ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్‌ | CM Jagan Reached Idupulapaya For 3 Days Tour In YSR District | Sakshi
Sakshi News home page

ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్‌

Published Wed, Dec 23 2020 5:36 PM | Last Updated on Wed, Dec 23 2020 8:30 PM

CM Jagan Reached Idupulapaya For 3 Days Tour In YSR District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలీకాప్టర్‌ ద్వారా ఇడుపులపాయకు వెళ్లారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, రఘురామి రెడ్డి, మేడా మలికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ జఖియా ఖనం, కత్తి నరసింహ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్, కర్నూలు రేంజ్ డిఐజి వెంకట్రామి రెడ్డి, స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. నేటి రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు. 
(చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌ కడప పర్యటన షెడ్యూల్)

అభివృద్ధి పనులకు శ్రీకారం
వైఎస్సార్‌ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ వివరాలు...
► రూ.3115 కోట్లతో గండికోట-సీబీఆర్, గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీంకు శంకుస్థాపన
► రూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్‌కు శంకుస్థాపన
► రూ.34 కోట్లతో పులివెందులలో నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన
► రూ.36 కోట్లతో తొండూరు బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన
► రూ.46 కోట్లతో పాడా పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన
► రూ.184 కోట్లతో మల్టీ కెనెక్టివిటీ బిటి రోడ్స్‌కు శంకుస్థాపన
► రూ.14.5 కోట్లతో గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
► రూ.180 కోట్లతో పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement