05.05PM
► కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్కులను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. కొప్పర్తిలో మెగా పారిశ్రామికపార్కు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇండస్ట్రీయల్ హబ్ నిర్మాణం కోసం రూ. 1585 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఈ హబ్‌లో ప్రస్తుతం 6 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఇప్పటికే రూ. 100 కోట్లు ఖర్చుచేశామని పేర్కొన్నారు. మరో 6 నెలల్లో 7,500 ఉద్యోగాలు కంపెనీల ద్వారా రానున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఎలక్ట్రానిక్ హబ్‌తో దాదాపు 75 వేల మంది యువతకు.. ఉద్యోగాలు లభిస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఇదే చోట పనిచేస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, ఈ మెగా పారిశ్రామిక హబ్‌లతో రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని సీఎం జగన్ అన్నారు.
04.38PM
► కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్కులను సీఎం జగన్ ప్రారంభించారు. కొప్పర్తి సెజ్‌లో ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేసిన ప్రభుత్వం. 6914 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్. 3164 ఎకరాల్లో వైఎస్‌ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ పార్క్. 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్. 104 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు అభివృద్ధి. ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్‌లో కంపెనీలు రూ. 1052 కోట్లు పెట్టుబడులను పెట్టనున్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్‌తో దాదాపు 14,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
03.25PM
► వైఎస్సార్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో సీకే దిన్నె(మ) కొప్పర్తికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్క్‌లను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అదే విధంగా వైఎస్సార్ జగనన్న ఇండస్ట్రీయల్ హబ్‌లను ప్రారంభించనున్నారు. వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానిఫాక్చరింగ్ క్లస్టర్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు.
03.05PM
►సెంచరీ ప్లైబోర్డ్స్ చైర్మన్ సజ్జన్ భజాంకా మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ ముందు చెన్నైలో ఏర్పాటు చేద్దామనుకున్నామన్నారు. సీఎం జగన్ బద్వేలులో ఏర్పాటు చేయమని కోరారు. అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇక్కడి పారిశ్రామిక విధానం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇచ్చిందన్నారు. రూ. 600 కోట్టు పెట్టుబడి పెడదామనుకున్నాం. ఇప్పుడు 3 దశల్లో రూ. 2600 కోట్లు వెచ్చించబోతున్నామని తెలిపారు.
02.50PM
► ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. బద్వేలులో సెంచనీ ప్లైబోర్డ్స్ ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. బద్వేలు లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఇలాంటి సంస్థ రావడం అభినందనీయమన్నారు. ఈ సంస్థకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందన్నారు. యూకలిప్టస్ రైతులకు ఈ ప్లాంట్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీంతో స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు.
02.40PM
► బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. మెస్సర్స్ సెంచరీ ప్లైబోర్డ్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.
02.30PM
► బద్వేలు చేరుకున్న సీఎం వైఎస్ జగన్
► బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
01:10PM
ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగసభలో సీంఎ జగన్ మాట్లాడుతూ.. 'వైఎస్సార్ కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుందన్నారు. ప్రొద్దుటూరులో 30 నెలల కాలంలో లబ్దిదారులకు రూ.326 కోట్లు నగదు బదిలీ చేశామని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం రూ. 200 కోట్లు మంజూరు చేశాం. 22 వేల 212 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాము. కోర్టు కేసులను పరిష్కరించుకుని ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశాం.
ప్రొద్దుటూరులో తాగునీటి పైప్‌లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం. అందుకుగానూ రూ.163 కోట్లు కేటాయించాం. 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన పైపు లైను ఏర్పాటు చేస్తున్నాం. పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53 కోట్లు మంజూరు చేశాం. నియోజకవర్గ నాయకుల అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నాం'’ అని సీఎం జగన్ అన్నారు.
(మరిన్నీ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
12:50PM
►జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపుసురేష్ మాట్లాడుతూ.. 'సంక్షేమరంగంలో ఏపీ ఎంతో ముందంజలో ఉంది. అమ్మఒడి వంటి గొప్ప కార్యక్రమం తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దే. రాష్ట్రంలో సంక్షేమాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు' అని అన్నారు.
12:40PM
►ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.515.90 కోట్లు కేటాయించిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
►వైఎస్ జగన్ ఆశీస్సులతో కౌన్సిలర్ నుంచి ఈ స్థాయికి ఎదిగానని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు.
12:30PM:
►ప్రొద్దుటూరులో 8 అబివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
12:20PM
►మూడు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరు చేరుకున్నారు.
►ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
►ప్రొద్దుటూరులోని 5 ప్రధాన మురికి కాల్వల పనులకు రూ.163 కోట్లు
►ప్రొద్దుటూరులో నూతన మంచినీటి పైప్‌లైన్‌కు రూ.119కోట్లు
►ప్రొద్దుటూరులో నూతన కూరగాయల మార్కెట్ కోసం రూ.50.90 కోట్లు
►పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53కోట్లు
►ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి మౌలిక వసతులకు రూ.20.50కోట్లు
►ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు రూ.4.5కోట్లు
►యోగివేమన ఇంజనీరింగ్ కాలేజ్ మౌలిక వసతుల కోసం రూ.66కోట్లు
►ఎస్‌సీఎన్‌ఆర్ డిగ్రీ కాలేజ్ నూతన గదుల నిర్మాణం కోసం రూ.24కోట్లతో పనులు
10:55AM
కృష్ణా జిల్లా
►తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి.
►కాసేపట్లో గన్నవరం నుండి కడప బయలుదేరనున్న సీఎం జగన్
09:25AM
సాక్షి, కడప : మూడు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. గురువారం నుంచి శనివారం వరకు సీఎం జిల్లాలో పర్యటించనున్నారు. 23వ తేదీ తొలిరోజు ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత బద్వేలుకు వెళ్లి అక్కడ నూతన ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గోపవరం వద్ద సెంచురీ ఫ్‌లై వుడ్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు.
ఆ తర్వాత కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తికి చేరుకుని అక్కడ పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. 24న రెండవరోజు ఇడుపులపాయ, పులివెందులలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈనెల 25న మూడవరోజు కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత కడప ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరం బయలుదేరి వెళతారు.
నేటి పర్యటన ఇలా..
►11.20 నుంచి 11.35 గంటల వరకు ప్రొద్దుటూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు.
►11.40 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
►1.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని గోపవరం ప్రాజెక్టు కాలనీ–1కు చేరుకుంటారు.
►1.50 నుంచి 1.55 గంటల వరకు బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు.
►1.55 నుంచి 2.25 గంటల వరకు మెజర్స్ సెంచురీ ఫ్లై పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు.
►2.55 గంటలకు సీకే దిన్నె మండలం కొప్పర్తికి చేరుకుంటారు. స్థానిక నాయకులతో మాట్లాడతారు.
►3.10 గంటలకు కొప్పర్తి గ్రామంలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చిని ప్రారంభిస్తారు.
►3.25 గంటలకు వైఎస్సార్ ఈఎంసీ ఇండస్ట్రియల్ ఎన్‌క్లేవ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం ప్రారంభిస్తారు.
►5.05 గంటలకు ఇడుపులపాయలోని హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ 5.20 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు.
►5.25 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment