Dasara Movie
-
దసరా విలన్‌కు ఊరట.. ఆ విషయంలో క్షమాపణలు చెప్పిన నటి
దసరా విలన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రముఖ నటి విన్సీ అలోషియస్ ఆరోపణలతో ఆయనపై మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలకు తీసుకునేందు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో పోలీసులు రైడ్ చేయడంతో ఓ హోటల్ నుంచి పారిపోయాడని కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.అయితే అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తోన్న విన్సీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. టామ్ చాకోపై తానేలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకోవడం లేదని తెలిపింది. ఈ సమస్యను చిత్ర పరిశ్రమలో కాకుండా అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే కేరళ ఫిల్మ్ ఛాంబర్, అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి)కి దాఖలు చేసిన ఫిర్యాదును మాత్రం ఉపసంహరించుకోబోనని ఆమె తెలిపారు. ఇప్పటికైనా మలయాళ చిత్ర పరిశ్రమలో మార్పు రావాలని కోరుకుంటున్నానని విన్సీ తెలిపారు. అందుకే తాను ఫిర్యాదుతో ముందుకు వెళ్లానని విన్సీ అలోషియస్ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని ఆమె పేర్కొన్నారు.కాగా.. ఓ మూవీ షూట్ సమయంలో షైన్ టామ్ చాకో తన దుస్తులను సరిచేయమని పట్టుబట్టాడని ఆరోపిస్తూ విన్సీ అలోషియస్ ఫిర్యాదు చేసింది. వీరిద్దరు కలిసి నటించిన 'సూత్రవాక్యం' సెట్స్‌లో టామ్ డ్రగ్స్ వాడాడని కూడా ఆమె ఆరోపించింది. తన ఫిర్యాదుపై అంతర్గత కమిటీ విచారణకు సహకరిస్తానని నటి తెలిపింది. కాగా.. విన్సీ అంతకుముందు తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. షైన్ టామ్ చాకో పేరును కేరళ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ సాజీ నంతియట్టు మీడియాకు వెల్లడించారని ఆమె పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో అతని పేరును బయటికి చెప్పినందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని విన్సీ తెలిపింది. -
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే తాజాగా టామ్ చాకో మరో వివాదం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సెట్లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపణలు చేస్తోంది. దీంతో అతనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసిన విచారణ చేయనున్నట్లు అమ్మ(AMMA) అసోసియేషన్ వెల్లడించింది. షైన్ టామ్ చాకోతో కలిసి విన్సీ సోనీ సూత్రవాక్యం అనే సినిమాలో నటించింది. ఆమె ఆరోపణలతో చాకోపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: దసరా విలన్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటన)మరోవైపు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్‌కు వెళ్లగా ఆయన హోటల్ నుంచి పారిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. పోలీసుల బృందం హోటల్‌కు రావడానికి ముందే తప్పించుకున్నారని సమాచారం. మూడో అంతస్తులో ఉన్న నటుడు.. కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి మెట్ల మార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైమైనా గతంలో ఓ డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ఆరోపణలు రావడం గమనార్హం. -
దసరా విలన్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటన
దసరా మూవీతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా ఆయనకు ఓ కేసులో ఊరట లభించింది. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతనితో పాటు మరో ఆరుగురిని కొచ్చిలోని అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులు కొకైన్ సేవించినట్లు సరైనా ఆధారాలు లేవంటూ నటుడు చాకో సహా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరితో పాటు ఓ నైజీరియన్, తమిళనాడుకు చెందిన పృథ్వీరాజ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. జనవరి 30, 2015న కొచ్చిలోని కడవంత్రాలోని ఒక ఫ్లాట్‌లో కొకైన్ సేవించారని షైన్ టామ్ చాకోతో పాటు నలుగురు మహిళా మోడల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2015 మార్చిలో బెయిల్ పొందిన తర్వాత అందరూ జైలు నుంచి బయటకు వచ్చారు.కాగా.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరాలో చిన్ననంబిగా విలనిజంతో మెప్పించారు. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా పాత్రలు దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య డాకు మహారాజ్లో కూడా నటించారు. ప్రస్తుతం మలయాళంలో సినిమాలతో బిజీగా ఉన్నారు.రు. -
దసరా కాంబినేషన్ షురూ
‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో ‘నాని ఓదెల 2’ (వర్కింగ్ టైటిల్) చిత్రం ఆరంభమైంది. ‘‘మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్లో నానీని చూపించే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే కథని తయారు చేశారు శ్రీకాంత్ ఓదెల.భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ‘దసరా’ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం, పలు అవార్డులు అందుకోవడంతో పాన్ ఇండియా చిత్రం ‘నాని ఓదెల 2’ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను చేరుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
సైమా అవార్డ్స్ 2024.
-
మహేష్ బాబు - రాజమౌళి సినిమా ఇప్పట్లో లేనట్లేనా..
-
దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు
-
ఈ దసరా నిరుడు లెక్క ఉండదంటోన్న నాని
Nani New Movie Dasara Glimpse: వరుస సినిమాలతో జోరు మీదున్నాడు నాని. ఈ మధ్యే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకులను ఓటీటీ ద్వారా పలకరించాడు. మరోవైపు శ్యామ్సింగరాయ్తో థియేటర్లో జనాలను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అలాగే అంటే సుందరానికి చిత్రం షూటింగ్‌తోనూ యమ బిజీగా ఉన్నాడు. తాజాగా నేడు(అక్టోబర్ 15) దసరా పండగను పురస్కరించుకుని మరో కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ దసరా నిరుడు లెక్క ఉండదు అంటూ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ వదిలాడు. అలాగే సినిమా కాన్సెప్ట్ గురించి హింట్ ఇస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. చిత్తుచిత్తుల బొమ్మ పాటతో వీడియో మొదలవుతుంది. పాతకాలం నాటి రైలును, నానిని, కీర్తి సురేష్‌ను చూపించారు. చివర్లో.. 'ఈ దసరా నిరుడు లెక్కుండదు బాంచత్.. జమ్మి వెట్టి చెప్తాన్నా.. బద్ధలు బాసింగాలైతయ్.. ఎట్లైతే గట్లనే, చూస్కుందాం' అన్న తెలంగాణ యాసలో డైలాగ్ ఇరగదీశాడు నాని. శ్రీకాంత్ ఓదెల దసరా మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.