Bela
-
పోలింగ్ కేంద్రం మార్పు ఎప్పుడో..?
సాక్షి, బేల: వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల నేపథ్యంలోనైనా..ఏళ్ల నుంచి ప్రతిసారి ఎన్నికల నిర్వహణ కోసం కొనసాగుతున్న మండలకేంద్రం తాలూకు 1కిలోమీటరు పైబడి దూరపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్‌ల కేంద్రం మారేనా..?అంటూ స్థానిక ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల నుంచి కొనసాగుతున్న అదే దూరపు పోలింగ్ కేంద్రం ఇంకెనాళ్లని వారు అంటున్నారు. ఈ దూరపు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వయసు పైబడ్డ వయోజనులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఆసక్తి చూపెట్టడం లేదని తెలుస్తోంది. దీంతో పాటు ఓటు వేయడానికి దూరంగా ఉండిపోతున్నారు. కాగా ప్రస్తుతం మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో 3,324మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలాగైతే..ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రంలోని మూడు బూత్‌లలో మొత్తంగా 85శాతం పోలింగ్ దాటలేదు. దీంతో పోలింగ్ ఇప్పటికినీ 90శాతం మించలేదు. ఈ పోలింగ్ కేంద్రాన్ని మండలకేంద్రం మధ్యన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మార్చాలని స్థానిక ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రానికి.. మండలకేంద్రం తాలూకు 1కిలోమీటరు పైబడి దూరంలోని పోలింగ్ కేంద్రానికి ప్రైవేటు వాహనాల్లో ఓటర్లను ఓటు వేయడానికి ఆయా పార్టీల వారు ప్రత్యేకంగా తీసుకెళ్తున్నారు. ఇలా తీసుకెళ్లడంతోనూ ఎన్నికల ఖర్చు పెరుగుతోంది. దీంతో పాటు ఈ వాహనాల్లోనూ ఓటర్లను ప్రలోభాలు చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఆసక్తి తగ్గుతోంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఈ పోలింగ్ కేంద్రం దూరమవుతుందని, దగ్గరకు మార్చాలని గతంలో పలుమార్లు అప్పటి అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినాం. ఎవరు పట్టించుకోలేదు. ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లడానికి వయోజనులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ దూరపు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ఆసక్తి తగ్గుతోంది. ఏళ్ల నుంచి ఎన్నికల కోసం కిలోమీటరు దూరపు పోలింగ్ కేంద్రం మార్పు ఇంకెప్పుడో..?తెలియడం లేదు. –గౌరి పురుషోత్తం, ఓటరు ప్రభుత్వ కళాశాలకు మార్చాలి ఇప్పటిదాకా ఎన్నికల కోసం కొనసాగుతున్నకిలోమీటరు దూరపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, ఓటర్లందరికి దగ్గరగా ఉన్న మండలకేంద్రం మధ్యన ఉన్న అన్ని సౌకర్యాలతో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మార్చాలి. గతంలో ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో, పోలింగ్ కేంద్రాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్ణయించారు. ఇప్పుడు ఆఫీసర్లు దీన్ని గుర్తించి, దూరపు పోలింగ్ కేంద్రాన్ని దగ్గరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మార్చాలి. –మెహబుబ్ ఖాన్ ఎన్నికల అధికారులు స్పందించాలి ఈ పోలింగ్ కేంద్రం మార్పుపై ఎలక్షన్ ఆఫీసర్లు స్పందించాలి. గతంలో వేరు. ఇప్పుడు వేరు పరిస్థితులు ఉన్నాయి. గతంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తప్ప, మరో పెద్ధ భవనం లేదు. ఇప్పుడు ఆరేళ్ల నుంచి దగ్గరలో పూర్తిస్థాయిలో సౌకర్యవంతంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఈ పోలింగ్ కేంద్రాన్ని మార్చాలి. –బ్యాతంవార్ ప్రకాశ్ -
వికటించిన ఆర్ఎంపీ వైద్యం
కేసు నమోదు, విచారణ క్లినిక్‌తోపాటు మెడికల్‌షాపు సీజ్ బేల : వాంతులు, విరోచనాలతో వచ్చిన ఓ బాలుడికి పరిమితికి మించి వైద్యం చేసిన ఆర్ఎంపీ లక్ష్మణ్‌పై శుక్రవారం కేసు నమోదైంది. ౖÐð ద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా విచారణ చేపట్టి అతను నడుపుతున్న క్లినిక్‌తోపాటు మెడికల్ షాపును సీజ్ చేశారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మణియాపూర్ గ్రామానికి షేక్ అయాన్ (8) వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆగస్టు 24న బేల మండల కేంద్రంలోని శివాజీచౌరస్తా సమీపంలో గల ఓ ప్రైవేటు క్లినిక్‌కు తీసుకెళ్లగా ఆర్ఎంపీ లక్ష్మణ్ వైద్యం చేశారు. ఏమైందో ఏమో గాని అదే రోజు బాలుడి ఎడమచేయి, కాలుకు పక్షపాతం వచ్చింది. మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని పిల్లల వైద్య నిపుణులు స్వామి వద్ద చూపించగా అతను హైదరాబాద్ రెఫర్ చేశారు. ఎస్కేఎస్ న్యూరో పాలిట్రామ ఆస్పత్రిలో పరీక్షలు వైద్యం వికటించి మెదడులో కుడివైపు రక్తనాళాలు చిట్లిపోయి పక్షపాతం వచ్చినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో బాలుడి తండ్రి జఫర్ ఈ నెల 21 స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులకు ఫిర్యాదు చేయగా వైద్య, ఆరోగ్యశాఖ ఆదిలాబాద్ క్లస్టర్ ఎస్పీహెచ్వో సాధన శుక్రవారం విచారణ చేపట్టారు. ముందుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలుడు షేక్ అయాన్, తండ్రి జఫర్‌తోపాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆర్ఎంపీ ఇచ్చిన వైద్యం, మరుసటి రోజు ఆదిలాబాద్‌లో పిల్లల వైద్య నిపుణులు స్వామి చెకప్, హైదరాబాద్‌లోని వైద్య చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లి, ఆర్ఎంపీ వైద్యుడు లక్ష్మణ్‌తో మాట్లాడారు. బాలుడు అయాన్‌కు వాంతులతోపాటు విరేచనాలకు ఇచ్చిన వైద్యంపై ఆరా తీశారు. ఈ క్రమంలో బాలుడు నాటకం ఆడుతున్నాడని, బ్లాక్మెయిల్ కోసం ఇదంతా చేస్తున్నారని ఆర్ఎంపీ చెప్పడంతో బాధితుల తరఫు వారు ఆగ్రహంతో క్లినిక్ ఎదుట ఆందోళన చేశారు. వీరందరిని ఎస్సై నరేశ్‌కుమార్ సముదాయించారు. క్లినిక్ సీజ్.. ఆర్ఎంపీ చిట్టీపై ఇంజక్షన్లు, మాత్రలతో వైద్యం చేసినట్లు గుర్తించినట్లు ఎస్పీహెచ్వో సాధన తెలిపారు. ఆర్ఎంపీ ప్రాథమిక వైద్యం కాకుండా పరిమితికి మించి వైద్యం చేయడం, హైడోసులు వాడడం, క్లినిక్‌లో వైద్యం చేస్తున్న ఇతడి అర్హత పత్రాలు సరిగా లేకపోవడంతో క్లినిక్‌తోపాటు మెడికల్ షాపును సీజ్ చేసినట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట సర్పంచ్ మస్కే తేజ్‌రావు, వైఎస్ ఎంపీపీ నిపుంగే సంజయ్, మండల కోఆప్షన్ సభ్యుడు తన్వీర్ ఖాన్, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి టాక్రే గంభీర్, మైనార్టీ యూత్ సభ్యులు ఉన్నారు. ఆర్ఎంపీపై కేసు నమోదు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు క్లినిక్ ఆర్ఎంపీ వైద్యుడు లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. ఎడమ చేయితోపాటు కాలు పక్షపాతానికి గురైన బాలుడు షేక్ అయాన్ తండ్రి జఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేసినట్లు పేర్కొన్నారు. -
వక్ఫ్ భూముల కోసం రాస్తారోకో
బేల : వక్ఫ్ భూముల కోసం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోని అంతరాష్ట్రరోడ్డుపై గురువారం స్థానిక జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వక్ఫ్ భూములను తమకు అప్పగించడంలో వక్ఫ్ బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్, త హశీల్దార్లు పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల కో ఆప్షన్ సభ్యుడు తన్వీర్‌ఖాన్, కమిటీ సభ్యులు మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా స్థానిక జామా మసీదు నిర్వహణను పట్టించుకోని నవాబొద్దీన్ వక్ఫ్ భూములను తన స్వాధీనంలో ఉంచుకున్నాడని ఆరోపించారు. విలువైన ఈ భూములను కమిటీకి అప్పగిస్తానని గతంలో రాత పూర్వకంగా రాసిచ్చి ఆ తర్వాత నిరాకరిస్తున్నాడని పేర్కొన్నారు. కోర్టు ఈ భూములను కమిటీకి అప్పగించాలనీ తీర్పు ఇచ్చినా ఆయన స్పందించడం లేదని పేర్కొన్నారు. వెంటనే ఈ భూములను జామా మసీదు మసాబ్ కమిటీకి అప్పగించాలని, లేని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ధర్నా వద్దకు చేరుకున్న త హశీల్దార్, ఆందోళనకారులను సముదాయించారు. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆందోళ నలో కమిటీ సభ్యులు అబ్ధుల్ సలీం, హపీజ్, మసూద్ హైమద్, బబన్, ముస్తాక్, షకీల్‌ఖాన్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీ కోసం రణం
బేల : పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బేల మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై బుధవారం కాంగ్రెస్, బీజేపీ నాయకులు, రైతులు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. రుణ మాఫీ వెంటనే చేసేలా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించాలని నాయకు లు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. దీంతో పాటు స్థానిక ఇందిరా చౌరస్తా వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి, ధర్నా చేపట్టారు. అయితే బుధవారం వారసంత కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో ధర్నా విరమించి, వెనుదిరిగారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు నాక్లే రాందాస్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కి వచ్చి, 2 నెలలకు పైగా గడుస్తోందని, ఇప్పటిదాకా సమీక్షలు, సమావేశాలతో కాలయాపన తప్ప చేసేందే మీ లేదని దుయ్యబట్టారు. రుణ మాఫీపై ముఖ్యమం త్రి వెంటనే స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచులు వాంఖడే రూప్‌రావు, మెస్రం దౌలత్, బీజెపీ మండల అధ్యక్షుడు బోనిగిరివార్ గణేశ్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గెడాం మాధవ్, మైనార్టీ అధ్యక్షుడు ఫైజుల్లాఖాన్, బేల సహకార సంఘం మాజీ అధ్యక్షుడు సుధాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోపత్ శంకర్, నాయకులు మల్లారెడ్డి, రమేశ్, గుండవార్ సంజయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
కిలో మీటర్ వెళ్తేనే నీళ్లు
బిందెడు నీటికి కిలో మీటర్ దూరం వెళ్లాల్సి వస్తోంది. ఏటా గిరిజనం కష్టాలు పడుతున్నా పట్టించుకునే దిక్కులేదు. 12 వందల మందికిపైగా జనాభా ఉన్నా నీటి సౌకర్యం మాత్రం కల్పించలేకపోతున్నారు పాలకులు. సుమారు 225 గిరిజన కుటుంబాలు గుక్కెడు నీటికి అల్లాడుతున్నాయి. పాలకుల హామీల వర్షంతో తడుస్తున్న గిరిజనానికి మాత్రం శాశ్వత మంచినీటి సరఫరా కనుచూపు మేరలో కనిపించడం లేదు. ‘గిరి’జనం కష్టాలు - ఎడ్ల బండ్లతో నీటి తరలింపు - పని చేయని రెండు నీటి పథకాలు - పట్టించుకోని పంచాయతీ పాలకవర్గం, అధికారులు బేల, న్యూస్‌లైన్ : మండలంలోని ఏజెన్సీ గిరిజనం నీటి గోడు వినేవారు కరువయ్యారు. సదల్పూర్ గ్రామంలో ఏటా వేసవిలో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నిధులు ఖర్చు అవుతున్నాయి తప్పితే సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. గ్రామంలో దాదాపు 225 వరకు కుటుంబాలు ఉండగా, జనాభా 12వందలకు పైగా ఉంది. ప్రభుత్వం రూ.16 లక్షలు వెచ్చించి గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఒక ట్యాంకు, ఐటీడీఏ ఆధ్వర్యంలో బైరందేవ్-మహదేవ్ ఆలయాల సమీపంలో మరో ట్యాంకు 40 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించారు. స్థానికంగా నీటి వనరులు(బోర్లు) పడకపోవడంతో రెండు ట్యాంకులకు ఆలయ సమీపంలోని బావికి పైపులైన్ కనెక్షన్ ఇచ్చారు. ఎండాకాలం బావిలో నీరు అడుగంటిపోతున్నాయి. చేతిపంపు నుంచి నీళ్లు రావడం లేదు. శాశ్వత నీటి పరిష్కారంకోసం రెండేళ్లక్రితం 3 కి.మీల దూరంలోని జూనోని మార్గంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ బోరు వేయించింది. బావి వరకు పైప్‌లైన్‌తో నీటి సరఫరాను గత నవంబర్‌లో ప్రారంభించారు. ఈ పైప్లైన్మార్గంలో 25రోజులక్రితం ఎయిర్వాల్ల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో చేసేదిలేక కి.మీ దూరంలోని ఆలయాల సమీప బావి నుంచి నీటిని గిరిజనులు తీసుకెళ్తున్నారు. ఏం చేస్తున్నరో..? మా ఊరికి లీడర్లు, ఆఫీసర్లు ఆ మీటింగు, ఈ మీటింగు అనుకుంటూ వస్తరు. టాకీ పని చేయడం లేదని రాసుకొని పోతరు. ఏం చేస్తున్నారో..? తెలియడం లేదు. ఏటా ఎండకాలం గుడి నూతి నుంచి నెత్తిమీద బిందెలతో నీళ్లు మోసుకోక తప్పడం లేదు. - కొడప అయ్యు బాయి టాకీలు వెస్ట్గా ఉంటున్నయ్ మా ఊరికి నీళ్లకోసం కట్టిన రెండుటాకీలు వెస్ట్గా ఉన్నాయి. గుడి దగ్గరి నూతి నుంచి ఎడ్లబండిపై డ్రమ్ములతో నీళ్లు మోసుకుంటున్నం. ఏటా ఇట్లనే ఉన్నది. దీన్ని పంచాయతీ వాళ్లు గానీ,ఆఫీసర్లు ఏమాత్రం పట్టించుకోరు. పట్టించుకునే వాళ్లు ఉంటే మాకు నీళ్లకోసం ఈ తిప్పలు ఉండేవి కావు. - భీంరావు