
సాక్షి ప్రతినిధి కడప: ఆరు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం జిల్లాలో వేల కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23, 24, 25 తేదీలలో వీటికి శంకుస్థాపనలు చేయనున్నారు. పులివెందులలో ఇండోర్‌స్టేడియంతోపాటు ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. సీఎం తాజా పర్యటనలో వేయనున్న శిలాఫలకాలు జిల్లా ప్రగతిలో మైలురాళ్లుగా నిలవనున్నాయి. వివిధ అభివృద్ధి పనులలో పాలుపంచుకునేందుకు ఆయన మూడు రోజుల పర్యటన ఖరారైంది. పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలకు ఈనెల 23 నుంచి 25 వరకూ పలు శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటనపై జిల్లావ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏర్పాట్ల పూర్తిలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు.
సీఎం పర్యటన ఇలా..23వతేదీ(సోమవారం)
⇔ ఉదయం 8.50గంటలకు : కడప ఎయిర్‌పోర్టుకు సీఎం చేరిక
⇔ 9.20: కడపలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభం
⇔ 9.55: రిమ్స్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
⇔ 10.30: వైఎస్సార్ ఉచిత భోజన వసతి భవనం ప్రారంభం
⇔ 11.35: హెలికాప్టర్‌లో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె చేరిక
⇔ 11.50: ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు సీఎం శంకుస్థాపన, అనంతరం బహిరంగ సభ
⇔ మధ్యాహ్నం 2.10 గంటలకు: దువ్వూరు మండలం నేలటూరు హెలీప్యాడ్ వద్ద దిగుతారు.
⇔ 2.15గంటలకు: మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు సంబంధించిన నీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన,అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు.
⇔ సాయంత్రం 5 గంటలకు: సీఎం ఇడుపులపాయ చేరిక
24వ తేదీ (మంగళవారం)
⇔ ఉదయం 9.05గంటలకు: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌కు చేరిక.
⇔ 9.10గంటలకు: దివంగత ముఖ్యమంత్రి వైస్సార్‌కు నివాళి
⇔ 9.55: ఇడుపులపాయ చర్చిలో ప్రార్థనలు మధ్యాహ్నం
⇔ 2.00గంటలకు: రాయచోటి సభాస్థలికి ముఖ్యమంత్రి చేరుకుంటారు.
⇔ 2.15కు: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, అనంతరం బహిరంగసభ
⇔ సాయంత్రం 5 గంటలకు: పులివెందుల బాకరాపురంలోని నివాసానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళతారు.
25వ తేదీ (బుధవారం)
⇔ 9.20 గంటలకు: క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు
⇔ 11.15కు: పులివెందుల జూనియర్‌కళాశాల మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం
⇔ మధ్యాహ్నం 2.30కు: బాకరాపురం నుంచి హెలికాప్టర్ ద్వారా కడప ఎయిర్‌పోర్ట్‌కు...
⇔ 3గంటలకు: కడప ఎయిర్‌పోర్ట్‌నుంచి గన్నవరం బయలుదేరుతారు.