త్వరలో జిల్లాకు సీఎం కేసీఆర్ | kcr visits district soon | Sakshi
Sakshi News home page

త్వరలో జిల్లాకు సీఎం కేసీఆర్

Published Fri, Jul 1 2016 3:29 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

త్వరలో జిల్లాకు సీఎం కేసీఆర్ - Sakshi

త్వరలో జిల్లాకు సీఎం కేసీఆర్

ఈ నెల 11 లేదా12న వచ్చే అవకాశం
హరితహారం ప్రారంభించనున్న కేసీఆర్

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెలలో జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 11 లేదా 12న సీఎం పర్యటన  ఖరారైనట్లు తెలిసింది. 11న వచ్చినా.. 12న ఖరారైనా రెండు రోజులు జిల్లాలో గడిపే అవకాశం ఉన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈ నెల 11 నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో పర్యటించనున్న ఆయన హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.  జిల్లాల పునర్విభజనపై బుధవారం హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్‌ను జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులుకోరినట్లు కూడా తెలిసింది.

తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ప్రజాప్రతినిధుల కోరిక మేరకు సీఎం జిల్లాకు రానున్నారు. గతేడాది కూడా జూలై 5, 6 తేదీలలో రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించిన కేసీఆర్ హరితహారాన్ని ప్రారంభించి, జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సారి కూడా ఆయన జిల్లాలో హరితహారం ప్రారంభించేందుకు రానున్నారని తెలిసింది. ఈ మేరకు హరితహారం కింద జిల్లాలో చేపట్టే కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు గురువారం ఆరా తీసినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో సీఎం కె. చంద్రశేఖర్‌రావు పర్యటనకు సంబంధించిన పక్కా షెడ్యూల్ ఖరారు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement