
చిత్తూరులోని తేనెబండ వద్ద కాపు భవన్ శంకుస్థాపన స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీరాజశేఖర్ బాబు
చిత్తూరు కలెక్టరేట్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను కలెక్టర్ ప్రద్యుమ్న గురువారం ఒక ప్రకటనలో వెల్ల్లడించారు. సీఎం ఉదయం 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.15 గంటలకు తిరుపతిలోని ముత్యాలరెడ్డి పల్లెలో అన్న క్యాంటిన్‌ను ప్రారంభిస్తారు. అలిపిరి బైపాస్ రోడ్డు సమీపంలో టీటీడీ, టాటా ట్రస్టు సంయుక్తంగా నిర్మిస్తున్న శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్‌కు 10–45 గంటలకు భూమిపూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో టాటా గ్రూప్ కంపెనీల చైర్మన్ రతన్ ఎన్.టాటా కూడా పాల్గొంటారు. ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సీఎం సందర్శిస్తారు.
11.05 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు పుదిపట్ల ఎస్వీ జూ పార్కు సమీపంలోని బ్రదర్స్ రెసిడెన్సీకి చేరుకుంటారు. ఎస్వీ అగ్రికల్చర్ కాలేజి మైదానం నుంచి హెలికా ప్టర్‌లో బయలుదేరి 1.45 గంటలకు చిత్తూరులోని అపోలో మెడికల్ కాలేజీ వద్దకు వస్తారు. మెడికల్ కాలేజీలోని గెస్ట్çహౌస్‌లో 2.20 గంటల వరకు వి శ్రాంతి తీసుకుని 2.25 గంటలకు అపోలో నాలెడ్జి సిటీని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ సభలో చం ద్రబాబు ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తేనెబండ వద్ద కాపు భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 4.40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 5.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని విజయవాడ వెళ్లనున్నారు.
సీఎం పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుపతి, చిత్తూరులో అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ప్రద్యుమ్న ఏర్పాట్లను పరిశీలించారు. తేనెబండ వద్ద భూమి పూజ స్థలాన్ని ఎస్పీ రాజశేఖర్‌బాబుతో కలిసి ఆయన పరిశీలించారు. కాన్వాయ్ ట్రయల్ రన్‌ను వీరిద్దరూ పర్యవేక్షించారు.