రోడ్లపై వరి నాట్లేసిన డీకే అరుణ | DK Aruna Protested the Damaged Roads in Jogulamba Gadwal District | Sakshi
Sakshi News home page

రోడ్లపై వరి నాట్లేసిన డీకే అరుణ

Published Thu, Sep 5 2019 3:53 PM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM

గుంతలతో పాడైన రోడ్లు, ఏళ్లుగా సాగుతున్న ఆర్వోబీ నిర్మాణానికి నిరసనగా మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ రోడ్డుపై వరినాట్లు వేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక రెండవ రైల్వేగేటు సమీపంలోని రోడ్డు గత వర్షాలకు పాడైపోయింది. మరమ్మత్తు చేయకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఈ నిరసన తెలిపారు. మరోవైపు గత ఐదేళ్లుగా ఆర్వోబి నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement