ఈ–మార్కెటింగ్‌తో రైతుకు లబ్ధి
ఈ–మార్కెటింగ్‌తో రైతుకు లబ్ధి
Published Thu, Aug 11 2016 12:03 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
ఆర్మూర్ : రైతులకు లబ్ధి చేకూర్చేందుకే దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ మార్కెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రైతుబజార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్మూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్మించిన గోదామును ఆయన బుధవారం పరిశీలించారు. మొక్కను నాటిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ మార్కెటింగ్ విధానాన్ని 2014లో ప్రయోగాత్మకంగా వరంగల్, బూరేపల్లి, మలక్‌పట్, తిరుమలగిరి మార్కెట్ యార్డుల్లో చేపట్టామన్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని క్రమ క్రమంగా దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని తెలిపారు. ఈ మార్కెటింగ్ ద్వారా రైతులు పండించిన పంటను దేశ వ్యాప్తంగా అమ్ముకొని లాభపడే అవకాశాలు ఏర్పడతాయన్నారు.
రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రా ల్లో రైతు బజార్‌లను ఏర్పాటు చేయడానికి చర్య లు తీసుకుంటున్నామని పార్థసారథి చెప్పారు. ఇప్పటికే 36 రైతుబజార్లు ఉండగా, కొత్తగా మరో 25 ఏర్పాటు చేసేందుకు రూ.44 కోట్లు మంజూ రు చేశామన్నారు. మున్సిపల్ అధికారులు స్థలం కేటాయిస్తే, రైతు బజార్ నిర్మిస్తామని తెలిపారు. నాబార్డు నిధులతో రాష్ట్ర వ్యా ప్తంగా 330 గోదాముల నిర్మాణం, రూ .220 కోట్లతో మార్కె ట్ యార్డుల్లో మౌలిక సదుపాయల కల్పన పనులు చేపట్టామని వివరించారు. చెట్లుంటేనే వర్షాలు కురుస్తాయని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర తిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. వ్యవసాయ శాఖకు పది లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే 9.20 లక్షల మొక్కలు నాటామన్నారు. మార్కెటింగ్ ఈఈ గోవర్ధన్‌రెడ్డి, ఏడీ రియాజ్, డీఈ గణేష్, హరితహారం స్పెషల్ ఆఫీసర్ సయ్యద్ ఇఫ్తకార్, ఆర్మూర్ మార్కెట్ యార్డు కార్యదర్శి పీర్ నాయక్, జెడ్పీటీసీ సభ్యుడు సాందన్న, కౌన్సిలర్ రమాకాంత్, జాగిర్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు.
హరితహారంతోనే తెలంగాణ నందనవనం
భిక్కనూరు : హరితహారంతోనే తెలంగాణ నందనవనంగా మరుతుందని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంలోని జంగంపల్లిలో నిర్మిస్తున్న గిడ్డంగి పనులను పరిశీలించారు. పనులు సత్వరమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. గిడ్డంగి ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అడవులు అంతరించడం వల్లనే వర్షాలు తగ్గుముఖం ప ట్టాయని, వాతావరణ కాలుష్యం పెరుగుతోందన్నారు. ప్రతీ ఒక్కరు ఏటా పది మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూ చించారు. రానున్న రోజుల్లో తాగు, సాగు నీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలను నాటాలన్నారు. భిక్కనూరు ఏఎంసీ చైర్మన్ అమృతరెడ్డి, డైరెక్టర్లు సత్యనారాయణ, లలిత, కాశీనాథ్, మార్కెటింగ్ శాఖ స్పెషల్ అధికారి ఇఫే్తకార్ నజబ్, ఏడీఎం మహ్మద్ రియాజ్, ఈఈ గోవర్ధన్‌రెడ్డి, డీఈ గణేష్, ఏఈ రవీందర్, భిక్కనూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి నజీరొద్దీన్, సూపర్‌ౖÐð జర్‌తామస్‌లపాల్గొన్నారు.
Advertisement
Advertisement