Nani New Movie Dasara Glimpse: వరుస సినిమాలతో జోరు మీదున్నాడు నాని. ఈ మధ్యే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకులను ఓటీటీ ద్వారా పలకరించాడు. మరోవైపు శ్యామ్‌సింగరాయ్‌తో థియేటర్‌లో జనాలను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అలాగే అంటే సుందరానికి చిత్రం షూటింగ్‌తోనూ యమ బిజీగా ఉన్నాడు. తాజాగా నేడు(అక్టోబర్ 15) దసరా పండగను పురస్కరించుకుని మరో కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ దసరా నిరుడు లెక్క ఉండదు అంటూ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ వదిలాడు.
అలాగే సినిమా కాన్సెప్ట్ గురించి హింట్ ఇస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. చిత్తుచిత్తుల బొమ్మ పాటతో వీడియో మొదలవుతుంది. పాతకాలం నాటి రైలును, నానిని, కీర్తి సురేష్‌ను చూపించారు. చివర్లో.. 'ఈ దసరా నిరుడు లెక్కుండదు బాంచత్.. జమ్మి వెట్టి చెప్తాన్నా.. బద్ధలు బాసింగాలైతయ్.. ఎట్లైతే గట్లనే, చూస్కుందాం' అన్న తెలంగాణ యాసలో డైలాగ్ ఇరగదీశాడు నాని. శ్రీకాంత్ ఓదెల దసరా మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment