
నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం బాగుండాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సయ్యద్ మునవర్ ఆధ్వర్యంలో స్థానిక బారాషాహిద్ దర్గాలో శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మునవర్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు హత్యాయత్నానికి కుట్రపన్నారని ఆరోపించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్ ఇంతియాజ్, సయ్యద్ షాకీర్‌బాబా, షేక్ హాజీ, ఎండీ రవూఫ్, ఎండీ రహీం, ఎస్‌కే జమీర్, ఎస్‌కే ఖయ్యూం, సయ్యద్ ఆలీమ్, షఫీ, ఎస్‌కే కాలేషా పాల్గొన్నారు.
వైఎస్ జగన్ ఆరోగ్యం కోసం పూజలు
ముత్తుకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడంతో గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని పలు మండలాల్లో వైఎస్ జగన్ ఆరోగ్యం కుదుటపడాలని ఆలయాల్లో పూజలు నిర్వహించి కొబ్బరి కాయలు కొట్టారు.ముత్తుకూరు మండలం మామిడిపూడి మహాలక్ష్మమ్మ ఆలయంలో వైఎస్ జగన్ ఆరోగ్యం కుదుటపడాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment