
నశంకరి: పాఠశాలలకు విద్యార్థులు హిజబ్– కాషాయ కండువాలతో రావడం తీవ్ర వివాదాస్పదం కాగా, దక్షిణ కన్నడ, బాగల్‌కోటే జిల్లాల్లో రెండు పా ఠశాలల్లో ఒకవర్గం విద్యార్థులు పాఠశాలల్లో నమాజ్ చేయడం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. ఇలా అయితే మేము భజన చేస్తామని మరోవర్గం విద్యార్థులు హెచ్చరించారు. దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా అంకత్తడ్డ ప్రభుత్వ పాఠశాలలో 10 మందికి పైగా విద్యార్థులు శుక్రవారం నమాజ్ చేసినట్లు వీడియోలు వచ్చాయి. ఇకపై ఎవరైనా తరగతి గదుల్లో నమాజ్ చేసినట్లు కనబడితే తమ విద్యార్థులు భజన చేస్తారని పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్‌భండారీ హెచ్చరించారు. ఇళకల్ ప్రభుత్వ పా ఠశాలలోనూ ఇలాంటి దృశ్యమే పునరావృతమైంది.