యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బుధవారం సీఎం రానున్న నేపథ్యంలో అధికారులు కొండపై పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఈఓ గీతారెడ్డి మంగళవారం కొండపై అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ ఆలయ పరిసరాలను పరీశీలిస్తారని, ఎక్కడ ఎటువంటి అపరిశుభ్ర వాతావరణం కనిపించకూడదని ఆదేశించారు. మంచినీటి ఏర్పాట్లు, సీఎం వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యుత్ నిరంతరాయంగా ఉండాలని ఆమె సూచించారు. సీఎం కారు దిగిన ప్రాంతం నుంచి ఆండాల్ నిలయం వరకు ఎక్కడ, ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. స్థానిక సీఐ శంకర్‌గౌడ్, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డిలు ఆలయ పరిసరాలను పరిశీలించారు. ప్రత్యేక పోలీసు బలగాలను దింపారు. సమావేశంలో ఏఈఓలు చంద్రశేఖర్, కోల అంజనేయులు, దోర్భల భాస్కర శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.