సాక్షి, వేంపల్లె (వైఎస్సార్ కడప): సెప్టెంబర్ 1, 2 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, గెస్ట్ హౌస్, నెమళ్ల పార్కు తదితర ప్రాంతాలను ఆయన జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, పులివెందుల ఆర్డీఓ వెంకటేశులు, జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్ణయించిన మేరకే అధికారులను, ప్రజాప్రతినిధులను అనుమతించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు. ఇంకా అధికారికంగా ముఖ్యమంత్రి షెడ్యూల్ వివరాలు రావాల్సి ఉందన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండకుండా చురుగ్గా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్లు్యఎస్ ఈఈ సిద్ధారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment