Backs
-
కేంద్రానికి మద్దతు నిలిచిన మన్మోహన్ సింగ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మద్దతుగా నిలిచారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ అవలంభించిన విధానం సరైనదేనని అన్నారు. భారత్ తన సార్వభౌమాధికారాన్ని, ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిందని కొనియాడారు. అదే క్రమంలో ప్రపంచ శాంతికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జీ-20 సమావేశాలకు ఆహ్వానాలు అందిన వారిలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు. ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు సమాధానమిచ్చారు. విదేశాంగ విధానం దేశీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మన్మోహన్ సింగ్ తెలిపారు. దౌత్య సంబంధాలను రాజకీయాల కోసం వాడుకోవడంలో సమన్వయం పాటించాలని కోరారు. జీ20కి ఇండియా ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ పాత్రకు మద్ధతుగా నిలిచారు. సరైన పనే చేసిందని అన్నారు. Former PMs Manmohan Singh and HD Deve Gowda invited to G20 dinner#G20India2023 #G20SummitDelhi #G20 #ManmohanSingh #HDDeveGowda #G20Summit pic.twitter.com/7Dbe7XV3o4 — Mr. Nitish (@Nitishvkma) September 8, 2023 జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాకపోవడం, చైనా-భారత్ సంబంధాలపై ఆయన స్పందించారు. దేశ సార్యభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం కావాల్సినన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. క్లిష్టమైన దౌత్య వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ప్రధానమంత్రికి సలహా ఇవ్వడం సరికాదని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరమని అన్నారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా దేశంలో ఉన్న సవాళ్లపై ప్రశ్నించినప్పుడు.. తాను ఆశావాదంతో ఉన్నట్లు చెప్పారు. దేశంలో అభివృద్ధికి ఆశావాద స్వభావమే నాంది అని అన్నారు. చంద్రయాన్ 3 విజయంపై కూడా ఆయన స్పందించారు. ఇస్రో సాధించిన విజయంపై ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచంలో భారత్ మరింత ముందుకు వెళుతోందని అన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు.. -
నోట్ల రద్దు: నెటిజనుల వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దనోట్ల ( 500, 1000 రూపాయల) రద్దు ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తయింది. నల్లధాన్ని రూపుమాపేందుకు, అవినీతిపై అరికట్టేందుకు అంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్ల చట్టబద్ధమైన మారక విలువను రద్దు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ డిమానిటైజేషన్‌ను సమర్ధించుకుంటూ ట్విటర్లో ట్వీట్ల పరంపర సాగించారు. అక్రమంగా నిలవ చేసిన డబ్బును నోట్ల రద్దుతో బ్యాంకులకు వచ్చే విధంగా చేశామని, పన్ను వసూళ్లు బాగా పెరిగాయంటూ తమని తాము ప్రశంసించుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల పరపంపరలో నోట్ల రద్దు కీలకమైందని, ఈ చర్య ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడంలో పెద్ద ప్రభావాన్ని చూపిందని జైట్లీ పేర్కొన్నారు. మే, 2014 లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినపుడు ఆదాయపన్ను రాబడి మొత్తం 3.8 కోట్ల రూపాయలుంటే.. తమ ప్రభుత్వం ఆధీనంలో మొదటి నాలుగేళ్లలో 6.86 కోట్ల రూపాయలకు పెరిగిందని ట్వీట్ చేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారాన్నీ తగ్గించాం..కానీ పన్ను వసూళ్లు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. దేశ పౌరులకు మంచి జీవనవిధానాన్ని అందించాం. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు, ఆదాయాన్ని సమకూర్చామంటూ చెప్పుకొచ్చారు. దీంతోపాటు ఒక వివరణాత్మక వ్యాసాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం విశేషం. మరోవైపు పెద్దనోట్ల రద్దు కష్టాలు ఇంకా తమను పీడిస్తున్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెటిజనులు కూడా డీమానిటైజేషన్పై వ్యంగాస్త్రాలతో విరుచుకు పడుతున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నోట్లరద్దు చేపట్టి రెండేళ్లు గడిచిన సందర్భంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. డిమానిటైజేషన్ చర్యను 'ఆర్థిక దుష్ప్రభావం' గా పేర్కొంది. ఎన్డీఐ ప్రభుత్వం అనాలోచిత చర్య కారణంగా, చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, 120 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడింది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీని దేశం ఎప్పటికీ క్షమించదని దుయ్యబట్టింది. ఆర్థిక రంగంలో అనాలోచిత చర్యలు ఎకానమీపై ఎంతటి దుష్ర్పభావాన్ని పడవేస్తాయో, జాతికి దీర్ఘకాలికంగా ఎంతటి నష్టమో ఈ రోజు (నోట్ల రద్దు రెండేళ్లయిన సందర్భంగా) స్పష్టమవుతోందని మాజీ ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి కూడా అయిన మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆలోచించి, అతి జాగ్రత్తగా ఆర్థిక విధానానాలను చేపట్టాల్సి అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సంప్రదాయక స్వల్పకాలిక విధాన నిర్ణయాలకు స్వస్తి పలికి దేశ ఆర్థికస్థిరత్వానికి మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు. -
ఎన్ఎస్ జీ సభ్యత్వానికి మెక్సికో మద్దతు
మెక్సికో: అమెరికా, స్విట్జర్లాండ్ ల తర్వాత కీలకమైన న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత్ స్థానం కోసం మెక్సికో మద్దతు తెలిపింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సంప్రదింపులు జరిపిన ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో తమ మద్దతును ప్రకటించారు. మోదీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఎన్రిక్ కు ధన్యవాదాలు తెలిపిన మోదీ మెక్సికో భారత్ కు ఎనర్జీ సెక్యురిటీలో కీలకభాగస్వామిగా పేర్కొన్నారు. ఐదు దేశాల పర్యటన కోసం వెళ్లిన మోదీ చివరగా మెక్సికోలో ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమై చర్చలు జరిపారు. అమ్మకందారు-కొనుగోలుదారులుగా కాకుండా అంతకంటే మంచి భాగస్వామ్యంతో ముందకెళ్తామని అన్నారు. ట్రేడ్ సెక్టార్, పెట్టుబడులు, వాతావరణ మార్పులు, ఎనర్జీ తదితర ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. చైనా ఎన్ఎస్ జీలో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తుండటంతో మెక్సికో, స్విట్జర్లాండ్ల మద్దతు భారత్ కు కలిసొచ్చే అంశం. భారత్ కు న్యూక్లియర్ ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ఎన్పీటీలో స్థానం లేదని చైనా వాదిస్తుండగా.. భారత్ ట్రాక్ రికార్డు కారణంగా తాము, మిగతా దేశాలు ఇందుకు సపోర్ట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం తెలిపిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ జీ స్థానం వల్ల అటామిక్ ఎనర్జీ సెక్టార్ లో భారత్ భారీగా లాభపడుతుంది.