలమంగల తాలూకా తిప్పగొండన హళ్లిలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రజియా ఖాటూన్(19) స్థానిక అంబిక నర్సింగ్ కళాశాలలో ఫస్టియర్ డిప్లొమా నర్సింగ్ చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న సమీం అల్సబ్‌తో కొంతకాలంగా ఆమె ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సమీపంలోని ఒక ప్రైవేటు తోటలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో ఇద్దరూ ఒక రోజు కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మొదట వెళ్లిన రజియా అల్సబ్‌కు పలుమార్లు ఫోన్ చేసింది. అయితే, అతడు కాల్ రిసీవ్ చేసుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన రజియా అక్కడే ఉరి వేసుకుంది. కాసేపటి తర్వాత నిర్వాహకులు గదిలో చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. వారి ఫిర్యాదు మేరకు నెలమంగల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం ముగిసిన తరువాత విమానంలో సొంతరాష్ట్రానికి తీసుకువెళ్లవచ్చని తెలిసింది.