
సోమిరెడ్డికి అస్వస్థత
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
నెల్లూరు: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
సీఎంతో పాటు పర్యటనలో పాల్గొన్న సోమిరెడ్డి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని తెలిపారు. సోమిరెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.