ఢిల్లీ: ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో కేంద్రం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయితీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో.. ఆప్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆర్డినెన్స్ నిలుపుదలకై ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది.
అదే సమయంలో ఆప్ పిటిషన్ ఆధారంగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికి అనుకూలంగా ఇది వరకే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పాలనాధికారం ఢిల్లీ సర్కార్‌దేనని మే 11ద తేదీ తీర్పులో స్పష్టం చేసింది. ఆపై.
కేంద్రం ఆ తీర్పుపై రివ్యూకు వెళ్లడం, ఆ ఆర్డినెన్స్‌ను ఆప్ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. ఈ గ్యాప్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా 400 మంది రీసెర్చ్ ఆఫీసర్లు, ఇతరులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. కేంద్రం ఆదేశాలపై రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంలో మరో పిటిషన్ వేసింది ఆప్ ప్రభుత్వం.
సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రం ఆదేశాలపై నిలుపుదల ఇవ్వలేమని, అయితే ఈ పిటిషన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఇంప్లీడ్ చేయడానికి నోటీసులు కేంద్రానికి మాత్రం జారీ చేయగలమని పేర్కొంది. అలాగే.. వచ్చే సోమవారం ఈ పిటిషన్‌పై వాదనలు వింటామని తెలిపింది. అంతకు ముందు.. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ ఓ సూపర్ సీఎంలా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపింది.
► అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ మే 19వ తేదీన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది కేంద్రం.
► అయితే.. ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ అధికారాలను ఈ ఆర్డినెన్స్ దూరం చేస్తుందని ఢిల్లీ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ఈ ఆర్డినెన్స్‌ను అభివర్ణించింది.
► ఈ మధ్యలోనే సుప్రీం కోర్టు ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ఎల్జీ సాయంతో కేంద్రం తాను అనుకున్నది చేసుకుంటూ పోతోంది.
► మరోవైపు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకా పార్టీల మద్దతు కూడగట్టే పని సైతం చేశారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పలు రాష్ట్రాలు తిరిగి.. ఆయా సీఎంలతో భేటీ అయ్యి మద్దతు కోరారు. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ మాత్రం ఎటూ స్పందించలేదు.
► ఇక.. దీన్నొక చీకటి ఆర్డినెన్స్‌గా పేర్కొంటూ ఆప్.. ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తూ వస్తోంది.
ఇదీ చదవండి: ఆయనే ప్రధాని కావాలని అంతా కోరుకుంటున్నారు!
Comments
Please login to add a commentAdd a comment