30 ఏళ్ల పాటు వక్ఫ్‌బోర్డు ఆస్తుల లీజు
- వక్ఫ్‌బోర్డు అధీనంలో నాంపల్లి దర్గా హుండీ
- వారం పద్ధతిపై జాన్‌పాడ్ దర్గా హుండీ వేలం
- వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఆస్పత్రి నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆదాయ వనరులు పెంచుకునేందుకు 11 రకాల ఆస్తులను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వా లని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు పాలక మండలి సమా వేశం తీర్మానించింది. సోమవారం హైదరా బాద్ హజ్‌హౌస్‌లో బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ నాంపల్లిలోని దర్గా యూసుఫైన్ ముతవల్లి పదవీకాలం పొడిగిం పును రద్దు చేస్తూ దర్గా హుండీని వక్ఫ్‌బోర్డు అధీనంలోకి తీసుకోవాని నిర్ణయించింది.
వక్ఫ్‌బోర్డు ఆస్తులపై హోర్డింగ్‌ల ఏర్పాటును రద్దు చేసింది. నల్లగొండ జిల్లాలోని హజరత్ జాన్‌పాడ్ దర్గా హుండీ వారం పద్ధతిపై వేలం వేయాలని, బడా పహాడ్, జహంగీర్ పీరా హుండీలకు టెండర్ పిలవాలని నిర్ణయిం చింది. గుట్టల బేగంపేటలోని ఆస్తులను పూర్తి స్థాయి వక్ఫ్‌బోర్డు నిర్వహణలోకి తీసుకుంటూ తీర్మానించింది. వక్ఫ్‌బోర్డు ద్వారా వితంతు వులు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయిం చింది. సీఎంతో చర్చించి రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.
వక్ఫ్‌బోర్డులో పనిచేస్తున్న 70 ఏళ్లు దాటిన వారి సేవలను రద్దు చేస్తూ ఇటీవల పదవీ విరమణ చేసిన ముగ్గురి పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్, మిర్జా అన్వర్ బేగ్, వహీద్ అహ్మద్, డాక్టర్ నాసిర్ హుస్సేన్, మల్లిక్ మోతసమ్ ఖాన్, సోఫియా బేగం తదితరులు పాల్గొన్నారు.