టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM) భారత ప్రభుత్వం టీసీఎస్‌ను పార్టనర్‌గా ఎంచుకుంది. ఈ మేరకు టీసీఎస్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. దీనికి ప్రకారం ప్రభుత్వ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌కి ఆన్‌ఇన్‌క్లూజివ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉండనుంది. క్లౌడ్ న్యూట్రాలిటీ, ఇంటర్ ఆపెరాబిలిటీ వంటి కొత్త టెక్నాలజీ సాయంతో, కొత్త GeM ప్లాట్‌ఫారమ్‌ను బహుభాషల్లో,ఓపెన్ సోర్స్-ఆధారితంగా సరికొత్తగా తీర్చిదిద్దనుంది.
ప్రస్తుత ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌ను మెరుగైన సామర్థ్యం, పారదర్శకత, సమగ్రతతో అత్యాధునిక ప్రజా సేకరణ వేదికగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. GeM అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు (PSUలు) ఎండ్-టు-ఎండ్ మార్కెట్ ప్లేస్. సాధారణ వినియోగ వస్తువులు సేవలను పారదర్శకంగా, సమర్ధవంతంగా సేకరించేందుకు ఎంటిటీలు దీనిని ఉపయోగిస్తాయి. (అమ్మకోసం... భళా బుడ్డోడా! వైరల్ వీడియో)
ఈ ఇ-మార్కెట్‌ప్లేస్ ప్రస్తుత వ్యాపార విలువ రూ. 2 ట్రిలియన్లకు పైగా ఉంది. 70,000 కంటే ఎక్కువ కొనుగోలుదారుల సంస్థలు, 6.5 మిలియన్ సెల్లర్స్, సర్వీస్ ప్రొవైడర్స్‌ఉన్నారు. వీరిలో 800,000 కంటే ఎక్కువ మధ్యస్థ ,చిన్న సంస్థలతో సహా 6.5 మిలియన్లకు పైగా అమ్మకందారులున్నారని టీసీఎస్ తెలిపింది. ప్రస్తుత ప్లాట్‌ఫారమ్ విజయ వంతమైనప్పటికీ. వినియోగదారుల అవసరాలను తీర్చడంలో నిర్మాణపరమైన సవాళ్లను కలిగి ఉందని పేర్కొంది. (టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, ఆసక్తికర విషయాలు)
ఈ నేపథ్యంలో తాజా భాగస్వామ్యంతో ప్రస్తుత ప్లాట్‌ఫారమ్‌ను కొనసాగిస్తూనే, డిజైన్, కొత్త టెక్నాలజీలను ప్రభావితం చేసే కొత్త ఆధునిక పరిష్కారాన్ని నిర్మిస్తుందని కూడా టీసీఎస్ పబ్లిక్ సర్వీసెస్ ఇండియా బిజినెస్ హెడ్ తేజ్ పాల్ భట్ల వెల్లడించారు. (స్మార్ట్‌ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం)
జీఈఎం కొత్త వెర్షన్‌ను రీడిజైనింగ్,రూపకల్పనకు ప్రభుత్వ కాంట్రాక్టు టీసీఎస్ దక్కించుకోవడంపై జీఈఎం సీఈవోపీకే సింగ్ మాట్లాడుతూ కొత్త అవతార్‌లో తమ జీఈఎం, మెరుగైన వ్యాపార సౌలభ్యాన్ని, పారదర్శకతను అందిస్తుందన్నారు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ పార్టనర్‌గా టీసీఎస్ ఎంపిక ద్వారా, వరల్డ్ క్లాస్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసి,యూజర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తామనే హామీ ఇస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment