
సోమనాథ్ ఆలయంలో మోదీ పూజలు
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని బుధవారం సోమానాథ్ దేవాలయాన్ని సదర్శించారు
అహ్మదాబాద్: గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం సోమానాథ్ దేవాలయాన్ని సదర్శించారు. ఆలయంలో పరమశివుడికి జలభిషేకం చేసి.. పూజలు నిర్వహించారు.
సోమనాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ కేశుభాయ్ పటేల్, బీజేపీ అధ్యక్షడు అమిత్ షా ఈ కార్యక్రమంలో మోదీతో పాటు పాల్గొన్నారు. అనంతరం వీరు ఆలయ ట్రస్ట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. మంగళవారం రెండు రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన మోదీ.. దాహెజ్ స్పెషన్ ఎకనమిక్ జోన్‌లోని ఓఎన్‌జీసీ పెట్రో అడిషనల్స్ లిమిటెడ్(ఓపీఏఎల్)ను జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. త్రివేణి సంగమం వద్ద నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు.