e marketing
-
కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్
టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM) భారత ప్రభుత్వం టీసీఎస్‌ను పార్టనర్‌గా ఎంచుకుంది. ఈ మేరకు టీసీఎస్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. దీనికి ప్రకారం ప్రభుత్వ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కి ఆన్ఇన్క్లూజివ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉండనుంది. క్లౌడ్ న్యూట్రాలిటీ, ఇంటర్ ఆపెరాబిలిటీ వంటి కొత్త టెక్నాలజీ సాయంతో, కొత్త GeM ప్లాట్‌ఫారమ్‌ను బహుభాషల్లో,ఓపెన్ సోర్స్-ఆధారితంగా సరికొత్తగా తీర్చిదిద్దనుంది. ప్రస్తుత ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌ను మెరుగైన సామర్థ్యం, పారదర్శకత, సమగ్రతతో అత్యాధునిక ప్రజా సేకరణ వేదికగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. GeM అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు (PSUలు) ఎండ్-టు-ఎండ్ మార్కెట్ ప్లేస్. సాధారణ వినియోగ వస్తువులు సేవలను పారదర్శకంగా, సమర్ధవంతంగా సేకరించేందుకు ఎంటిటీలు దీనిని ఉపయోగిస్తాయి. (అమ్మకోసం... భళా బుడ్డోడా! వైరల్ వీడియో) ఈ ఇ-మార్కెట్‌ప్లేస్ ప్రస్తుత వ్యాపార విలువ రూ. 2 ట్రిలియన్లకు పైగా ఉంది. 70,000 కంటే ఎక్కువ కొనుగోలుదారుల సంస్థలు, 6.5 మిలియన్ సెల్లర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ఉన్నారు. వీరిలో 800,000 కంటే ఎక్కువ మధ్యస్థ ,చిన్న సంస్థలతో సహా 6.5 మిలియన్లకు పైగా అమ్మకందారులున్నారని టీసీఎస్ తెలిపింది. ప్రస్తుత ప్లాట్‌ఫారమ్ విజయ వంతమైనప్పటికీ. వినియోగదారుల అవసరాలను తీర్చడంలో నిర్మాణపరమైన సవాళ్లను కలిగి ఉందని పేర్కొంది. (టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, ఆసక్తికర విషయాలు) ఈ నేపథ్యంలో తాజా భాగస్వామ్యంతో ప్రస్తుత ప్లాట్‌ఫారమ్‌ను కొనసాగిస్తూనే, డిజైన్, కొత్త టెక్నాలజీలను ప్రభావితం చేసే కొత్త ఆధునిక పరిష్కారాన్ని నిర్మిస్తుందని కూడా టీసీఎస్ పబ్లిక్ సర్వీసెస్ ఇండియా బిజినెస్ హెడ్ తేజ్ పాల్ భట్ల వెల్లడించారు. (స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం) జీఈఎం కొత్త వెర్షన్‌ను రీడిజైనింగ్,రూపకల్పనకు ప్రభుత్వ కాంట్రాక్టు టీసీఎస్ దక్కించుకోవడంపై జీఈఎం సీఈవోపీకే సింగ్ మాట్లాడుతూ కొత్త అవతార్‌లో తమ జీఈఎం, మెరుగైన వ్యాపార సౌలభ్యాన్ని, పారదర్శకతను అందిస్తుందన్నారు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ పార్టనర్‌గా టీసీఎస్ ఎంపిక ద్వారా, వరల్డ్ క్లాస్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసి,యూజర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తామనే హామీ ఇస్తున్నామన్నారు. -
గ్రామాల్లో ‘మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు’
సాక్షి, అమరావతి: ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెటింగ్ చేసుకోలేక అన్నదాతలు పడుతున్న వెతలకు త్వరలో తెరపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులైనా రైతు నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లను వేగవంతం చేసింది. మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం.. గ్రామాల్లో పండించిన పంటను స్థానికంగా విక్రయించేలా ఆర్బీకేల సమీపంలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటవుతాయి. రూ.2,718.11 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటయ్యే ఈ కేంద్రాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.264.2 కోట్లు ఖర్చు చేయనుండగా కేంద్రం రూ.74 కోట్లు సబ్సిడీగా అందించనుంది. రూ.2,361.1కోట్లను అగ్రి ఇన్ఫర్ ఫండ్ (ఏ.ఐ.ఎఫ్) కింద వడ్డీ ఉపసంహరణ స్కీమ్ ద్వారా ఒక శాతం వడ్డీకి నాబార్డు రుణం రూపంలో అందించనుంది. రైతు కమిటీల ద్వారా కొనుగోలు చేసే కొన్ని రకాల పరికరాలకు సంబంధించి రూ.18.9 కోట్లు లబ్ధిదారుల వాటా కింద భరించాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల కోసం ఆర్బీకేల సమీపంలో 50 సెంట్ల నుంచి ఎకరం స్థలాన్ని సమీకరిస్తున్నారు. గ్రామస్థాయిలో మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో పంటకోతకు ముందు, తర్వాత రైతులకు మౌలిక సదుపాయాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఈఎఫ్‌ఎఆర్ మార్కెట్.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ఇదీ.. దళారీల బెడద లేకుండా పంట ఉత్పత్తులను రైతులు నేరుగా కళ్లాల నుంచి విక్రయించుకునే అవకాశం ఇ–మార్కెటింగ్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా కల్పించనున్నారు. దీనిద్వారా ప్రతి రైతును అఖిల భారత మార్కెట్‌కు అనుసంధానిస్తారు. గిట్టుబాటు ధర లభించే వరకు ఈ సెంటర్లలో నిల్వ చేసుకుని తమకు నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఏ గ్రామంలో ఏ ఉత్పత్తులు పండిస్తున్నారు? సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు? నాణ్యత ఎలా ఉంది? దిగుబడి ఎంత? తదితర అంశాలను ఈ ప్లాట్పామ్ ద్వారా వ్యాపారులు సైతం తెలుసుకోవచ్చు. త్వరలో టెండర్లు ఆర్బీకేలకు అనుసంధానంగా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే వచ్చే నెలలో రివర్స్ టెండరింగ్ ద్వారా టెండర్లను పిలవబోతున్నాం. ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపి ఆ తర్వాత టెండర్లను పిలుస్తాం. మార్చిలో ఈ ప్రక్రియ పూర్తి చేసి ఏప్రిల్‌లో పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వీటిని దశలవారీగా 2022 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని సంకల్పించాం’ – ప్రద్యుమ్న, మార్కెటింగ్ శాఖ కమిషనర్ మౌలిక సదుపాయాలివే ప్రధానంగా రూ.1,637.05 కోట్లతో 4,277 డ్రై స్టోరేజ్, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్స్, రూ.331.80 కోట్లతో ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం 60 అధిక నిల్వ సామర్థ్యం కలిగిన గిడ్డంగులు, రూ.188.73 కోట్లతో 1,483 కలెక్షన్ సెంటర్లు (ధాన్యం సేకరణ కేంద్రాలు), కోల్డ్ రూమ్స్ (శీతల గిడ్డంగులు), టర్మరిక్ బాయిలర్స్/పాలిషర్స్, రూ.378.24కోట్లతో 7,950 ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ (ధాన్యం శుద్ధి పరికరాలు), రూ.60.86 కోట్లతో 10,687 ఎస్సాయింగ్ ఎక్విప్మెంట్ (ధాన్యం నాణ్యత పరీక్షించే సామగ్రి), రూ.108.92 కోట్లతో 10,678 ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఎక్విప్మెంట్ (ధాన్యం కొనుగోలు సామగ్రి) కొనుగోలు చేయనున్నారు. కళ్లాల నుంచే ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకునేందుకు రూ.12.51 కోట్లతో ‘ఇ–మార్కెటింగ్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్’తెస్తున్నారు. చదవండి: (సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆతిథ్యం) -
రైతుల ఆదాయం రెట్టింపు కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి :ఈ–మార్కెటింగ్ ఫ్లాట్‌ఫామ్ వల్ల రైతులు తమ ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతు తన పంటను అమ్ముకోవాలంటే జనతా బజార్లు అందుబాటులోకి రావాలి. రైతు భరోసా కేంద్రాలు ఫంక్షనింగ్‌లోకి రావాలని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల పక్కన దాదాపు రూ.6 వేల కోట్లతో మల్టిపర్పస్ ఫెసిలిటీస్ ఏర్పాటుపై చర్చ జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ – మార్కెటింగ్ మల్టిపర్పస్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు అన్నీ కూడా ఆప్కాబ్ ద్వారా నాబార్డ్‌కు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. (చక్కని వసతులు.. ఇంగ్లిష్ మాటలు) ఆర్బీకేలను బలోపేతం చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉండాలన్న సీఎం వైఎస్ జగన్ మెటీరియల్, సీడ్స్, ఫర్టిలైజర్స్ అన్ని నాణ్యతగా ఉండాలన్నారు.. రైతు భరోసా కేంద్రాల వద్ద మొత్తం 13 రకాల సదుపాయాల కల్పన. అవీ.. గోదాములు, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్, కలెక్షన్ సెంటర్స్, కోల్డ్ రూమ్‌లు – స్టోరేజిలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్మెంట్, జనతా బజార్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, సెలక్టెడ్ గ్రామాల్లో ఆక్వా ఇన్ఫ్రా, సెలక్టెడ్ గ్రామాల్లో క్యాటిల్ షెడ్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, (ప్లాస్మా దానం చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ) ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీ) ను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జరిపిన సమీక్షలో పీఏసీఎస్‌ల ముందున్న సవాళ్ళు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా గోదాముల వద్దే జనతా బజార్లు ఏర్పాటు చేయడంపై అనుకూలతలు, ప్రతికూలతలపై అధ్యయనం చేసి నివేదిక సిద్దం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పీఏసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీనిపై ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై ఆర్థికశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. . ఈ–క్రాపింగ్: పంటల ఈ–క్రాపింగ్ వల్ల వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం నమోదవుతుందని తెలిపిన వైఎస్ జగన్ దాని వల్ల పంటలకు బీమా ప్రీమియమ్ చెల్లింపుతో పాటు, వాటికి గిట్టుబాటు ధర కల్పన, పంట నష్టం జరిగితే పరిహారం చెల్లింపు వంటివి ఎంతో సులభతరం అవుతాయని తెలిపారు. అలాగే పలు అనేక అంశాలపై చర్చించిన సీఎం వైఎస్ జగన్ ఈ కింది విధంగా పేర్కొన్నారు. (అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే: కేంద్రం) రైతులు–సంక్షేమం: రైతులకు వీలైనంత వరకు లబ్ది పొందేలా చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి పెట్టాలి. రైతుల ఆదాయం రెట్టింపు కావాలి. ఆ ప్రక్రియలో ఈ–మార్కెట్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి రావాలి.ప్రతీ అంశం కూడా ఒకదానికొకటి కనెక్ట్ కావాలి. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గాలి. మరోవైపు వారి పంటలకు తగిన గిట్టుబాటు ధరలు రావాలి. అప్పుడే వారు సంతోషంగా జీవించగలుగుతారు. ఆ దిశలో ఏ విధంగా రైతలకు మేలు జరుగుతుందో ఆ విధానాలను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోండి. ఆసరా, చేయూత పధకాలు కూడా మెజార్టీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం. (అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం : వైఎస్ జగన్) డైరీ రంగం: కేవలం పాల ధర పెంచినంత మాత్రాన రైతులకు పూర్తి ప్రయోజనం కలగదు. దానికి అనుబంధంగా చాలా ఉన్నాయి. అందుకే ఆ దిశలో ప్రభుత్వం అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. మహిళలకు ఉపాధి కల్పించడం, వారికి ఆదాయం పెంచడం కోసం పలు సంస్థలతో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది. ఉపాధి అవకాశాలు కోరుతూ ఇప్పటికే లక్షకు పైగా మహిళల నుంచి దరఖాస్తులు వచ్చాయి. నాణ్యమైన విద్యుత్ సరఫరా: క్వాలిటీ పవర్ ఇవ్వాలంటే మీటర్లు ఉండాలి. అప్పుడే ఫీడర్లపై భారం ఎంతో కూడా తెలుస్తుంది. ప్రభుత్వమే నేరుగా రైతుకు ప్రత్యేక అకౌంట్లలో డబ్బు జమ చేస్తుంది. అందువల్ల ఎక్కడా రైతులకు విద్యుత్ బిల్లుల సమస్య ఉండదు. వారిపై ఒక్క రూపాయి కూడా భారం పడదు. వచ్చే 30 ఏళ్ళ వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా కూడా ఒక విజన్‌తో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న ప్రణాళిక. విజన్ అన్న దానికి ఉదాహరణ: నాడు శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులను కేవలం కొన్ని వేల కోట్ల రూపాయలతోనే కట్టారు. అదే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.55 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. ఇదే ప్రాజెక్టు మరో 10 ఏళ్లు ఆలస్యం అయితే ఖర్చు రెండింతలు పెరుగుతుంది. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తున్నాము. గోదాముల నిర్మాణం: గోదాముల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలి?. ఎప్పుడు పూర్తి చేయాలి?. బడ్జెట్ నిధులు వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్దం చేయాలి. ఆ ప్రణాళికలో జనతా బజార్లను, ఆక్వా రంగాన్ని కూడా కలపండి. ఈ–మార్కెటింగ్: ఈ–మార్కెటింగ్ ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటుపై మరింత దృష్టి పెట్టండి. ఈ మార్కెటింగ్ ఫ్లాట్‌ఫామ్ వచ్చే ఖరీఫ్ నాటికి సిద్దం చేయాలి. జనతా బజార్లు, షెడ్యూలింగ్, సెకండరీ ప్రాసెసింగ్‌కు సంబంధించి వెంటనే తగిన ప్రణాళిక సిద్ధం చేయాలి. ఆ తర్వాత పంటలకు కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)పై కసరత్తు చేయాలి. రెవెన్యూ రికార్డులు: 2016లో గత ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ (ఆన్లైన్ రికార్డులు) పేరుతో రికార్డులను తారు మారు చేశారని, ఇష్టానుసారం పేర్లు మార్చేశారని సమావేశంలో అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రస్తావించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతో ఆ పని చేశారని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం వైయస్ జగన్, ఈ అంశాన్ని రానున్న స్పందన సమీక్ష ఎజెండాలో చేర్చి, కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమీషనర్ పిఎస్ ప్రద్యుమ్న, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ అరుణ్‌కుమార్, నాబార్డు సీజీఎం ఎస్కే జన్నావర్‌తో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
చేనేత వస్త్రాలకు ‘ఈ–మార్కెటింగ్’
సాక్షి, అమరావతి: గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి చేనేత వస్త్రాలకు ‘ఈ–మార్కెటింగ్’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. నేత నైపుణ్యానికి పట్టం కట్టించేలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను అందులో మంత్రి వివరించారు. ► రాయలసీమ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ► కరోనా కష్టకాలంలో 6 నెలల ముందుగానే రెండవ ఏడాది సాయం అందించాం. ► చేనేత రుమాళ్లను, దుస్తులను విరివిగా కొనుగోలు చేస్తే నేతన్నలను ప్రోత్సహించినట్టే. ► ఇప్పటికే ఆప్కో ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుస్తులు, దుప్పట్లు అందిస్తోంది. ► అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ–కామర్స్ సైట్లతో ఒప్పందం చేసుకొని ఆప్కో వస్త్రాలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చాం. ► ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి చీరలు, డ్రస్ మెటీరియల్స్, చొక్కాలు, ధోవతులు సహా మొత్తం 104 ఉత్పత్తులు ఆన్‌లైన్‌లోకి తెచ్చాం. చేనేత పరిశ్రమకు భరోసా ఇవ్వడమే కాకుండా, నేతన్న ఆర్థికంగా లాభపడే విధంగా ఉత్పత్తులకు ప్రభుత్వమే సర్టిఫికేషన్, మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించనుంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. 13 నెలల కాలంలోనే చేనేతలకు రూ.600 కోట్ల సాయం అందించింది. ► ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ ద్వారా దాదాపుగా 81,024 కుటుంబాలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. -
ఈ–మార్కెటింగ్‌కు కేంద్రం నిధులు
అసిస్టెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అడ్వయిజర్ జవహర్ పొదలకూరు: ప్రభుత్వం నిర్వహించే యార్డుల్లో ఈ–మార్కెటింగ్ సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క యార్డుకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు అసిస్టెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అడ్వయిజర్(మినిస్ట్రి ఆఫ్ అగ్రికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) ఎం.జవహర్ పేర్కొన్నారు. పొదలకూరు ప్రభుత్వ నిమ్మమార్కెట్ యార్డును బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మార్కెట్లలో మోసపోకుండా ఈ–మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టి ఆన్లైన్ పద్ధతిలో రైతులు తీసుకువచ్చే పంటలను కొనుగోలు చేస్తామన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్ మంత్రిత్వ శాఖ దేశంలోని రాష్ట్రాలకు గైడ్‌లైన్స్ ఇచ్చిందన్నారు. 17 రాష్ట్రాలు కేంద్రం గైడ్‌లైన్స్‌ను పాటించేందుకు సమ్మతించినట్లు తెలిపారు. అందులో ఏపీ కూడా ఉందన్నారు. తొలివిడతగా పైలెట్ ప్రాజెక్టు కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో 21 మార్కెట్లలో ఈ–ట్రేడింగ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేశామన్నారు. రెండో విడతలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 200 మార్కెట్లలో ఈ–ట్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 12 చోట్ల ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రాపూరు మార్కెట్ కమిటీ పరిధిలోని పొదలకూరు నిమ్మమార్కెట్‌ను ఎంపిక చేశామన్నారు. నాగార్జున ఫర్టిలైజర్స్ కెమికల్స్ వారు రూపొందించిన సాప్ట్‌వేర్‌ను ఈ–మార్కెట్లో ఉపయోగిస్తామన్నారు. అడ్వయిజర్ వెంట మార్కెటింగ్‌శాఖ ఏడీ ఉపేంద్ర, రాపూరు మార్కెట్ కమిటీ సెక్రటరీ ఎం.శ్రీనివాసులు ఉన్నారు. -
ఈ–మార్కెటింగ్‌తో రైతుకు లబ్ధి
ఆర్మూర్ : రైతులకు లబ్ధి చేకూర్చేందుకే దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ మార్కెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రైతుబజార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్మూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్మించిన గోదామును ఆయన బుధవారం పరిశీలించారు. మొక్కను నాటిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ మార్కెటింగ్ విధానాన్ని 2014లో ప్రయోగాత్మకంగా వరంగల్, బూరేపల్లి, మలక్పట్, తిరుమలగిరి మార్కెట్ యార్డుల్లో చేపట్టామన్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని క్రమ క్రమంగా దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని తెలిపారు. ఈ మార్కెటింగ్ ద్వారా రైతులు పండించిన పంటను దేశ వ్యాప్తంగా అమ్ముకొని లాభపడే అవకాశాలు ఏర్పడతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రా ల్లో రైతు బజార్లను ఏర్పాటు చేయడానికి చర్య లు తీసుకుంటున్నామని పార్థసారథి చెప్పారు. ఇప్పటికే 36 రైతుబజార్లు ఉండగా, కొత్తగా మరో 25 ఏర్పాటు చేసేందుకు రూ.44 కోట్లు మంజూ రు చేశామన్నారు. మున్సిపల్ అధికారులు స్థలం కేటాయిస్తే, రైతు బజార్ నిర్మిస్తామని తెలిపారు. నాబార్డు నిధులతో రాష్ట్ర వ్యా ప్తంగా 330 గోదాముల నిర్మాణం, రూ .220 కోట్లతో మార్కె ట్ యార్డుల్లో మౌలిక సదుపాయల కల్పన పనులు చేపట్టామని వివరించారు. చెట్లుంటేనే వర్షాలు కురుస్తాయని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర తిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. వ్యవసాయ శాఖకు పది లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే 9.20 లక్షల మొక్కలు నాటామన్నారు. మార్కెటింగ్ ఈఈ గోవర్ధన్‌రెడ్డి, ఏడీ రియాజ్, డీఈ గణేష్, హరితహారం స్పెషల్ ఆఫీసర్ సయ్యద్ ఇఫ్తకార్, ఆర్మూర్ మార్కెట్ యార్డు కార్యదర్శి పీర్ నాయక్, జెడ్పీటీసీ సభ్యుడు సాందన్న, కౌన్సిలర్ రమాకాంత్, జాగిర్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. హరితహారంతోనే తెలంగాణ నందనవనం భిక్కనూరు : హరితహారంతోనే తెలంగాణ నందనవనంగా మరుతుందని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంలోని జంగంపల్లిలో నిర్మిస్తున్న గిడ్డంగి పనులను పరిశీలించారు. పనులు సత్వరమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. గిడ్డంగి ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అడవులు అంతరించడం వల్లనే వర్షాలు తగ్గుముఖం ప ట్టాయని, వాతావరణ కాలుష్యం పెరుగుతోందన్నారు. ప్రతీ ఒక్కరు ఏటా పది మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూ చించారు. రానున్న రోజుల్లో తాగు, సాగు నీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలను నాటాలన్నారు. భిక్కనూరు ఏఎంసీ చైర్మన్ అమృతరెడ్డి, డైరెక్టర్లు సత్యనారాయణ, లలిత, కాశీనాథ్, మార్కెటింగ్ శాఖ స్పెషల్ అధికారి ఇఫే్తకార్ నజబ్, ఏడీఎం మహ్మద్ రియాజ్, ఈఈ గోవర్ధన్‌రెడ్డి, డీఈ గణేష్, ఏఈ రవీందర్, భిక్కనూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి నజీరొద్దీన్, సూపర్‌ౖÐð జర్తామస్లపాల్గొన్నారు.