విశ్వ మానవ సమాజం శాంతి, సన్మార్గాల్లో పయనించాలని ముస్లిం మత గురువు ఇమామ్ ముక్తి దయాస్ మొహియొద్దిన్ ప్రబోధించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా కరీంనగర్ శివారులోని సాలేహ్ నగర్‌లోని ఈద్గా వద్ద శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కరీంనగర్ కల్చరల్, న్యూస్‌లైన్ : విశ్వ మానవ సమాజం శాంతి, సన్మార్గాల్లో పయనించాలని ముస్లిం మత గురువు ఇమామ్ ముక్తి దయాస్ మొహియొద్దిన్ ప్రబోధించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా కరీంనగర్ శివారులోని సాలేహ్ నగర్‌లోని ఈద్గా వద్ద శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. మత సామరస్యం, శాంతి, సౌభాగ్యాలు సమాజంలో వెల్లివిరిసేలా ప్రజాజీవనం కొనసాగాలని ఆకాంక్షించారు. నిరాధారులు నిరుపేదలతో పాటు ఆకలిగొన్నవారి సాధక బాధకాలను నిర్మూలించిన రోజున ప్రభువు ప్రసన్ను డవుతాడని అన్నారు.
ఉపవాస దీక్షలో ఆచరించిన సత్య ధర్మాచరణలను ఏడాది పొడవునా అనుసరించాలన్నారు. సత్ప్రవర్తన కలిగి, తమ విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించి అల్లా కృపకు పాత్రులు కావాలన్నారు. మత పెద్ద ఇమామ్ హఫీజ్ మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ రంజాన్ ప్రత్యేకతను వివరించారు. నిరుపేదలను ఆదుకునే ఇస్లాం విశ్వాసులంటే అల్లాకు ఆనందం కలుగుతుందన్నారు. ధర్మ వర్తనులుగా అందరికీ ఆదర్శంగా నిలవాలని ఉద్బోధిం చారు. చింతకుంట ఈద్గా వద్ద ఇమామ్ మహమ్మద్ ఇంతియాదల్ హఫీజ్ ప్రార్థనలు జరిపించారు. మహమ్మద్ అలీయొద్దీన్ సందేశాన్ని అందించారు.