పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17వ తేదీన పులివెందులలో పర్యటన దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం కడప ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. భాకరాపురంలో గల హెలీప్యాడ్‌ను, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన నేతలు, నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలో పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. అలాగే హెలీప్యాడ్ నుంచి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ వరకు ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన రానుండటంతో ఆయా ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాజు, బాలమద్దిలేటి, ఎస్‌ఐలు గోపినాథరెడ్డి, చిరంజీవి, హాజివల్లి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: (YSR: గుర్తుందా నాటి విజయ గాథ)
ప్రొద్దుటూరులో...
ప్రొద్దుటూరు క్రైం /ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న ప్రొద్దుటూరుకు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఏర్పాట్లను వేరు వేరుగా పరిశీలించారు. బైపాస్‌రోడ్డులోని శ్రీదేవి ఫంక్షన్‌హాల్‌లో జరిగే వివాహ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు.
►మంగళవారం ఎస్పీ, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు హెలిప్యాడ్ స్థలంతో పాటు కల్యాణమండపాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద, ఫంక్షన్‌హాల్‌లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ స్థానిక పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. మాజీ డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాలరెడ్డి పాల్గొన్నారు.
►కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ పనులను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు.
►ఈ కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కార్యదర్శి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment