
సాక్షి, జోగుళాంబ గద్వాల : గుంతలతో పాడైన రోడ్లు, ఏళ్లుగా సాగుతున్న ఆర్వోబీ నిర్మాణానికి నిరసనగా మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ రోడ్డుపై వరినాట్లు వేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక రెండవ రైల్వేగేటు సమీపంలోని రోడ్డు గత వర్షాలకు పాడైపోయింది. మరమ్మత్తు చేయకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఈ నిరసన తెలిపారు. మరోవైపు గత ఐదేళ్లుగా ఆర్వోబి నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment