వికటించిన ఆర్‌ఎంపీ వైద్యం | Fail to rmp treatment | Sakshi
Sakshi News home page

వికటించిన ఆర్‌ఎంపీ వైద్యం

Published Fri, Sep 23 2016 11:27 PM | Last Updated on Thu, Aug 30 2018 6:11 PM

Fail to rmp treatment

  • కేసు నమోదు, విచారణ   
  • క్లినిక్‌తోపాటు మెడికల్‌షాపు సీజ్‌
  • బేల : వాంతులు, విరోచనాలతో వచ్చిన ఓ బాలుడికి పరిమితికి మించి వైద్యం చేసిన ఆర్‌ఎంపీ లక్ష్మణ్‌పై శుక్రవారం కేసు నమోదైంది. ౖÐð ద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా విచారణ చేపట్టి అతను నడుపుతున్న క్లినిక్‌తోపాటు మెడికల్‌ షాపును సీజ్‌ చేశారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మణియాపూర్‌ గ్రామానికి షేక్‌ అయాన్‌ (8) వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆగస్టు 24న బేల మండల కేంద్రంలోని శివాజీచౌరస్తా సమీపంలో గల ఓ ప్రైవేటు క్లినిక్‌కు తీసుకెళ్లగా ఆర్‌ఎంపీ లక్ష్మణ్‌ వైద్యం చేశారు. ఏమైందో ఏమో గాని అదే రోజు బాలుడి ఎడమచేయి, కాలుకు పక్షపాతం వచ్చింది. మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని పిల్లల వైద్య నిపుణులు స్వామి వద్ద చూపించగా అతను హైదరాబాద్‌ రెఫర్‌ చేశారు. ఎస్‌కేఎస్‌ న్యూరో పాలిట్రామ ఆస్పత్రిలో పరీక్షలు వైద్యం వికటించి మెదడులో కుడివైపు రక్తనాళాలు చిట్లిపోయి పక్షపాతం వచ్చినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో బాలుడి తండ్రి జఫర్‌ ఈ నెల 21 స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులకు ఫిర్యాదు చేయగా వైద్య, ఆరోగ్యశాఖ ఆదిలాబాద్‌ క్లస్టర్‌ ఎస్‌పీహెచ్‌వో సాధన శుక్రవారం విచారణ చేపట్టారు. ముందుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలుడు షేక్‌ అయాన్, తండ్రి జఫర్‌తోపాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆర్‌ఎంపీ ఇచ్చిన వైద్యం, మరుసటి రోజు ఆదిలాబాద్‌లో పిల్లల వైద్య నిపుణులు స్వామి చెకప్, హైదరాబాద్‌లోని వైద్య చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లి, ఆర్‌ఎంపీ వైద్యుడు లక్ష్మణ్‌తో మాట్లాడారు. బాలుడు అయాన్‌కు వాంతులతోపాటు విరేచనాలకు ఇచ్చిన వైద్యంపై ఆరా తీశారు. ఈ క్రమంలో బాలుడు నాటకం ఆడుతున్నాడని, బ్లాక్‌మెయిల్‌ కోసం ఇదంతా చేస్తున్నారని ఆర్‌ఎంపీ చెప్పడంతో బాధితుల తరఫు వారు ఆగ్రహంతో క్లినిక్‌ ఎదుట ఆందోళన చేశారు. వీరందరిని ఎస్సై నరేశ్‌కుమార్‌ సముదాయించారు. 
    క్లినిక్‌ సీజ్‌..
    ఆర్‌ఎంపీ చిట్టీపై ఇంజక్షన్లు, మాత్రలతో వైద్యం చేసినట్లు గుర్తించినట్లు ఎస్‌పీహెచ్‌వో సాధన తెలిపారు. ఆర్‌ఎంపీ ప్రాథమిక వైద్యం కాకుండా పరిమితికి మించి వైద్యం చేయడం, హైడోసులు వాడడం, క్లినిక్‌లో వైద్యం చేస్తున్న ఇతడి అర్హత పత్రాలు సరిగా లేకపోవడంతో క్లినిక్‌తోపాటు మెడికల్‌ షాపును సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట సర్పంచ్‌ మస్కే తేజ్‌రావు, వైఎస్‌ ఎంపీపీ నిపుంగే సంజయ్, మండల కోఆప్షన్‌ సభ్యుడు తన్వీర్‌ ఖాన్, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి టాక్రే గంభీర్, మైనార్టీ యూత్‌ సభ్యులు ఉన్నారు.
    ఆర్‌ఎంపీపై కేసు నమోదు
    మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు క్లినిక్‌ ఆర్‌ఎంపీ వైద్యుడు లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌కుమార్‌ తెలిపారు. ఎడమ చేయితోపాటు కాలు పక్షపాతానికి గురైన బాలుడు షేక్‌ అయాన్‌ తండ్రి జఫర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేసినట్లు పేర్కొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement