వివాహేతర సంబంధంతోనే భ్రూణహత్య
వివాహేతర సంబంధంతోనే భ్రూణహత్య
Published Mon, Oct 10 2016 9:05 PM | Last Updated on Thu, Aug 30 2018 6:11 PM
నెలన్నర క్రితం మాధవరం గ్రామంలో కలకలం సృష్టించిన మృత శిశువు కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధంతోనే భ్రూణహత్యకు పాల్పడి శిశువు మృతదేహాన్ని పాడుబడిన ఇంటిలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన జంటతో పాటు ఆర్‌ఎంపీ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను మాధవరం పోలీసు స్టేషన్‌లో సీఐ నాగేశ్వరరావు విలేకరులకు వివరించారు.
- మంత్రాలయం రూరల్
తెలంగాణ రాష్ట్రం గద్వాల మండలం పాతకల్లు గ్రామానికి చెందిన జయమ్మ భర్త మరణించడంతో జీవనోపాధి నిమిత్తం మాధవరం గ్రామంలోని ఓ హోటల్‌లో ఏడాది క్రితం పని మనిషిగా చేరింది. అక్కడ పని చేస్తున్న కర్ణాటక రాష్ట్రం రాయాచూర్‌కు చెందిన షేక్ మహబూబ్‌తో పరి చేయడం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. ఏడో నెలలో అబార్షన్ చేయించుకోవాలనుకున్నారు. ఽఆగస్టు 23వ తేదీన స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ డాక్టర్ నాగరాజును సంప్రదించారు. కొంత నగదు తీసుకుని మాత్రలు ఇచ్చారు. అయితే అప్పటికే నెలలు నిండంతో అబార్షన్ కష్టమైంది. 27వ తేదీ రాత్రి ఆర్‌ఎంపీకి దగ్గరికి వెళ్లారు. వైద్యుడు డబ్బుకు ఆశపడి జయమ్మ గర్భాన్ని తొలగించాడు. మృత ఆడ శిశువును గ్రామ చావిడి పక్క భాగంలో పాడుబడిన ఇంటిలో ఆర్‌ఎంపీ నాగరాజు పారవేశారు. మరుసటి రోజు శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. జయమ్మ, మహబూబ్‌ను అనుమానితులుగా అదుపులోకి తీసుకుని విచారించగా కేసు మిస్టరీ వీడింది.
నిందితులకు రిమాండ్
విచారణలో భాగంగా సోమవారం తహశీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్మశాన వాటికలో శిశువు మృతదేహాన్ని వెలికితీశారు. ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన వైద్యులు మాధవి, చంద్రశేఖర్‌లు పాప పుర్రె, చేతులు, కాళ్లకు సంబంధిచిన ఎముకలను సేకరించారు. డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించిన తరువాత నివేదికను అందజేస్తామని సీఐ నాగేశ్వరరావుకు వివరించారు. దీంతో ఆర్‌ఎంపీ డాక్టర్ నాగరాజు, జయమ్మ, మహబూబ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరుచగా మెజిస్రే్టట్ రిమాండ్‌కు ఆదేశించారు. కేసును ఛేదించడంలో హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ శ్రీనులను సీఐ అభినందించారు. సమావేవంలో ఎస్‌ఐ రాజారెడ్డి, గ్రామ రెవెన్యూ అధికారులు శ్వేత, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement