
దసరా మూవీతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా ఆయనకు ఓ కేసులో ఊరట లభించింది. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతనితో పాటు మరో ఆరుగురిని కొచ్చిలోని అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులు కొకైన్ సేవించినట్లు సరైనా ఆధారాలు లేవంటూ నటుడు చాకో సహా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరితో పాటు ఓ నైజీరియన్, తమిళనాడుకు చెందిన పృథ్వీరాజ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. జనవరి 30, 2015న కొచ్చిలోని కడవంత్రాలోని ఒక ఫ్లాట్‌లో కొకైన్ సేవించారని షైన్ టామ్ చాకోతో పాటు నలుగురు మహిళా మోడల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2015 మార్చిలో బెయిల్ పొందిన తర్వాత అందరూ జైలు నుంచి బయటకు వచ్చారు.
కాగా.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరాలో చిన్ననంబిగా విలనిజంతో మెప్పించారు. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా పాత్రలు దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య డాకు మహారాజ్‌లో కూడా నటించారు. ప్రస్తుతం మలయాళంలో సినిమాలతో బిజీగా ఉన్నారు.
రు.
Comments
Please login to add a commentAdd a comment