చివరి రోజున 18.10 లక్షల మంది పుణ్యస్నానాలు
అత్యధికంగా కొవ్వూరు డివిజన్‌లో 7.39 లక్షలు
తరలివచ్చిన ఒడిశా భక్తులు
15.50 లక్షల మంది పుష్కర యాత్రికులను తరలించిన ఆర్టీసీ
12 రోజుల్లో ఆర్టీసీ ఆదాయం రూ.4.40 కోట్లు
సాక్షి, కొవ్వూరు :గోదావరి పుష్కరాలకు భక్తులు రికార్డు స్థాయిలో పోటెత్తారు. పుష్కరోత్సవాల ముగింపు రోజైన శనివారం ఒడిశా నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. మొత్తం 12 రోజుల్లో జిల్లాలోని 97 ఘాట్లలో శనివారం సాయంత్రం 4 గంటల సమయానికి స్నానాలు ఆచరించిన వారి సంఖ్య కోటిన్నర దాటింది. శనివారం ఒక్కరోజే 18.10 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.
2003 పుష్కరాలతో పోలిస్తే ఈసారి సుమారు 35 లక్షల మంది యాత్రికులు అధికంగా వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయానికి సమయానికి అందిన సమాయారం ప్రకారం గడచిన 12 రోజుల్లో 1,52,50,779 మంది స్నానాలు ఆచరించారు. శనివారం జిల్లాలోని 97 ఘాట్లకు 18,10,487 మంది భక్తులు వచ్చినట్టు ప్రకటన వెలువడింది. కొవ్వూరు డివిజన్‌లో అత్యధికంగా 7,38,997 మంది, నరసాపురం డివిజన్‌లో 6,32,997 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 4,38,513 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలో సుమారు 55 వేల మంది ఒడిశా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు సమాచారం.
ఆర్టీసీకీ రూ4.40 కోట్ల ఆదాయం : పుష్కరాల నేపథ్యంలో జిల్లా ఆర్టీసీకి రూ.4.40 కోట్ల మేర ఆదాయం లభించింది. ప్రదానంగా పుష్కరాల 12 రోజులు జిల్లావ్యాప్తంగా 498 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయి. వీటిలో 400 బస్సులు జిల్లాలోని పుష్కర ఘాట్‌లకు, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించగా, కొవ్వూరులో 80 ఉచిత బస్సులు, నరసాపురంలో 10, సిద్ధాంతంలో 8 బస్సులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో 15.50 లక్షల మంది రాకపోకలు సాగించారు.
వైభవంగా గోదావరి పుష్కరాలు ముగింపు సంబరం
Published Sun, Jul 26 2015 1:02 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement