వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి పూజలు | Ponguleti to pray during Mahashiva rathri festival | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి పూజలు

Published Wed, Feb 18 2015 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి పూజలు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి పూజలు

సాక్షి, ఖమ్మం: మహా శివరాత్రి సందర్భంగా వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలోని పలు శైవక్షేత్రాల్లో పూజలు నిర్వహించారు. తొలుత కూసుమంచిలోని గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  ఖమ్మం నగర శివారు ధంసలాపురంలోని శివాలయంలో అభిషేక పూజలు చేసి గ్రామంలోని గోశాలను సందర్శించారు.

వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం, కల్లూరు కనకగిరి శివాలయం, కాశ్మీర మహాదేవ క్షేత్రం, వీరభద్రస్వామి దేవాలయాలను సందర్శించి జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేశారు. పొంగులేటి రాఘవరెడ్డి- స్వరాజ్యం ట్రస్టు ఆధ్వర్యంలో కల్లూరు శివాలయంలో నిర్మించిన కోనేరును ఎంపీ సందర్శించారు. ఖమ్మం, కల్లూరులో బ్రహ్మకుమారిలు ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాల కార్యక్రమంలో ఎంపీ పూజలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement