
సాక్షి, జోగులాంబ గద్వాల: కలుగొట్ల వాగులో రెండు రోజులుగా వెతుకుతున్న గర్భిణి నాగసింధూరెడ్డి(28) విగతజీవిగా తేలింది. సోమవారం తెల్లవారుజామున తుంగభద్ర నదిలో కర్నూలు బ్రిడ్జి దగ్గర గర్భిణీ మృతదేహం లభ్యమైంది. నాగసింధూరెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు హృదయ విదాకరంగా విలపించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భార్యభర్తలు నాగసింధూరెడ్డి, శివశంకర్‌రెడ్డితోపాటు వారి స్నేహితుడు జిలానీబాషా కలిసి శనివారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. కలుగొట్ల వాగులో వీరు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. మిగతా ఇద్దరు బయటపడగా.. సదరు మహిళ గల్లంతైంది. గల్లంతైన ప్రాంతం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి గర్భిణి శవమై విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. (నీటి ఉధృతికి కొట్టుకుపోయిన కారు..)
చదవండి: (తాత ఒకరికి... మనవడు మరొకరికి !)
Comments
Please login to add a commentAdd a comment