‘సాఫ్ట్‌ స్కిల్స్‌’ సర్టిఫికెట్లు అందజేసిన సీఎం జగన్‌ | CM YS Jagan Visakhapatnam Visit Live Updates | Sakshi
Sakshi News home page

‘సాఫ్ట్‌ స్కిల్స్‌’ సర్టిఫికెట్లు అందజేసిన సీఎం జగన్‌

Published Fri, Aug 26 2022 3:31 AM | Last Updated on Fri, Aug 26 2022 5:47 PM

CM YS Jagan Visakhapatnam Visit Live Updates - Sakshi

CM Jagan Vizag Visit.. అప్‌డేట్స్‌

మైక్రోసాఫ్ట్‌ ద్వారా సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన సీఎం వైఎస్‌ జగన్‌

ఏయూ కాన్వోకేషన్‌ హాల్‌లో సీఎం జగన్‌ స్పీచ్‌

సాఫ్ట్‌ స్కిల్స్‌లో కొత్త అధ్యాయానికి తెరతీశాం

సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు

సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ కోసం రూ. 32 కోట్లు ఖర్చు చేశాం

రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ

విద్యారంగంలో ఇవాళ ఓ గర్వకారణం

మైక్రోసాఫ్ట్‌ ద్వారా దేశంలోనే తొలిసారిగా సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ

1.62 లక్షల మందికి సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ

40 విభాగాల కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ

శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు

విద్యారంగంలో ఇప్పటికే అనేక కీలక మార్పులు తీసుకొచ్చాం

నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, ఇంగ్లిష్‌ మీడియా వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో సీఎం జగన్‌ ప్రసంగం

ఏపీలో ప్లాసిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం

► ఫ్లెక్సీలు పెట్టాలంటే గుడ్డతో తయారుచేసినవే పెట్టాలి

ఈరోజు విశాఖలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగింది

► ఇవాళ 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారు

పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండు వైపులు

► పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికపురోగతి సాధించాలి

ఏపీ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది

► సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్‌ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ

► సీఎం జగన్‌ సమక్షంలో పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ఎంవోయూ

► ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేసి షూస్‌, గాడ్జెట్స్‌ వంటివి తయారుచేస్తోంది

విశాఖ చేరుకున్న సీఎం జగన్‌.. ఘన స్వాగతం

సీఎం జగన్‌ విశాఖ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను.. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్‌ డా.మల్లికార్జున, సీపీ శ్రీకాంత్‌ గురువారం పరిశీలించారు.

విశాఖపట్నం పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు. 


షెడ్యూల్‌ 

  • ఉదయం గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి సీఎం జగన్‌ చేరుకుంటారు. 
  • అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్, బీచ్‌ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్‌ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శిస్తారు. 
  • పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేలా శుక్రవారం బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాగరతీరాన్ని పరిశుభ్రం చేయనుంది. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొత్తం 20 వేల మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 
  • అనంతరం సీఎం జగన్‌ సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బీచ్‌ పరిరక్షణపై ఎంవోయూ కుదుర్చుకుంటారు.
  • సిరిపురంలోని ఏయూ కన్వకేషన్‌ హాల్‌కు చేరుకుని.. మైక్రోసాఫ్ట్‌ సంస్థ అందించిన డిప్లొమా కోర్సును పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థుల్లో కొందరికి సీఎం జగన్‌ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. అక్కడి విద్యార్థులను ఉద్దేశించి..  సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. 
  • ఈ కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి ఆయన తిరుగుపయనం అవుతారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement