ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మద్దతుగా నిలిచారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ అవలంభించిన విధానం సరైనదేనని అన్నారు. భారత్ తన సార్వభౌమాధికారాన్ని, ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిందని కొనియాడారు. అదే క్రమంలో ప్రపంచ శాంతికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జీ-20 సమావేశాలకు ఆహ్వానాలు అందిన వారిలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు. ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు సమాధానమిచ్చారు.
విదేశాంగ విధానం దేశీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మన్మోహన్ సింగ్ తెలిపారు. దౌత్య సంబంధాలను రాజకీయాల కోసం వాడుకోవడంలో సమన్వయం పాటించాలని కోరారు. జీ20కి ఇండియా ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ పాత్రకు మద్ధతుగా నిలిచారు. సరైన పనే చేసిందని అన్నారు.
Former PMs Manmohan Singh and HD Deve Gowda invited to G20 dinner#G20India2023 #G20SummitDelhi #G20 #ManmohanSingh #HDDeveGowda #G20Summit pic.twitter.com/7Dbe7XV3o4
— Mr. Nitish (@Nitishvkma) September 8, 2023
జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాకపోవడం, చైనా-భారత్ సంబంధాలపై ఆయన స్పందించారు. దేశ సార్యభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం కావాల్సినన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. క్లిష్టమైన దౌత్య వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ప్రధానమంత్రికి సలహా ఇవ్వడం సరికాదని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరమని అన్నారు.
స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా దేశంలో ఉన్న సవాళ్లపై ప్రశ్నించినప్పుడు.. తాను ఆశావాదంతో ఉన్నట్లు చెప్పారు. దేశంలో అభివృద్ధికి ఆశావాద స్వభావమే నాంది అని అన్నారు. చంద్రయాన్ 3 విజయంపై కూడా ఆయన స్పందించారు. ఇస్రో సాధించిన విజయంపై ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచంలో భారత్ మరింత ముందుకు వెళుతోందని అన్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు..
Comments
Please login to add a commentAdd a comment