
సాక్షి, హైదరాబాద్: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం నుంచి దేవుడి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారని ఆ పార్టీ పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యవాదులు, వైఎస్సార్ సీపీ అభిమానలు, కార్యకర్తలు, నాయకులంతా వారి ఇష్ట దైవాలను ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
తొమ్మిదేళ్లుగా వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేని వారే ఇటువంటి హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టు అర్థమవుతోందని వైఎస్సార్ సీపీ విమర్శించింది. వైఎస్ జగన్‌పై దాడి జరిగిన వెంటనే సానుభూతి కోసం జరిగిదంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని చేయడం సిగ్గు చేటన్నారు. ఇందుకోసం టీడీపీ ముందుగానే ప్రణాళికల్ని సిద్ధం చేసుకుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లు.. ఈ ముగ్గురు ప్రధాన సూత్రధారులుగా జరుగుతున్న కుట్రలపై.. నిజాయితీపరులైన అధికారులతో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment