బాబు వచ్చారు...పిల్లలకు సెలవిచ్చారు | chandrababu naidu tour in west godavari district, Holiday declared for private schools | Sakshi
Sakshi News home page

బాబు వచ్చారు...పిల్లలకు సెలవిచ్చారు

Published Thu, Jul 17 2014 10:58 AM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM

బాబు వచ్చారు...పిల్లలకు సెలవిచ్చారు - Sakshi

బాబు వచ్చారు...పిల్లలకు సెలవిచ్చారు

ఏలూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులకు సెలవు వచ్చింది.  జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలకు గురువారం ఏకంగా సెలవు ప్రకటించేశారు. రవాణా శాఖ అధికారుల ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న స్కూల్ బస్సులన్నీ సీఎం సభకు పంపించడంతో గురువారం సెలవు ఇచ్చి ఆదివారం నిర్వహిస్తున్నట్టు  ఓ విద్యాసంస్థ యాజమాన్యం తల్లిదండ్రులకు వర్తమానం పంపారు.

ముఖ్యమంత్రి సభకు పాఠశాల బస్సులను పంపి పిల్లల చదువులతో చెలగాటం ఏమిటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాగా రవాణాశాఖ అధికారులు చెప్పిన తరువాత బస్సులు పంపకపోతే ఏ ఇబ్బందులు తలెత్తుతాయోనన్న భయంతో విధిలేని పరిస్థితుల్లో బస్సులు పంపినట్టు ఓ విద్యాసంస్థ ప్రతినిధి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement