గద్వాలపై కేసీఆర్‌ వరాల వర్షం | CM KCR Boons To Jogulamba Gadwal | Sakshi
Sakshi News home page

గద్వాలపై కేసీఆర్‌ వరాల వర్షం

Published Fri, Jun 29 2018 5:47 PM | Last Updated on Wed, Aug 15 2018 9:10 PM

CM KCR Boons To Jogulamba Gadwal - Sakshi

బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కే చంద్రశేఖర్‌ రావు

జోగులాంబ గద్వాల : జిల్లాపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు వరాల వర్షం కురిపించారు. గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన అనంతరం నడిగడ్డ ప్రగతి సభలో సీఎం ప్రసంగించారు. గద్వాల ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. గద్వాల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.

గట్టు ఎత్తిపోతల పథకానికి నల్ల సోమనాద్రి గట్ట ఎత్తిపోతల పథకం అని పేరు పెడతామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, వాటిలో ఒకటి గట్టులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేడీ దొడ్డిలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గుర్రంగడ్డ బ్రిడ్జిని రూ. 8 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తామని చెప్పారు.

గద్వాల బస్టాండ్‌కు ముఖ్యమంత్రి నిధి నుంచి రూ. 2 కోట్లు, జూరాల డ్యామ్‌ సైట్‌ దగ్గర బృందావనానికి రూ. 15 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ బహిరంగ సభకు మంత్రులు హరీశ్ రావు, ల‌క్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement