రాష్ట్రానికి తలమానికంగా గజ్వేల్‌ మార్కెట్‌ | cm kcr tour in gajwel veg and nonveg market today | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి తలమానికంగా గజ్వేల్‌ మార్కెట్‌

Published Sat, Mar 4 2017 1:49 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

గజ్వేల్‌లో కూరగాయలు, మాంసాహార మార్కెట్‌ పనుల గురించి  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరిస్తున్న అధికారులు - Sakshi

గజ్వేల్‌లో కూరగాయలు, మాంసాహార మార్కెట్‌ పనుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరిస్తున్న అధికారులు

కూరగాయలు, మాంసాహార మార్కెట్‌ను అద్భుతంగా నిర్మించండి: కేసీఆర్‌
నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దాలి
సొంత నియోజకవర్గంలో సీఎం పర్యటన...
అభివృద్ధి పనులపై సమీక్ష


గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్మించ తలపెట్టిన వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ రాష్ట్రానికే తలమానికంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గజ్వేల్‌ను రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దేం దుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. శుక్రవారం తన సొంత నియో జకవర్గం గజ్వేల్‌లో సీఎం పర్యటించారు. బస్సులో పట్టణమంతా కలియదిరిగారు. ఆడిటోరియం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం, ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్, బాలిక లు, బాలుర ఎడ్యుకేషన్‌ హబ్‌ల నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం ప్రతిపాదించిన పాత ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలాన్ని సందర్శించారు. మార్కెట్‌ మ్యాపును పరిశీలించి మార్పుచేర్పులపై అధి కారులతో చర్చించారు.

ఇక్కడ 4.13 ఎకరాలు అందుబాటులో ఉందని, ఇందులో వెజ్, నాన్‌వెజ్, పండ్లు, పూల మార్కెట్లు నిర్మించను న్నామని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, జేసీ హన్మం తరావు,మార్కెటింగ్‌ శాఖ డీఈ శ్రీనివాసరావు సీఎంకు తెలిపారు. 304 కూరగాయలు, 58 నాన్‌ వెజ్, మరో 40 పండ్లు, పూల దుకాణాలు పూర్తి ఏసీ సౌకర్యంతో ఉంటాయన్నారు. 8/8 చదరపు అడుగుల్లో దుకాణాలు నిర్మిస్తామని, మార్కెట్‌లో అంతర్గతంగా తొమ్మిది మీటర్ల వెడల్పుతో కిలోమీటరు పొడవు గల ఆరు రోడ్లను నిర్మిస్తామన్నారు.

మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ప్రధాన రహదారి గుండా మూడు మార్గాలు, ప్రాథమిక పాఠశాల నుంచి రెండు మార్గాలను ప్రతిపాదించినట్లు తెలపగా... అవసరమైతే బస్టాండ్‌ ప్రాంగణం నుంచి కూడా మార్గం తీసుకునే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సీఎం అధికా రులకు సూచించారు. దీనిద్వారా మార్కెట్‌ లోకి వచ్చే మార్గాల సంఖ్య ఆరుకు చేరుతుం దన్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలకు ట్రాఫిక్‌ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్ల డిజైన్‌ ఉండాలని పేర్కొన్నారు.

ఎన్ని నిధులైనా ఇస్తాం...
మార్కెట్‌ నిర్మాణానికి సుమారు రూ.5 కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఎన్ని నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని, మార్కెట్‌ నిర్మాణం మాత్రం రాష్ట్రానికే తలమానికంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అనంతరం బస్సులో నుంచే ఆడిటోరియం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్, బాలికల ఎడ్యుకేషన్‌ హబ్, సంగాపూర్‌ జీఎంఆర్‌ ప్రభుత్వ గురుకుల పాలిటెక్నిక్‌ ప్రాంగణంలో నిర్మిస్తున్న బాలుర ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. వీటితో పాటు పట్టణంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ మోడల్‌ కాలనీ, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, రోడ్ల విస్తరణ తదితర అంశాలపై అధికారులతో ఆరా తీశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement