‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో ‘నాని ఓదెల 2’ (వర్కింగ్ టైటిల్) చిత్రం ఆరంభమైంది. ‘‘మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో నానీని చూపించే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే కథని తయారు చేశారు శ్రీకాంత్ ఓదెల.
భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ‘దసరా’ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం, పలు అవార్డులు అందుకోవడంతో పాన్ ఇండియా చిత్రం ‘నాని ఓదెల 2’ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను చేరుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment