ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పిఠాపురంలో పర్యటించనున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. మంగళవారం పిఠాపురంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాలను జిల్లా కలెక్టరు అరుణ్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడుతూ ఇటీవల మావోయిస్టుల భారీ ఎ¯ŒSకౌంటర్ తరువాత సీఎంకు బందోబస్తు పెంచిన నేపథ్యంలో నిఘా
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
Jan 3 2017 10:50 PM | Updated on Sep 5 2017 12:19 AM
పిఠాపురం :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పిఠాపురంలో పర్యటించనున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. మంగళవారం పిఠాపురంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాలను జిల్లా కలెక్టరు అరుణ్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడుతూ ఇటీవల మావోయిస్టుల భారీ ఎ¯ŒSకౌంటర్ తరువాత సీఎంకు బందోబస్తు పెంచిన నేపథ్యంలో నిఘా పెంచామన్నారు. బుధవారం నుంచి ఈ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకుంటామన్నారు. సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం జగ్గయ్య చెరువు సమీపంలో ఏర్పాటు చేస్తున్న సీఎం బహిరంగ సభ , వైజంక్ష¯ŒSలో నిర్మిస్తున్న హెలీపేడ్‌ను అధికారులు పరిశీలించారు. వీరి వెంట ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎ¯ŒS వర్మ, పలువురు అధికారులు ఉన్నారు.
ఆర్డీఓ కార్యాలయానికి మెరుగులు
రామచంద్రపురం: సీఎం చంద్రబాబు గురువారం పట్టణానికి రానుండడంతో అధికార యంత్రాంగం అంతా పట్టణంలోనే ఉంటూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నది. పట్టణంలోని బైపాస్ రోడ్డు నుంచి నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం వరకు రహదారికి ఇరువైపులా తుప్పలు తొలగించి రహదారి వేస్తున్నారు. బైపాస్ రోడ్డు సమీపంలో హెలిపాడ్‌ను నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చి నూతనంగా నిర్మించిన ఆర్డీవో కార్యాలయ శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించనున్నారు. అనంతరం పక్కనే గల వీఎస్‌ఎం కళాశాల మైదానంలో నిర్వహించే జన్మభూమి మావూరు సభలో పాల్గొనున్నారు. ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ప్రత్యేకంగా పూల తోటను ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement