సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 17న విశాఖ జిల్లా పర్యటనకు సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా బుధవారం ఆయన పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాతో కలిసి విమానాశ్రయం, ఎన్‌ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్‌డీఏ పార్కు, ఏయూ కన్వెన్షన్ సెంటర్, వైజాగ్ కన్వెన్షన్, పీఎం పాలెం ప్రాంతాలను పరిశీలించారు.
ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రజాప్రతినిధుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్‌డీఏ పార్కు వద్ద ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ, వీఎంఆర్‌డీఏ కమిషనర్ వెంకటరమణారెడ్డి, ఆర్‌డీవో పెంచల కిశోర్ పాల్గొన్నారు.
సీఎం జగన్ విశాఖ పర్యటన వివరాలు..
►రేపు విశాఖపట్నంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
►విశాఖ నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవం
►సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ బయలుదేరనున్న సీఎం
►సాయంత్రం 5.20 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్న సీఎం
►సాయంత్రం 6.00 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్‌కు హాజరవనున్న ముఖ్యమంత్రి
►సాయంత్రం 6.20 గంటలకు ఉడా పార్క్ వద్ద ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో 4 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్న సీఎం
►సాయంత్రం 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం
►అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగు పయనం
చదవండి: (సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ భేటీ.. పెట్టుబడులపై విస్తృత చర్చ)
Comments
Please login to add a commentAdd a comment