కిలో మీటర్ వెళ్తేనే నీళ్లు | move water with Bullock carts | Sakshi
Sakshi News home page

కిలో మీటర్ వెళ్తేనే నీళ్లు

Published Fri, May 9 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM

కిలో మీటర్ వెళ్తేనే నీళ్లు

కిలో మీటర్ వెళ్తేనే నీళ్లు

బిందెడు నీటికి కిలో మీటర్ దూరం వెళ్లాల్సి వస్తోంది. ఏటా గిరిజనం కష్టాలు పడుతున్నా పట్టించుకునే దిక్కులేదు. 12 వందల మందికిపైగా జనాభా ఉన్నా నీటి సౌకర్యం మాత్రం కల్పించలేకపోతున్నారు పాలకులు. సుమారు 225 గిరిజన కుటుంబాలు గుక్కెడు నీటికి అల్లాడుతున్నాయి. పాలకుల హామీల వర్షంతో తడుస్తున్న గిరిజనానికి మాత్రం శాశ్వత మంచినీటి సరఫరా కనుచూపు మేరలో కనిపించడం లేదు.
 
 ‘గిరి’జనం కష్టాలు
- ఎడ్ల బండ్లతో నీటి తరలింపు
- పని చేయని రెండు  నీటి పథకాలు
- పట్టించుకోని పంచాయతీ పాలకవర్గం, అధికారులు

 
 బేల, న్యూస్‌లైన్ : మండలంలోని ఏజెన్సీ గిరిజనం నీటి గోడు వినేవారు కరువయ్యారు. సదల్‌పూర్ గ్రామంలో ఏటా వేసవిలో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నిధులు ఖర్చు అవుతున్నాయి తప్పితే సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. గ్రామంలో దాదాపు 225 వరకు కుటుంబాలు ఉండగా, జనాభా 12వందలకు పైగా ఉంది. ప్రభుత్వం రూ.16 లక్షలు వెచ్చించి గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఒక ట్యాంకు, ఐటీడీఏ ఆధ్వర్యంలో బైరందేవ్-మహదేవ్ ఆలయాల సమీపంలో మరో ట్యాంకు 40 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించారు. స్థానికంగా నీటి వనరులు(బోర్లు) పడకపోవడంతో రెండు ట్యాంకులకు ఆలయ సమీపంలోని బావికి పైపులైన్ కనెక్షన్ ఇచ్చారు. ఎండాకాలం బావిలో నీరు అడుగంటిపోతున్నాయి.

చేతిపంపు నుంచి నీళ్లు రావడం లేదు. శాశ్వత నీటి పరిష్కారంకోసం రెండేళ్లక్రితం 3 కి.మీల దూరంలోని జూనోని మార్గంలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ బోరు వేయించింది. బావి వరకు పైప్‌లైన్‌తో నీటి సరఫరాను గత నవంబర్‌లో ప్రారంభించారు. ఈ పైప్‌లైన్‌మార్గంలో 25రోజులక్రితం ఎయిర్‌వాల్‌ల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో చేసేదిలేక  కి.మీ దూరంలోని ఆలయాల సమీప బావి నుంచి నీటిని గిరిజనులు తీసుకెళ్తున్నారు.
 
ఏం చేస్తున్నరో..?
మా ఊరికి లీడర్లు, ఆఫీసర్లు ఆ మీటింగు, ఈ మీటింగు అనుకుంటూ వస్తరు. టాకీ పని చేయడం లేదని రాసుకొని పోతరు. ఏం చేస్తున్నారో..? తెలియడం లేదు. ఏటా ఎండకాలం గుడి నూతి నుంచి నెత్తిమీద బిందెలతో నీళ్లు మోసుకోక తప్పడం లేదు.
 - కొడప అయ్యు బాయి
 
 టాకీలు వెస్ట్‌గా ఉంటున్నయ్
 మా ఊరికి నీళ్లకోసం కట్టిన రెండుటాకీలు వెస్ట్‌గా ఉన్నాయి. గుడి దగ్గరి నూతి నుంచి ఎడ్లబండిపై డ్రమ్ములతో నీళ్లు మోసుకుంటున్నం. ఏటా ఇట్లనే ఉన్నది. దీన్ని పంచాయతీ వాళ్లు గానీ,ఆఫీసర్లు ఏమాత్రం పట్టించుకోరు. పట్టించుకునే వాళ్లు ఉంటే మాకు నీళ్లకోసం ఈ తిప్పలు ఉండేవి కావు.
 - భీంరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement