parley for the oceans
-
విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాన్ని 2027 నాటికి ప్లాస్టిక్ రహితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం సీఎం కార్యక్రమం అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో దశలవారీగా ప్లాస్టిక్ నిషేధించడానికి సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారన్నారు. శుక్రవారం భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు 22 వేలమందికిపైగా బీచ్‌క్లీనింగ్ చేసినట్లు తెలిపారు. త్వరలో 2.5 లక్షలమందితో బీచ్ క్లీన్‌చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పుతామని వారు పేర్కొన్నారు. 20 వేలమందికి ఉపాధి కల్పన పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సీఈవో సెరిల్ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.16 వేల జీతంతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మొదటిదశలో 1,100 మెట్రిక్ టన్నులు, రెండోదశలో 2,200 మెట్రిక్ టన్నులు, మూడోదశలో 3,300 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి సన్‌గ్లాసెస్, షూస్, బ్యాగ్స్, టీ–షర్టులు తయారుచేస్తామని వివరించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ మాజీ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్, జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్ శ్రీసత్యత్రిపాఠి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. మహాయజ్ఞంలా మెగా బీచ్‌క్లీనింగ్ విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచే భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు 28 కిలోమీటర్ల మేర రికార్డు స్థాయిలో మెగా బీచ్‌క్లీనింగ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, పార్లే సంస్థ సంయుక్తంగా 40 ప్రాంతాల్లో దాదాపు 22 వేలమందికిపైగా పాల్గొన్న ఈ కార్యక్రమం మహాయజ్ఞంలా సాగింది. 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ప్రత్యేక చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, జీవిఎంసీ కమిషనర్ లక్ష్మీశ, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘సాఫ్ట్ స్కిల్స్’ సర్టిఫికెట్లు అందజేసిన సీఎం జగన్
CM Jagan Vizag Visit.. అప్డేట్స్ ►మైక్రోసాఫ్ట్ ద్వారా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన సీఎం వైఎస్ జగన్ ఏయూ కాన్వోకేషన్ హాల్లో సీఎం జగన్ స్పీచ్ ►సాఫ్ట్ స్కిల్స్‌లో కొత్త అధ్యాయానికి తెరతీశాం ►సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు ►సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కోసం రూ. 32 కోట్లు ఖర్చు చేశాం ►రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ ►విద్యారంగంలో ఇవాళ ఓ గర్వకారణం ►మైక్రోసాఫ్ట్ ద్వారా దేశంలోనే తొలిసారిగా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ►1.62 లక్షల మందికి సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ►40 విభాగాల కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ►శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు ►విద్యారంగంలో ఇప్పటికే అనేక కీలక మార్పులు తీసుకొచ్చాం ►నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియా వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ►ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సీఎం జగన్ ప్రసంగం ►ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలపై నిషేధం ► ఫ్లెక్సీలు పెట్టాలంటే గుడ్డతో తయారుచేసినవే పెట్టాలి ►ఈరోజు విశాఖలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది ► ఇవాళ 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారు ►పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండు వైపులు ► పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికపురోగతి సాధించాలి ►ఏపీ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది ► సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ ► సీఎం జగన్ సమక్షంలో పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఎంవోయూ ► ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి షూస్, గాడ్జెట్స్ వంటివి తయారుచేస్తోంది ► విశాఖ చేరుకున్న సీఎం జగన్.. ఘన స్వాగతం ► సీఎం జగన్ విశాఖ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను.. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ డా.మల్లికార్జున, సీపీ శ్రీకాంత్ గురువారం పరిశీలించారు. ► విశాఖపట్నం పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు. షెడ్యూల్ ఉదయం గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్ ది ఓషన్’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, బీచ్ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శిస్తారు. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ గిన్నిస్ రికార్డు నెలకొల్పేలా శుక్రవారం బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాగరతీరాన్ని పరిశుభ్రం చేయనుంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొత్తం 20 వేల మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బీచ్ పరిరక్షణపై ఎంవోయూ కుదుర్చుకుంటారు. సిరిపురంలోని ఏయూ కన్వకేషన్ హాల్‌కు చేరుకుని.. మైక్రోసాఫ్ట్ సంస్థ అందించిన డిప్లొమా కోర్సును పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థుల్లో కొందరికి సీఎం జగన్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. అక్కడి విద్యార్థులను ఉద్దేశించి.. సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి ఆయన తిరుగుపయనం అవుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)