సీఎం పర్యటన వాయిదా | postponed the CM's tour | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన వాయిదా

Published Wed, Oct 30 2013 3:24 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

postponed the CM's tour

సాక్షి, నల్లగొండ : సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా పర్యటన వాయిదా పడింది. తుపాను తాకిడికి అతలాకుతలమైన జిల్లా రైతాంగాన్ని పరామర్శించేందుకు, పంట నష్టం తెలుసుకునేందుకు బుధవారం జిల్లాకు సీఎం రానున్నారని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం హడావిడిగా ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయింది. పలుచోట్ల స్థల పరిశీలన కూడా చేశారు. వర్షం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించి శాఖలవారీగా అధికారులు  సమాచారం సేకరించి దగ్గర పెట్టుకున్నారు. చివరకు పర్యటన వాయిదా పండిందని సీఎం పేషీ నుంచి సమాచారం అందింది. సీఎం రాకపోవడానికి స్పష్టమైన కారణాలేంటన్నవి అధికారుల వద్ద కూడా లేవు. అయితే సీఎంకు వైజాగ్ పర్యటన ఖరారు కావడంతో రాలేకపోతున్నారని కొందరు అంటున్నా.. అసలు దీని వెనుక రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయని ఇంకొందరు భావిస్తున్నారు.
 సీఎం వస్తున్నారని...
 నిడమనూరు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం నిడమనూరుకు వస్తున్నారని కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సమావేశ స్థలాలను ఎంపిక చేశారు. వేంపాడు స్టేజీ వద్ద హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.  ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జోనల్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రసాదరావు, జిల్లా పశువర్ధక శాఖ సహాయసంచాలకులు ఖదీర్, ఐబీ ఈఈ హమీద్‌ఖాన్, డీఈ సురేందర్‌రెడ్డి, ఏఈలు చెన్నకేశవరెడ్డి, హలీం, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, నిడమనూరు మార్కెట్‌కమిటీ చైర్మన్ రాయలింగయ్య, మాజీ ఎంపీపీ హన్మంతరావు, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో ప్రతాప్‌నాయక్, నాగభూషణ్‌రావు, సీఐ ఆనందరెడ్డి, లక్ష్మారెడ్డి, ఉన్నం చినవీరయ్య, నల్లబోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
 మిర్యాలగూడలో పర్యటించాలని సీఎంను కోరిన జూలకంటి
 మిర్యాలగూడ : ఇటీవల కురిసిన వర్షాలకు అపార నష్టం నెలకొన్నందున బాధితులను పరామర్శించడానికి మిర్యాలగూడకు రావాలని ముఖ్యమంత్రి కిరణ్‌ను ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం ఎమ్మెల్యే సీఎం కిరణ్‌కుఫోన్ చేసిన జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి కూడా రావాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బుధవారం జిల్లాలో పర్యటించడం లేదని, షెడ్యూల్ మారిందని, మరోసారి జిల్లాకు వచ్చిన సమయంలో మిర్యాలగూడకు వస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు రంగారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మరోసారి జిల్లాకు వచ్చినపుడు మిర్యాలగూడకు తప్పకుండా రావాలని కోరినట్లు జూలకంటి రంగారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement